Bet
-
బీజేపీనా? సమాజ్‌వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్‌సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్‌సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్‌కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
రూ.10 పందెం గెలవడానికి నడిరోడ్డుపై యువకుడి స్నానం.. భారీ జరిమానా..!
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం కొందరికి మహా సరదా. వాటికి వచ్చిన లైక్స్‌ను చూసి తెగ మురిసిపోతుంటారు. తమను చాలా మంది ఆదరిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే రూ.10 బెట్ గెలవడానికి ఓ యువకుడు చేసిన పని ట్రాఫిక్ పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. అతనికి రూ.3500 జరిమానాను విధించారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. ఎమ్. ఫారూక్(24) సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి రకరకాల వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తుండేవాడు. తన పోస్టులకు మరిన్ని లైక్స్‌ను రాబట్టడానికి తన స్నేహితునితో పందెం వేశాడు. ఇందుకు రూ.10 ని పందెంలో వేశారు. గెలిచినవారు ఆ డబ్బులను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన వీడియోకు ఎక్కువ లైక్స్ రావడానికి ఫారూక్.. రద్దీగా ఉండే సిగ్నల్ వద్ద నడిరోడ్డుపై స్నానం చేశాడు. ఒంటిపై నీటిని పోసుకున్నాడు. కారణం అడగగా.. వేడిని తట్టుకోవడానికి అలా చేసినట్లు స్థానికులకు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన జిల్లా డీఎస్పీ జీ.జే. జవార్.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితునికి రూ.3500 జరిమానా విధించారు. చదవండి:కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది! -
పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి
రాయచోటి: కోడి పుంజులకు కత్తులు కట్టి బరిలో వదలడం చూశాం. అలాగే పొట్టేళ్లు, మేక పోతులు ఢీకొనడమూ చూశాం.. అయితే ఇపుడు కొత్తగా పందుల పోటీ కూడా ఈ జాబితాలో చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సమీపం లోని దిగువ అబ్బవరంలో గురువారం పందుల పోటీ నిర్వహించారు. పొట్టేళ్ల మాదిరిగానే వీటిని రెచ్చగొట్టి వదిలారు. అవి ఒకదానిని ఒకటి బలంగా ఢీకొనడం, నోటితో కరవడం. కాళ్లతో రక్కడం.. ఇలా తమ శక్తిమేరకు పోరాడాయి. చివరకు కొన్ని పందులు పోటీ పడలేక పారిపోయాయి. విజేతలయిన వరాహాలకు రూ.2లక్షల బహుమతి ప్రకటించారు. ఈ పోటీలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఉత్సుకత ప్రదర్శించారు. -
ప్రాణం తీసిన సరదా పందెం
-
జూదంలో భార్యను పణంగా పెట్టాడు
ఇండోర్: జూదంలో ఓడిపోయిన భర్త తనను ఇద్దరు వ్యక్తులకు అప్పగించటంతో వారు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఓడిపోతే తన భార్యను ఇస్తానని బెట్ కట్టాడు. ఆటలో ఓటమి పాలై అందుకు బదులుగా భార్యను గెలిచిన ఇద్దరికి అప్పగించాడు. దీంతో ఆ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆమె భర్తతోపాటు వేధింపులకు పాల్పడిన ఇద్దరిని పిలిపించి విచారించారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇండోర్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ జ్యోతి శర్మ వెల్లడించారు. అయితే, భర్తతో పాటు మిగతా ఇద్దరు కూడా మహిళను వేధిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వివరించారు. -
సవాల్ చేయగలరా...?
సెల్ఫ్ చెక్ సవాల్‌కు ప్రతిసవాల్ విసిరితేనే థ్రిల్‌గా ఉంటుంది. ‘‘నేను తలచుకుంటే రేపటికల్లా ఆ పని పూర్తిచేయగలను... పందెం ఎంత?... నువ్వు ఈ పనిచేయగలవా?’’ ఇలాంటి డైలాగులు చాలెంజ్ చేసినప్పుడే వస్తాయి. జీవితాన్ని సవాలుగా తీసుకొనేవారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. సవాల్ చేయటం తెలియనివారు ప్రశాంతంగా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉంటారు. అలాగని మూర్ఖమైన పనుల కోసం చాలెంజ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. మంచిపనుల కోసమే సవాలు చేయాలి. చాలెంజింగ్‌గా బతకటం మీకిష్టమేనా? 1. మీలో ఆవేశం ఎక్కువగా ఉన్నా దాన్ని నియంత్రించుకోగలరు. ప్రశాంతంగానే మీరనుకున్నది సాధిస్తారు. ఎ. అవును బి. కాదు 2. ఆటలంటే చాలా ఇష్టం. ఆటలపోటీలు ఎక్కడ జరిగినా పాల్గొంటారు. ఎ. అవును బి. కాదు 3. ‘‘ఈ పనెందుకు చేయాలి, దీనివల్ల లాభం ఏమిటి’’ అని ఎవరైనా అంటే కోప్పడతారు. ఆ పనిని ఎందుకు చేయాలనుకుంటున్నారో వివరిస్తారు. ఎ. అవును బి. కాదు 4. ఎవరైనా మీతో చాలెంజ్ చేస్తే మీరూ దానికి సిద్ధపడతారు. లైఫ్‌లో థ్రిల్‌గా ఉండటమంటే మీకిష్టం. ఎ. అవును బి. కాదు 5. ఉత్సాహంగా ఉంటారు. జీవితాన్ని కష్టంగా భావించరు. ఆశావహదృక్పథంతో ఉంటారు. లోపాలను చూసి కుంగిపోరు. ఎ. కాదు బి. అవును 6. పోటీతత్వంతో ఉంటారు. ఓటమిని తేలికగా ఒప్పుకోరు. గెలిచే దాకా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎ. అవును బి. కాదు 7. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. సవాలు లేని జీవితం నిస్సారమైనదని భావిస్తారు. ఎ. అవును బి. కాదు 8. ఖాళీగా ఉండటమంటే మీకు నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటారు. ప్రతి పనిలో ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తారు. ఎ. అవును బి. కాదు 9. ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటారు. మీ పనికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే అసలు క్షమించరు. ఇలా విజయావకాశాలను సులువు చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 10. స్పోర్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత విమర్శలకు దిగరు. మొదలు పెట్టిన పనిని ఎప్పుడూ సగంలో వదలరు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఎనిమిది వస్తే చాలెంజ్ చేయటమంటే మీకు ఇష్టం. అందరిలో అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. దీనివల్ల మీ మనసు ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. వివిధ రకాల కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. ప్రతి పనిలో చాలెంజింVŠ గా ఉండాలనుకోకుండా, అవసర విషయాల్లోనే బెట్ కట్టండి. పాజిటివ్ విషయాల్లోనే చాలెంజ్ చేయండి. రీచ్ యువర్ యాంబిషన్స్ విత్ సేమ్ స్పిరిట్, ఆల్ ద బెస్ట్. ‘బి’ లు ఎక్కువగా వస్తే జీవితంలో పెద్దగా రిస్క్ తీసుకోరు. ఉన్నది చాలనుకుంటూ, నవ్యతకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటారు. -
ఇక పావురాలతో పందేలు
నెల్లూరు జిల్లాలో చెన్నైకి చెందిన జూదరులు.. రూ. లక్షల్లో పందేలు చావలి (పెళ్లకూరు): సంక్రాంతి పండుగ వస్తే కోడి పందేలు నిర్వహించడం చూశాం. అయితే ఇప్పుడు కొందరు జూదరులు పావురాల పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చావలి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. నాయుడుపేట– పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో ఎగువచావలి, దిగువచావలి గ్రామాల మధ్యలో చెన్నైకి చెందిన కొందరు రెండు లారీల్లో అక్కడకు చేరుకున్నారు. లారీల్లోని ప్రత్యేక పెట్టెల్లో ఉంచిన పావురాలను కిందకు దించి వాటి కాళ్లకు దారాలు కట్టి వందల కొద్ది పావురాలను గాల్లోకి విడిచిపెట్టారు. అవి గుంపులు గుంపులుగా చెన్నై వైపు ఎగిరిపోయాయి. వెంటనే వాటిని అనుసరిస్తూ జూదరులు వచ్చిన వాహనాల్లో చెన్నైవైపు వెళ్లిపోయారు. కాగా ఎవరి పావురాలు తిరిగి అవి ఉంటున్న ప్రదేశానికి వెళతాయో వారు పందెం గెలిచినట్టని, ఇందుకు సంబంధించి రూ. లక్షల్లో పందేలు కాస్తున్నారని సమాచారం. -
‘కూత’ పెట్టు.. పందెం కట్టు
ప్రో కబడ్డీపై జోరుగా పందేలు చేతులు మారుతున్న రూ.లక్షలు పల్లెలకు పాకిన బెట్టింగ్‌లు పట్టించుకోని పోలీసు యంత్రాంగం ఖమ్మం స్పోర్ట్స్ క్రికెట్‌పై బెట్టింగ్‌లు పాత మాట.. కబడ్డీపై బెట్టింగ్‌లు కొత్త మాట.. ప్రో కబడ్డీ ద్వారా కబడ్డీ ఆటకు విపరీతమైన క్రేజీ పెరిగింది.. పిల్లలు గల్లీల్లో కబడ్డీ ఆటకు ప్రాధాన్యం ఇస్తున్నారు.. సెలవులు వచ్చాయంటే కూత పెడుతూ ఆటకు సిద్ధమవుతున్నారు. కార్పొరేట్ క్రీడలకు ధీటుగా కబడ్డీ ఆటకు ప్రో కబడ్డీ ద్వారా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్ల కన్ను కబడ్డీ ఆటపై పడింది. నగరంలోని బార్లలో కూర్చొని జోరుగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఆట కబడ్డీ. ఇప్పుడు నగరాలతోపాటు పల్లెల్లో సైతం ప్రో కబడ్డీ ఎప్పుడు ఆరంభమవుతుందని క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. మరికొందరు ఆదాయమే మార్గంగా ఆటపై జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో బెట్టింగ్ జాడ్యం జోరుగా కొనసాగుతోంది. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు ముగియనుండటంతో క్వాలిఫైయింగ్ జట్ల మీదే జోరుగా పందెం కాస్తున్నారు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్టు నుంచి ఓ ఆటగాడు పాయింట్ తెస్తే.. రూ.100 ఇస్తే.. రూ.వెయ్యి ఇచ్చే విధంగా కొందరు బుకీలుగా ఏర్పడి జోరుగా దండుకుంటున్నారు. నగరంలో సాయంత్రం వేళ బార్లలో కేవలం ప్రో కబడ్డీ మ్యాచ్‌లను చూసేందుకు మాత్రమే బెట్టింగ్ పాల్పడే వారు వస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు మద్యం సేవిస్తున్న మద్యంప్రియులు.. చివరకు తమ జేబులకు చిల్లులు పెట్టుకుని వెళ్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, వైరా లాంటి ప్రాంతాల్లో వయో బేధం లేకుండా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాభిమానులు