న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల దిగ్గజం ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ. 549 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 509 కోట్లు ఆర్జించింది. పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రమోట్ చేసిన కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 3,656 కోట్ల నుంచి రూ. 4,742 కోట్లకు ఎగసింది.
అయితే నిర్వహణ వ్యయాలు 23 శాతం పెరిగి రూ. 2,426 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఇవి రూ. 1,974 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 2.22% నుంచి 2.64 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.8% నుంచి 0.96 శాతానికి పెరిగాయి. దీంతో అనుకోని నష్టాలు, మొండి రుణాల వ్యయాలు రూ. 533 కోట్ల నుంచి రూ. 883 కోట్లకు పెరిగాయి. కాగా.. డిసెంబర్‌కల్లా కనీస మూలధన నిష్పత్తి 23.1 శాతంగా నమోదైంది. 2023 మార్చిలో 18.4 శాతం సీఏఆర్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment