సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీని వరుస అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. కరోల్ బాగ్ ట్రాజెడీని ఇంకా మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. వాలెంటైన్స్ డే కార్డులు, ఇతర గిఫ్ట్ కార్డులను తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ ఎత్తున గ్రీటింగ్ కార్డులు అగ్నికి ఆహుతి కావడం విషాదం. అదీ వాలెంటైన్స్ డే రోజు.
వెస్ట్ ఢిల్లీలోని నరైనా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీ పైఅంతస్థులో గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 23 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి వుంది.
కాగా ఫిబ్రవరి 12వతేదీన కరోల్ బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ దుర్ఘటన జరిగి 24 గంటలు గడవకముందే బుధవారం జరిగిన మరో అగ్ని ప్రమాదంలో సుమారు 250కిపైగా నిరుపేదల గుడిసెలు కాలి బూడిద కాగా, గురువారం మరో ప్రమాదంతో ఢిల్లీ నగరం నిద్ర లేచింది.
#WATCH A medium category fire broke out at a paper card factory in Naraina Industrial Area, Phase I, early morning today; Total 23 fire tenders engaged in fire fighting operations, no casualties reported pic.twitter.com/l6wiOjfELO
— ANI (@ANI) February 14, 2019
Comments
Please login to add a commentAdd a comment