ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' మొబైల్ వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తప్పకుండా ఐఫోన్స్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాలోని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్‌లను అందించడం ప్రారంభించినట్లు సమాచారం. చైనాలోని ఉద్యోగులందరూ సెప్టెంబర్ నుంచి ఆపిల్ ఐఫోన్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని సంస్థ స్పష్టం చేసింది.
చైనాలో గూగుల్, గూగుల్ ప్లే సేవలు లేదు. ఆ దేశం మొబైల్ బ్రాండ్స్ అన్నీ సొంత ప్లాట్‌ఫామ్ కలిగి ఉన్నాయి. కాబట్టి అలాంటి మొబైల్స్ ఉపయోగించడం వల్ల కంపెనీ డేటాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే యాపిల్ ఐఫోన్‌లలో సెక్యూరీటీ సిస్టం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి డేటా బయటకు వెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చైనాలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ పాస్‌వర్డ్ మేనేజర్, ఐడెంటిటీ పాస్ యాప్‌ను ఉపయోగించాలని కంపెనీ పేర్కొంది. ఇవి యాపిల్, గూగుల్ ప్లే స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు తప్పకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ వదిలిపెట్టి.. ఐఫోన్ ఉపయోగించాలని కోరింది.
ఐఫోన్ లేని, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ఉద్యోగులకు కంపెనీ కొత్త డివైజ్‌లను అందజేస్తుంది. ఉద్యోగులకు కొత్త ఐఫోన్ 15 ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడొద్దని, కేవలం ఐఫోన్స్ మాత్రమే వాడండి అని చెప్పడంతో కొందరిలో అనుమానాలు పుడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment