IOS phone
-
మీ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ పోయిందా? ఇదిగో ఇలా చేయండి
ఎన్నైనా చెప్పండి.. కొత్త వస్తువు కొన్న రోజు క్లౌడ్9లో దర్జాగా సింహాసనం వేసుకొని కూర్చున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రపంచానికి ఏ సమస్య లేనట్లుగా ఉంటుంది. ఎన్నైనా చెప్పండీ.. ప్రేమతో కొన్న వస్తువును పోగొట్టుకున్న రోజు.. సింహాసనం నుంచి ఎవరో పాతాళంలోకి తోసినట్లుగా ఉంటుంది. విధి విలన్‌గా మారి అదేపనిగా వికటాట్టహాసం చేస్తున్నట్లుగా ఉంటుంది. మరేం ఫరవాలేదు మిత్రమా.. పోయిన మీ గ్యాడ్జెట్స్ జాడ కనిపెట్టడానికి అదుగో.. అవి రెడీగా ఉన్నాయి, అవేమిటో తెలుసుకుందాం.. ‘ఎప్పుడూ ఇంత ఖరీదైన వస్తువు కొని ఎరగను. ఇప్పుడు యాపిల్ వాచ్ కొన్నాను. కొని వారం కూడా కాలేదు. పోగొట్టుకున్నాను. నా మతిమరుపుతో ఛస్తున్నాననుకో’ కిలోమీటరు పొడవునా నిట్టుర్చాడు రమేష్. ‘ఫైండ్ మై ఫీచర్ యూజ్ చేయలేదా?’ అని అడిగాడు సురేష్. కేవలం యాపిల్ వాచ్ మాత్రమే కాదు.. ఐఫోన్, ఐప్యాడ్, ఐప్యాడ్ టచ్.. యాపిల్ యూజర్లు తాము కోల్పోయిన డివైజ్, పర్సనల్ ఐటమ్స్ ను ‘ఫైండ్ మై’ యాప్‌తో కనుగొనవచ్చు.(చదవండి: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‌బ్యాక్!) యాపిల్ పరికరం అయితే ఇలా చేయండి వ్యూ లొకేషన్ ప్లే ఏ సౌండ్ మార్క్ యాజ్ లాస్ట్ (లాస్ట్ మోడ్) రిమోట్ ఎరాజ్ నోటిఫై వెన్ ఫౌండ్ నోటిఫై వెన్ లెఫ్ట్ బిహైండ్ ఇక గూగుల్ దగ్గరకు వద్దాం.. యాపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి డివైజ్ ట్రాకర్స్ గూగుల్‌లో లేనప్పటికీ ‘ఫైండ్ మై డివైజ్’ పోర్టల్ లేదా ‘ఫైండ్ మై డివైజ్’ యాప్‌తో మిస్ అయిన డివైజ్‌ల ‘లొకేషన్’ను ట్రాక్ చేయవచ్చు. రింగ్, రికవర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ‘రింగ్’తో సైలెంట్లో ఉంటే రింగ్ చేయవచ్చు. ‘రికవర్’తో లాకింగ్ చేయవచ్చు. ‘ఫైండ్ మై డివైజ్’తో గూగుల్ ఎకౌంట్‌తో లింకైన పిక్సెల్ బడ్స్, ఇయర్ బడ్స్, వోఎస్ స్మార్ట్‌వాచ్‌లను కూడా ట్రాక్ చేయవచ్చు. పోయిన గ్యాడ్జెట్స్ ఆచూకీ తెలుసుకోవడానికి శాంసంగ్‌లో స్మార్ట్‌ట్యాగ్(బ్లూటూత్), స్మార్ట్‌ట్యాగ్ ప్లస్ (బ్లూటూత్ అండ్ ఆల్ట్రావైడ్బాండ్)లు ఉన్నాయి.(చదవండి: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్) యాపిల్, గూగుల్, శాంసంగ్‌తో సంబంధం లేకుండా ఎన్నో కంపెనీలు ట్రాకింగ్ యాప్‌ల వ్యాపారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘టైల్’ ఈ యాప్‌లో సైజ్, సామర్థ్యాలను బట్టీ రకరకాల ట్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదా: ప్రో-పవర్ఫుల్ ట్రాకర్, మెట్-వర్స్టైల్, స్లిమ్-థిన్ ట్రాకర్ దూరంలో ఉన్నాసరే, దగ్గర్లో ఉన్నా సరే, ‘ఫైండ్ యువర్ థింగ్స్-ఫైండ్ యువర్ ఫోన్’ అని పిలుపునిస్తుంది టైల్. యూజర్ ప్రైవసీ, సెక్యూరిటీలకు భంగం కలిగించమనీ, డాటాను మార్కెట్ అవసరాల కోసం ఉపయోగించమని చెబుతుంది టైల్. ‘పోగొట్టుకున్న చోటే వెదకాలి’ అంటారు. ‘ఎక్కడ పోగొట్టుకున్నానో నాకెలా తెలుస్తుంది!’ అనే ధర్మసందేహాన్ని తీర్చడానికి డిజిటల్ ప్రపంచంలో ఎన్నో ఫీచర్స్, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిచయం చేసుకుంటే సరిపోతుంది. -
ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పలు పాత స్మార్ట్ఫోన్లలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ పనిచేయదు. ఈ విషయాన్ని తన ఎఫ్ఏక్యూ సెక్షన్లో వాట్సాప్ పేర్కొంది. ఆండ్రాయిడ్ 2.3.7, అంతకు ముందు ఉన్న పాత వర్షన్లపై నడిచే ఫోన్లు, ఐవోఎస్ 8, దానికి ముందరి ఓఎస్‌లపై నడిచే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ పని చేయదు. ఈ పాత ఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసుకోవడం కానీ, ఉన్న ఖాతాను పునరుద్ధరించుకోవడం కానీ కుదరదు. అన్ని రకాల విండోస్ ఫోన్లకు కూడా 2019 డిసెంబర్ 31 నుంచి తమ సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అదే నెలలో మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా విండోస్ 10 మొబైల్ ఓఎస్ సేవలు కూడా నిలిపేయనుంది. ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యాప్‌ను అప్డేట్ చేస్తూ ఉంది. ఫోన్ బ్యాటరీ వాడకం తగ్గేలా ‘డార్క్ మోడ్’ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఫోన్లలో పనిచేయదు.. ► ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టం ► ఐవోఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఐఫోన్లు.. -
ఐఫోన్ ఇక మరింత సురక్షితం
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కీలక ప్రకటన చేసింది. పాస్వర్డ్ అవసరం లేకుండా ఐఫోన్లలోని సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించేలా ఉన్న సాఫ్ట్వేర్ లోపాన్ని సరిదిద్దనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే ఐవోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు, సమాచార మార్పిడి కోసం వాడుతున్న లైటనింగ్ పోర్ట్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతున్నారని తెలిపింది. త్వరలో తీసుకురానున్న అప్డేట్తో తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే ఐఫోన్ డేటా గంటపాటు నిలిచిపోతుందని వెల్లడించింది. తాజా అప్డేట్ తర్వాత కూడా లైటనింగ్ పోర్ట్‌తో చార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చంది. యాపిల్ తాజా నిర్ణయం ఈ లోపాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎఫ్‌బీఐ, పోలీసులకు ఇబ్బందికరం కానుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పాకెట్లో ఇమిడిపోయే ద్రోన్లు
న్యూయార్క్: అవును ఈ ద్రోన్లు (చిన్న పాటి ఎగిరే వాహనాలు) చొక్కా జేబులోనూ ఇమిడిపోగలవు! వీటి పనితీరూ అద్భుతమే. వీటి పేర్లు అనూర, జానో. ఇవి నిధుల కోసం కిక్‌స్టార్టర్ అనే క్రౌడ్ ఫండింగ్ (నిధుల సేకరణ) వెబ్సైట్లో వచ్చి వాలాయి. అనూర ద్రోన్ ఐఫోన్ లాగ కాస్త లావుగా ఉంటుంది. దీనికున్న 4 రెక్కలూ ముడుచుకుపోతాయి. 10 నిమిషాలు గాల్లో విహరించగలదు. జానో కాస్త చిన్నది. 15 నిమిషాలు ఎగరగలదు. వీటిలో ఉన్న ఇన్‌బిల్ట్ కెమెరాలతో ఆకాశంలో విహరిస్తూనే ఫొటోలు, వీడియోలు తీసి వైఫై ద్వారా ఫోన్లకు పంపొచ్చు. ఈ ద్రోన్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లతో నియంత్రించవచ్చు.