పాకెట్‌లో ఇమిడిపోయే ద్రోన్లు
న్యూయార్క్: అవును ఈ ద్రోన్లు (చిన్న పాటి ఎగిరే వాహనాలు) చొక్కా జేబులోనూ ఇమిడిపోగలవు! వీటి పనితీరూ అద్భుతమే. వీటి పేర్లు అనూర, జానో. ఇవి నిధుల కోసం కిక్‌స్టార్టర్ అనే క్రౌడ్ ఫండింగ్ (నిధుల సేకరణ) వెబ్‌సైట్‌లో వచ్చి వాలాయి. అనూర ద్రోన్ ఐఫోన్ లాగ కాస్త లావుగా ఉంటుంది. దీనికున్న 4 రెక్కలూ ముడుచుకుపోతాయి. 10 నిమిషాలు గాల్లో విహరించగలదు. జానో కాస్త చిన్నది. 15 నిమిషాలు ఎగరగలదు. వీటిలో ఉన్న ఇన్‌బిల్ట్ కెమెరాలతో ఆకాశంలో విహరిస్తూనే ఫొటోలు, వీడియోలు తీసి వైఫై ద్వారా ఫోన్లకు పంపొచ్చు. ఈ ద్రోన్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లతో నియంత్రించవచ్చు.