మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్-10నేనా? అయితే వెంటనే జాగ్రత్త పడండి. వేలు పోసి కొనుక్కున్న ఆ కంప్యూటర్/ల్యాప్‌టాప్ నిరుపయోగంగా మారే అవకాశాలున్నాయి. ఎందుకంటారా.. విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇప్పటివరకూ ఇస్తున్న సపోర్ట్‌ను నిలిపివేసే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల కంప్యూటర్లు నిరుపయోగంగా మారతాయని 'కెనాలిస్ రీసెర్చ్' తాజా నివేదికలో వెల్లడించింది. మరిన్ని వివరాలు...
మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 10కు సపోర్ట్ చేయడం నిలిపేస్తే.. చాలా మంది అలాంటి కంప్యూటర్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపరు. దీంతో ఇవన్నీ పనికిరాని వస్తువులుగా మిగిలిపోవాల్సి వస్తుంది, తద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యర్దాల బరువు సుమారు 3.20 లక్షల కార్ల బరువుకు సమానంగా ఉండొచ్చని, దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ స్క్రాప్ భవిష్యత్తులో ఏ స్థాయిలో పెరుగుతాయనేది ఇప్పుడే అర్థమైపోతోంది.
విండోస్ 10కు సపోర్టు నిలిచిపోయినప్పటికీ కంప్యూటర్లను మరికొన్నేళ్ల పాటు వాడుకోవడానికి అవకాశం ఉంది, కానీ సేఫ్టీ అప్డేట్స్ లేని కారణంగా ఎక్కువమంది కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో.. ఇవన్నీ నిరుపయోగమే అవుతాయి.
ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే!
నిజానికి మైక్రోసాఫ్ట్ గతంలోనే ఓ సందర్భంలో.. 2025 నాటికి విండోస్ 10కు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్ 2028 వరకు వార్షిక ఫీజుతో అందించనున్నట్లు సమాచారం, ఈ వార్షిక ఫీజు చెల్లించడానికి బదులు అప్డేటెడ్ కంప్యూటర్లను కొనుగోలు చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో స్క్రాప్‌కు వెళ్లే పాత కంప్యూటర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని కెనాలిస్ రిపోర్ట్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment