రూ.9,999లకే ఐబాల్ ల్యాప్టాప్ ‘కాంప్ బుక్’ | i ball laptop now only 'campbook' 9,999 | Sakshi
Sakshi News home page

రూ.9,999లకే ఐబాల్ ల్యాప్టాప్ ‘కాంప్ బుక్’

Published Thu, May 12 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

రూ.9,999లకే ఐబాల్ ల్యాప్టాప్ ‘కాంప్ బుక్’

రూ.9,999లకే ఐబాల్ ల్యాప్టాప్ ‘కాంప్ బుక్’

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఐబాల్ తాజాగా ‘కాంప్‌బుక్’ ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలున్న ఈ ల్యాప్‌టాప్ రెండు వేరియంట్లలో లభ్యంకానున్నది. 11.6 అంగుళాల స్క్రీన్ ఉన్న ‘కాంప్‌బుక్ ఎక్స్‌లాన్స్’ ల్యాప్‌టాప్ ధర రూ.9,999గా, 14 అంగుళాల స్క్రీన్ ఉన్న ‘కాంప్‌బుక్ ఎక్జెంపులర్’ ల్యాప్‌టాప్ ధర రూ.13,999గా ఉందని కంపెనీ పేర్కొంది. ‘కాంప్‌బుక్’ తయారీ కోసం టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపింది. కాగా కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తన ఆదాయంలో 30 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement