ముంబై: క్రెడిట్ కార్డుల దిగ్గజం ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సరీ్వసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 5 శాతం నీరసించి రూ. 593 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 627 కోట్లు ఆర్జించింది.
ఇందుకు ప్రధానంగా వసూళ్లు తగ్గడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,263 కోట్ల నుంచి రూ. 4,046 కోట్లకు జంప్‌చేసింది. వడ్డీ ఆదాయం రూ. 1,387 కోట్ల నుంచి రూ. 1,804 కోట్లకు బలపడింది. ఫీజు ఆదాయం సైతం రూ. 1,538 కోట్ల నుంచి రూ. 1,898 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.24 శాతం నుంచి 2.41 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.78 శాతం నుంచి 0.89 శాతానికి పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.9 శాతానికి చేరింది.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్ షేరు బీఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 859 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment