జూదంలో భార్యను పణంగా పెట్టాడు
ఇండోర్: జూదంలో ఓడిపోయిన భర్త తనను ఇద్దరు వ్యక్తులకు అప్పగించటంతో వారు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఓడిపోతే తన భార్యను ఇస్తానని బెట్ కట్టాడు. ఆటలో ఓటమి పాలై అందుకు బదులుగా భార్యను గెలిచిన ఇద్దరికి అప్పగించాడు. దీంతో ఆ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు.
దీనిపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆమె భర్తతోపాటు వేధింపులకు పాల్పడిన ఇద్దరిని పిలిపించి విచారించారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇండోర్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్ జ్యోతి శర్మ వెల్లడించారు. అయితే, భర్తతో పాటు మిగతా ఇద్దరు కూడా మహిళను వేధిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వివరించారు.