గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమిని వెనక్కి నెట్టిన యాపిల్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇటీవల యాపిల్ విడుదల చేసిన 'ఐఫోన్ -13 ప్రో'ను సెకన్ల వ్యవధిలో 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ హ్యాక్ చేశారని చైనాకు చెందిన టెక్ అనాలసిస్ సంస్థ ఐథోమ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
షావోమిని వెనక్కి నెట్టింది.. కానీ
గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం..ఈ ఏడాది క్యూ3 (జులై నుంచి సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో టెక్ దిగ్గజం యాపిల్ 15 శాతం వాటాతో.. చైనాకు చెందిన షావోమిని అధిగమించింది. తిరిగి రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అందుకు కారణం ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమేనని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్'ను ఈ ఏడాది నిర్వహించింది. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్‌లో యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌లను విడుదల చేసింది.
సెక్యూరిటీ విషయంలో తిరుగు లేదు
ఈ సందర్భంగా యాపిల్ ప్రతినిధులు మాట్లాడుతూ తాము విడుదల చేసే, లేదంటే విడుదల కానున్న ఐఫోన్‌లలో ప్రైవసీ,సెక్యూరిటీ విషయంలో రాజీపడబోమని తెలిపారు. కానీ చైనా 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ మాత్రం ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఎలా హ్యాక్ చేయొచ్చో..తాజాగా యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13సిరీస్ ఫోన్‌లను సెకన్లలో హ్యాక్ చేయొచ్చని తెలిపారు.
ఒక్క సెకన్‌లో హ్యాక్ చేశారు
ఇటీవల చైనాలో 4వ 'టియాన్‌ఫు కప్' ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాంటెస్ట్ జరిగింది. ఈ కాంటెస్ట్‌లో వైట్ హ్యాట్ హ్యాకర్ ఐఫోన్ 13 ప్రోని సెకన్‌లలో హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసిన హ్యాకర్ ఐఫోన్‌లో ఉన్న ఫోటో ఆల్బమ్, యాప్‌లకు యాక్సెస్ చేశాడు. అంతేకాదు అందులో ఉన్న డేటాను ఈజీగా డిలీట్ చేయడం సాధ్యమైందని ఐథోమ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. మరి ఈ ఐఫోన్13 ప్రో హ్యాకింగ్ పై ఐఫోన్ ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
వైట్ హ్యాట్ హ్యాకర్లు అంటే ఎవరు
వైట్ హ్యాట్ హ్యాకర్లు లేదా ఎథికల్ హ్యాకర్స్. ఈ హ్యాకర్స్‌ను ఆయా సంస్థల్లో లేదంటే, టెక్నాలజీలోని లోపాల్ని గుర్తిస్తారు. నిబంధనలకు అనుగుణంగా లోపాల్ని గుర్తించేలా పనిచేసే వీళ్లని ఆయా టెక్ సంస్థలు, లేదంటే ప్రభుత్వాలు సైతం నియమించుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment