Windows Mobile
-
ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పలు పాత స్మార్ట్ఫోన్లలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ పనిచేయదు. ఈ విషయాన్ని తన ఎఫ్ఏక్యూ సెక్షన్లో వాట్సాప్ పేర్కొంది. ఆండ్రాయిడ్ 2.3.7, అంతకు ముందు ఉన్న పాత వర్షన్లపై నడిచే ఫోన్లు, ఐవోఎస్ 8, దానికి ముందరి ఓఎస్‌లపై నడిచే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ పని చేయదు. ఈ పాత ఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసుకోవడం కానీ, ఉన్న ఖాతాను పునరుద్ధరించుకోవడం కానీ కుదరదు. అన్ని రకాల విండోస్ ఫోన్లకు కూడా 2019 డిసెంబర్ 31 నుంచి తమ సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అదే నెలలో మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా విండోస్ 10 మొబైల్ ఓఎస్ సేవలు కూడా నిలిపేయనుంది. ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యాప్‌ను అప్డేట్ చేస్తూ ఉంది. ఫోన్ బ్యాటరీ వాడకం తగ్గేలా ‘డార్క్ మోడ్’ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఫోన్లలో పనిచేయదు.. ► ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టం ► ఐవోఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఐఫోన్లు.. -
మైక్రోసాఫ్ట్ నుంచి చౌక 4జీ స్మార్ట్‌ఫోన్
లూమియా 638 ః రూ.8,299 న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ డివెసైస్ సంస్థ విండోస్ ఓఎస్‌పై లభ్యమయ్యే అత్యంత చౌక 4జీ స్మార్ట్‌ఫోన్, లూమియా 638ను మార్కెట్లోకి తెచ్చింది.విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ ధర రూ.8,299. ఈ ఫోన్లో 4.5 అంగుళాల స్క్రీన్, 1.2 గిగా హెర్ట్స్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగా పిక్సెల్ కెమెరా, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 1,830 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. వీడియో కంటెంట్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా వీక్షించే వారి కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని నోకియా ఇండియా సేల్స్ డెరైక్టర్ (మార్కెటింగ్) రఘువేశ్ సరూప్ చెప్పారు. లూమియా రేంజ్ ఫోన్లలో అందుబాటు ధరల్లోనే అత్యున్నత ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. అమెజాన్‌డాట్‌ఇన్‌లో కొత్తగా అందిస్తున్న మైక్రోసాఫ్ట్ బ్రాండ్ స్టోర్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. -
మైక్రోమ్యాక్స్.. విండోస్ మొబైల్ ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేసే తొలి మొబైల్ ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. కాన్వాస్ విన్ డబ్ల్యూ121(ధర రూ.9,500), కాన్వాస్ విన్ డబ్ల్యూ092(ధర రూ.6,500)- ఈ రెండు ఫోన్లు డ్యుయల్-సిమ్ ఫోన్లని కంపెనీ చైర్మన్ సంజీవ్‌కపూర్ చెప్పారు. వచ్చే నెల నుంచి వీటి విక్రయాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ సీపీయూ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉన్న కాన్వాస్ డబ్ల్యూ121లో 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఇక కాన్వాస్ విన్ డబ్ల్యూ 092లో 4-అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. తొలి దేశీయ కంపెనీ..: స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో భారత్‌లో రెండో స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇప్పటివరకూ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై ఫోన్లను అందిస్తోంది. మొదటి స్థానంపై కన్నేసిన మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ ఓఎస్ ఆధారిత మొబైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఓఎస్‌పై పనిచేసే మొబైళ్లను తయారు చేసిన మొదటి దేశీయ కంపెనీగా మైక్రోమ్యాక్స్ అవతరించింది. ఇప్పటికే విండోస్ ఓఎస్ ఆధారిత ఫోన్లను నోకియా, హెచ్‌టీసీ, ఎల్జీ, డెల్‌లు తయారు చేస్తున్నాయి.