ఐబాల్ ఆండీ ఫ్రిస్‌బీ...
దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐబాల్ తాజాగా ఫ్రిస్‌బీ, స్టాలియన్ పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫ్రిస్‌బీ రూ.5799, స్టాలియన్ రూ.6999లకు ఈకామర్స్ సైట్ల ద్వారా లభిస్తున్నాయి. ఫ్రిస్‌బీ ఫీచర్ల విషయానికొస్తే... ఇది లేటెస్ట్ ఓఎస్ కిట్‌క్యాట్‌తో నడుస్తుంది. నాలుగు అంగుళాల స్క్రీన్‌సైజున్న ఈ ఫోన్‌లో 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను వాడారు. ఒక జీబీ ర్యామ్, 4జీబీల ప్రధాన మెమరీ ఉన్నాయి. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 8 ఎంపీ, సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 0.3 ఎంపీ మాత్రమే. బ్యాటరీ సామర్థ్యం 1600 ఎంఏహెచ్ మాత్రమే. ఇక స్టాలియన్ ఫీచర్లను పరిశీలిస్తే... దీని స్క్రీన్ సైజు అయిదు అంగుళాలు కాగా, బ్యాటరీ సామర్థ్యం 1700 ఎంఏహెచ్. మిగిలిన ఫీచర్లన్నీ ఫ్రిస్‌బీతో సమానంగా ఉన్నాయి. రెండు ఫోన్లకూ త్రీజీ, ఎడ్జ్,జీపీఆర్‌ఎస్, వైఫై 802.11.బీ/జీ/ఎన్, మైక్రోయూఎస్‌బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి.
జోల్లా సెయిల్‌ఫిష్...
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సరికొత్త ఎంట్రీ ఈ జోలా సెయిల్‌ఫిష్ ఓఎస్. ఆండ్రాయిడ్, విండోస్, ఆపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల తరువాత ఫైర్‌ఫాక్స్ ఓఎస్ అందుబాటులోకి రాగా తాజాగా ఈ సరికొత్త ఓఎస్ సెయిల్‌ఫిష్ మార్కెట్‌లోకి వచ్చింది. మాజీ నోకియా ఉద్యోగులు కొందరు ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్ అనేక ఆసక్తికరమైన ఫీచర్లు కలిగి ఉంది. ఇటీవలే భారతీయ మార్కెట్‌లో విడుదలై ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.16,499. సెయిల్‌ఫిష్ ఓఎస్ ప్రత్యేకత దాని యూజర్ ఇంటర్ఫేస్, మల్టీటాస్కింగ్ సామర్థ్యాల్లో ఉందని నిపుణులు అంటున్నారు. స్క్రీన్‌సైజు 4.5 అంగుళాలు కాగా, దీంట్లో 1.4 గిగాహెర్ట్జ్‌డ్యుయెల్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ఫోన్‌ను ఉపయోగించారు. రామ్ ఒక జీబీ, ఇంటర్నల్ స్టోరేజీ 16 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మెమరీని మరింత పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా 8 ఎంపీ రెజల్యూషన్‌తో, సెల్ఫీ కెమెరా 2ఎంపీ రెజల్యూషన్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లోని చాలావరకూ అప్లికేషన్లను సపోర్ట్ చేయడం మరో విశేషం. ఎస్‌ఎంఎస్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి అన్ని రకాల మెసేజింగ్‌లు ఒకేచోట ఉండటం మరో ఆసక్తికరమైన ఫీచర్.
కొత్తసరుకు
Published Tue, Oct 14 2014 11:52 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Advertisement