ప్రముఖ దేశీయ మొబైల్‌మేకర్ లావా రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్లను లంచ్ చేసింది. జెడ్ సీరిస్‌లో జెడ్ 25, జెడ్10 పేరుతో రెండు మొబైల్స్‌ను బుధవారం విడుదల చేసింది. తద్వారా మిడ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీలోని ఎంపిక చేసిన షాపుల్లో మార్చి 23ని విక్రయానికి పెడుతున్నట్టు కంపెనీ తెలిపింది. వీటి ధరలను వరుసగా రూ .18,000, రూ 11,500గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఒక సంవత్సరం తయారీదారు వారంటీతోపాటు 6నెలల ఇన్ బాక్స్ యాక్ససరీస్ వారంటీ ఇస్తోంది.అలాగే 30రోజుల్లో రీప్లేస్‌మెంట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది.
గత ఏడు సంవత్సరాలుగా తమ నూతన ఆవిష్కరణకు పరిశోధకనకు, జెడ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు నిదర్శమని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొడక్షన్ హెడ్ గౌరవ నిగమ్ తెలిపారు
లావా జెడ్ 25 ఫీచర్స్
5.5-అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లౌ
4జీబీర్యామ్
16జీబీ స్టోరేజ్
13ఎంపీవెనుక కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
3020 ఎంఏహెచ్ బ్యాటరీ
గ్రే అండ్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం.
లావా జెడ్ 10 ఫీచర్స్
5 అంగుళాల స్క్రీన్
ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లౌ
8ఎంపీవెనుక కెమెరా విత స్పాట్‌లైట్ ఫ్లాష్
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2జీబీర్యామ్
16జీబీ స్టోరేజ్
2620ఎంఏహెచ్ బ్యాటరీ
గోల్డ్ కలర్ లో అందుబాటులో ఉంది.