ప్రో కబడ్డీ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే బెట్టింగ్ వేసుకుంటున్నారు. దీనిని ఆసరా చేసుకుని కబడ్డీ మోజులో బెట్టింగ్ పెట్టండి.. భారీగా నగదు చెల్లిస్తామని బుకీలుగా ఏర్పడిన కొందరు నమ్మబలుకుతున్నారు. కాగా.. ప్రధాన జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు మాత్రం బెట్టింగ్ జోరుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్నా పైరేట్స్, తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్న సమయాల్లో బెట్టింగ్ రేటు మరింత ఎక్కవ అవుతున్నట్లు తెలుస్తోంది. లీగ్ మ్యాచ్‌ల సందర్భల్లోనూ బెట్టింగ్ జోరుగా కొనసాగినట్లు సమాచారం. దీనిని నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వారం రోజులపాటు నడిచే ప్రో కబడ్డీకి బెట్టింగ్ బెడద లేకుండా చూస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మూర్తీభవించిన ధర్మతేజం
శ్రీరాముడు పశుప్రాయమైన స్థాయి నుంచి పరిపక్వత చెందిన మాననీయ స్థాయికి మనిషిని తీర్చిదిద్దిన మహోన్నత గ్రంథం రామాయణం. కేవలం భారతదేశం మాత్రమే కాదు.. యావత్ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మంత్రరాజం రామనామం. రామచంద్రమూర్తి పాటించిన ధర్మమార్గమే మనకు సదా శ్రీరామరక్ష. వేల సంవత్సరాల తర్వాత కూడా రామచంద్రమూర్తి కథ మనం ఎందుకు చెప్పుకోవాలన్న ప్రశ్నకు రామాయణమనే పేరులోనే సమాధానం దొరుకుతుంది. రామ+ఆయనం = రామాయణం. అంటే ఇది రాముని మార్గం. జీవితంలోని ప్రతి అడుగులోనే కాదు.. శరీరంలోని ప్రతి అణువులోను ధర్మపరాయణత్వాన్ని నింపుకున్నవాడు కావటం వల్లనే రామచంద్రమూర్తి మార్గం మనకు శిరోధార్యమైంది. విశ్వామిత్రుని యాగరక్షణ కోసం సోదరుడు లక్ష్మణుడితో కలసి బయలుదేరిన రామచంద్రమూర్తి, ఆ యాత్రలో మొత్తం ముగ్గురు స్త్రీలను కలుసుకుంటాడు. వారే తాటక, అహల్య, సీతాదేవి. తాటక తమోగుణానికి సంకేతం. అందుకే గురూపదేశం ప్రకారం ఆమెను సంహరించాడు. అహల్య రజోగుణానికి సంకేతం. చురుకుదనం, క్రియాశీలత ఆమెను తప్పుదోవ పట్టించాయి. ఇటువంటి వ్యక్తుల విషయంలో సహనం అవసరం. అందుకే రామయ్య రాతిని నాతిని చేసి, సంస్కరించాడు. చివరగా కలుసుకున్న (గెలుచుకున్న) స్త్రీమూర్తి సీతాదేవి. ఆమె సత్త్వగుణానికి ప్రతీక. వెదకి చూచినా లోపం కనిపించదామెలో. అందుకే స్వయంవరంలో పందెం గెలిచి మరీ ఆమెను (సీతమ్మ మనసు) గెలుచుకున్నాడు. ఈ మూడు ఇతివృత్తాల్లో రామచంద్రుడు లోకానికి ఉత్తమ సందేశాన్ని అందించాడు. ఏ వ్యక్తి అయినా ఈ మూడు గుణాల (సత్త్వ, రజ, తమో గుణాలు) విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనిషీ తనలోని తమో గుణాన్ని నశింపజేసుకోవాలి. రజోగుణాన్ని సంస్కరించుకుని, సత్కార్యాలపట్ల దృష్టిని కేంద్రీకరించాలి. సత్త్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ, సాధన ద్వారా క్రమంగా గుణాతీత స్థితికి చేరుకుని, చివరగా మోక్షం పొందాలి. ఇదీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి రామచంద్రమూర్తి ఇచ్చిన ఆచరణాత్మక సందేశం. మాయలేడిపై ఏర్పడిన మోహం కారణంగా రావణుని చేతికి చిక్కిన సీతమ్మను వెతుక్కుంటూ శ్రీరాముడు అరణ్యంలోని నదులు, కొండలు, గుట్టలు, పశుపక్ష్యాదులు.. ఒకటేమిటి చరాచర జీవరాశనంతటినీ సీతమ్మను చూశారా అని అడుగుతాడు. రామయ్య దీనస్థితిని చూసిన లేళ్లు యథాశక్తి ప్రయత్నించి, సైగలతో సీతమ్మను రావణుడు అపహరించి, దక్షిణ దిశగా తీసుకెళ్లాడని చెబుతాయి. మంచిమార్గంలో పయనించేవాడికి పశుపక్ష్యాదులు కూడా సహాయం చేస్తాయట. దుర్మార్గుడిని సొంత సోదరుడు కూడా పరిత్యజిస్తాడట. విభీషణుడు రావణుడిని విడిచిపెట్టడటమే ఇందుకు ఉదాహరణ. ధర్మం ఎందుకు పాటించాలో, ధర్మాన్ని పాటిస్తే ఎలాంటి రక్షణ మనకు దొరుకుతుందో ఈ వృత్తాంతం ద్వారా రామచంద్రమూర్తి లోకానికి చాటిచెప్పాడు. రావణాసుర సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, అన్నగారి పార్థివ దేహాన్ని తమకి అప్పగించమని, అలాచేస్తే వంశాచారం ప్రకారం ఉత్తరక్రియలు నిర్వహించుకుంటామని అనుమతి అడుగుతాడు. అందుకు రామయ్య ఇచ్చిన సమాధానం ఒక్కటిచాలు మన జీవితాల్ని మార్చుకోవటానికి. ‘‘ఓ విభీషణా! శత్రుత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవటం వల్ల యుద్ధం చేయవలసివచ్చిందే కానీ ఇంతటి ప్రాణనష్టం చేయటం నాకు ఇష్టం లేదు. మీ అన్నగారి పార్థివ దేహాన్ని తీసుకెళ్లి, శాస్త్ర, ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు నిర్వర్తించు. ఇకనుంచి ఈయన నీకు మాత్రమే కాదు, నాకూ అన్నగారే’’ అంటాడు. అదీ రామయ్య ధర్మవర్తన. రామరావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామయ్యను వానరులతో సహా లంకలో ఉండి, పది రోజులు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని విభీషణుడు ప్రార్థిస్తాడు. అందుకు రామయ్య ఇలా అంటాడు. అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥‘‘లక్ష్మణా! ఎంతటి స్వర్ణమయంగా ఉన్నా లంక, అందులోని భోగాలపై నాకు దృష్టి లేదు. మాతృమూర్తి, మాతృభూమి ఈ రెండిటికీ మిన్న ఈ లోకంలో ఏదీ లేదు. పధ్నాలుగేళ్లుగా వీటికి దూరంగా ఉన్న నా మనసు వెంటనే ఈ క్షణమే వాటిని చూడాలని ఆరాటపడుతోంది’’ అన్నాడు. ఇదీ రామయ్య దేశభక్తి. మాతృభక్తి. రామరాజ్యంలో దొంగతనాలు లేవు. అకాల మృత్యువు లేదు. దరిద్రం లేదు. వంచకులు లేరు. ఇంకా... ‘‘రామమేవాను పశ్యన్తో నాభ్యహింసః పరస్పరమ్’’ - శ్రీరాముని నిత్యం తలచుకుంటూ, రామనామం జపిస్తూ ఒకరినొకరు హింసించుకోవటం మానేశారట అయోధ్యావాసులు. నేటి సమాజానికి ఆచరణీయమైన మాట ఇది. ఇన్ని సుగుణాల పోగు కనుకనే రామయ్య యావజ్జాతికీ ఆరాధ్యుడయ్యాడు. రామకథ నాగరకులతో పాటు జానపదుల జీవితాల్లో ఊపిరిగా మారింది. ‘రాముని మేలు కొలుపు’, ‘లక్ష్మణ దేవర నవ్వు’, ‘ఊర్మిళాదేవి నిద్ర’ వంటి జానపద గేయ సాహిత్యానికి రామకథే ప్రాణగీతిక. రాములోరు, సీతమ్మతల్లి, హనుమ.. అంటూ రామచంద్రుని కుటుంబాన్ని తమ చుట్టాలుగా భావిస్తారు జానపదులు. అన్నమయ్య, త్యాగయ్య, గోపయ్య వంటి వాగ్గేయకారుల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అఖండమైన రామభక్తి సామ్రాజ్యంలో తనివితీరా సంచరించి, తనువులో, మనసులో... అణువణువులో రామయ్యను దర్శించి, చివరి ఊపిరి వరకు రామకథ పాడి, ఆ తర్వాత రామునిలోనే ఐక్యమయ్యారు. -కప్పగంతు లక్ష్మీనారాయణ -
ప్రాణాలు తీసిన పందెం
బాటిల్ దింపకుండా తాగుతానని బెట్ ఐదు క్వార్టర్లు తాగి.. అనంతలోకాలకు.. కౌడిపల్లి: నీళ్లు కలపకుండా.. ఎత్తిన బాటిల్ దింపకుండా మందు తాగుతానని ఛాలెంజ్ చేసి మరీ ఐదు క్వార్టర్లు తాగాడు. చివరికి అపస్మారక స్థితికి చేరి అనంతలోకాలకు చేరాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిట్కుల్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. చిట్కుల్ గ్రామానికి చెందిన రాయన్నోళ్ల రాయన్న(45) శుక్రవారం తన స్నేహితులతో ఎవరు ఎక్కువ మద్యం తాగుతారన్న అంశంలో ఎత్తిన బాటిల్ దించకుండా మందు తాగుతానని పందెం కట్టాడు. వరుసగా ఐదు క్వార్టర్ బాటిళ్లు తాగాడు. దీంతో రాయన్న అపస్మారక స్థితికి వెళ్లగా, స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ శనివారం మరణించాడు. -
కోఢీ
కత్తి కట్టి బరికి సిద్ధమైన కోళ్లు గోదావరి జిల్లాలకు దీటుగా నిర్వహణకు సన్నద్ధం జిల్లాలో 15 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేతులు మారనున్న రూ.700 కోట్లు! జిల్లాలో తొలిసారి పందెంకోడి బహిరంగంగా కాలు దువ్వుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ‘సంప్రదాయం’ ముసుగు తొడిగి అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. కోడి పందేల నిర్వహణకు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తీర్పును ఎవరికివారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో కోడి పందేల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్టేనంటూ ప్రజాప్రతినిధుల అనుయాయులు కోళ్లకు కత్తులు కట్టి సిద్ధం చేస్తుంటే.. పందెం రాయుళ్లు నోట్ల సంచులు భుజాన వేసుకొని జిల్లాకు చేరుతున్నారు. సంక్రాంతికి రెండు రోజుల ముందే జిల్లాలో కోడి పందేల జోరు ప్రారంభమైంది. విజయవాడ సిటీ : కోడి పందేల నిర్వహణకు జిల్లా సిద్ధమైంది. జిల్లాలో కోడిపందేలు తొలిసారి బహిరంగంగా జరగనున్నాయి. కోడి పందేలు అంటే గుర్తుకొచ్చే ‘గోదావరి జిల్లాల’కు దీటుగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాలూ సిద్ధమయ్యాయి. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సంక్రాంతి మూడు రోజులు నిర్వహించనున్న కోడి పందేలకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పందేల రూపంలో రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్లు చేతులు మారే అవకాశముంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కోడి పందేల నిర్వహణకు ఒప్పించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా కోడి పందేలు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ముందుగానే సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్దుబాటు చేశారు. ఈలోగా వచ్చిన సుప్రీం ఆదేశాలు తమకు అనుకూలంగా అన్వయించుకొని బహిరంగ ఏర్పాట్లు చేస్తున్నారు. బరులు సిద్ధం...: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేశారు. ఏటా ఒకటి రెండు ప్రాంతాల్లో, నూజివీడు డివిజన్లో ఒకటి రెండుచోట్ల చాటుమాటుగా జరిగేవి. ఈసారి ఐదారు చోట్ల నిర్వహించేందుకు మామిడి తోటల్లో పొక్లెయిన్లతో చదును చేసి తగిన ఏర్పాట్లుచేశారు. తూర్పు కృష్ణాలోని గుడివాడ, మచిలీపట్నం డివిజన్లలోని పలు ప్రాంతాల్లో కూడా ఈసారి పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగనున్నాయి. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వెచ్చించి కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 15 ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగినట్టు చెబుతున్నారు. సకల సౌకర్యాలు పందెగాళ్ల కోసం నిర్వహకులు అన్ని సౌకర్యాలూ ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే పందెగాళ్ల కోసం విజయవాడలోని పలు హోటళ్లలో రూమ్‌లు బుక్ చేస్తున్నారు. ఇదే సమయంలో పందేలు నిర్వహించే సమయంలో అవసరమైన వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వారి స్థాయిని బట్టి అవసరమైతే ఏసీలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మద్యం, భోజనం సహా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. కొన్నిచోట్ల రాత్రివేళల్లో ఆటవిడుపు కోసం రికార్డింగ్ డ్యాన్స్‌ల నిర్వహణ ఏర్పాట్లు కూడా ఉన్నట్టు తెలిసింది. పేకాట శిబిరాలు కూడా కోడి పందేలు నిర్వహించే చోటుకు సమీపంలో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలు బోర్ కొట్టినవారు వెళ్లిపోకుండా పేకాట ఆడేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఉవ్విళ్లూరుతున్న జిల్లావాసులు పలు చోట్ల జరిగే కోడి పందేలు తిలకించేందుకు జిల్లా, నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో పోలీసులకు భయపడి వెళ్లేందుకు సాహసించనివారు సైతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వాటిని తిలకించాలని భావిస్తున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర ప్రభుత్వ పెద్దల సూచన మేరకు పోలీసులు ప్రేక్షక పాత్రకు సిద్ధమవుతున్నారు. పందేలు జరిగే ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ‘కాపలా’ మాత్రమే ఉండాలని ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. -
ఇండోర్‌లో జిలుగు వెలుగుల ప్రో కబడ్డీ
-
మింగేస్తున్న మట్కా...
- జిల్లాలో మట్కా జూదానికి బానిసలై బలైపోతున్న సామాన్యులు - లక్షాధికారులవుతున్న నిర్వాహకులు - పక్కా సమాచారమున్నా.. పట్టించుకోని పోలీసులు గిద్దలూరు : జిల్లాలో మట్కా జూదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం జిల్లావ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన ఈ జూదం.. తాజాగా మళ్లీ సామాన్యులను మింగేస్తోంది. పశ్చిమ ప్రకాశంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాలకు విస్తరించి పేదల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీనికి బానిసలై ఎంతోమంది సర్వం కోల్పోయి బికారులవుతుండగా నిర్వాహకులు మాత్రం లక్షాధికారులవుతున్నారు. నిర్వాహకులపై పోలీసులకు పక్కా సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్కా జూదమంటే... ముంబై కేంద్రంగా నడిచే చట్ట విరుద్ధమైన జూదం పేరే మట్కా. ఈ జూదం ఆడేందుకు ఆన్లైన్ వెబ్సైట్లో లాగిన్ అవడంతో పాటు స్థానికంగా నిర్వాహకులను సంప్రదిస్తుంటారు. జూదం ఆడేవారు 10 నుంచి 99 వరకూ ఏదోక నంబర్‌ను ఎంపిక చేసుకుంటారు. దానిపై రూపాయి నుంచి లక్షల రూపాయల్లో పందెం కడతారు. రాత్రి సమయంలో ముంబై కేంద్రం నుంచి విడుదల చేసే గేమ్నంబర్.. ఆడేవారు ముందుగానే ఎంపిక చేసిన నంబర్ ఒకటే అయితే రూపాయికి 70 రూపాయల చొప్పున నిర్వాహకులు చెల్లిస్తారు. కనీసం మొదటి అంకె సరిపోలినా రూపాయికి 10 రూపాయల చొప్పున చెల్లిస్తారు. లేకుంటే పందెం కాసిన నగదు పోయినట్టే. ఇలా ప్రతిరోజూ ఒక నంబర్‌పై పందెం కాస్తుంటారు. దానికి సంబంధించి అసలు నంబర్లో మొదటి అంకెను ముంబై నుంచి రాత్రి 11 గంటల సమయంలో, రెండో అంకెను 12 గంటల తర్వాత విడుదల చేస్తారు. రోజుకు రూ.25 లక్షల వరకూ పందేలు... పూర్తిగా చట్టవ్యతిరేకమైన ఈ జూదానికి జిల్లాలోని ఎంతోమంది బానిసలు కావడంతో రోజుకు 25 లక్షల రూపాయల వరకూ జిల్లాలో పందేలు నడుస్తున్నాయి. రోజుకు ఈస్థాయిలో జిల్లావాసులు నష్టపోతుండగా నిర్వాహకులు మాత్రం లక్షల రూపాయలకు పడగలెత్తుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో పాటు పోలీసుల సహకారంతోనే నిర్వాహకులు ఈ జూదాన్ని క్రమంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా నిర్వాహకులను కొందరు అవినీతి పోలీస్ అధికారులు ప్రోత్సహిస్తున్నారన్న విషయం జిల్లాలో బహిరంగ రహస్యంగా మారింది. దీనివల్లే గతంలో రోజుకు 10 లక్షల రూపాయల వరకూ సాగే మట్కా జూదం..ప్రస్తుతం 25 లక్షల రూపాయల వరకూ పెరిగినట్లు సమాచారం. పశ్చిమానే రూ.10 లక్షల్లో పందేలు... జిల్లాలో మట్కా జూదానికి సంబంధించి రోజుకు 25 లక్షల రూపాయల పందేలు జరుగుతుండగా, ఒక్క పశ్చిమ ప్రకాశంలోనే 10 లక్షల రూపాయల వరకూ పందేలు కాస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు నియోజకవర్గంలో సగానికిపైగా గ్రామాల్లో మట్కా జూదం నిరాటంకంగా సాగుతోంది. గిద్దలూరు పట్టణంలోని పాములపల్లె రోడ్డు, కుమ్మరామంకట్ట, గాంధీ బొమ్మ సెంటర్, రాచర్ల రోడ్డు, కొంగళవీడురోడ్డు, ముండ్లపాడు, కేఎస్ పల్లె, కొత్తపల్లె, రాచర్ల మండలంలోని గుడిమెట్ట, రామాపురం, సోమిదేవిపల్లె, యడవల్లి, కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లె, తాటిచర్లమోటు, కంభం ఇలా అన్ని గ్రామాల్లో మట్కా జూదం నిర్వాహకులున్నారు. రోజువారీ కూలి కోసం పనిచేసే కూలీల నుంచి ఆటోడ్రైవర్లు, ఇతర వ్యాపారస్తులు, సంపన్నులు సైతం ఎవరిస్థాయికి తగ్గుట్టు వారిస్థాయిలో రూపాయి నుంచి లక్షల రూపాయల్లో పందేలు కాస్తుంటారు. కళాశాల విద్యార్థులు సైతం ఈ జూదానికి బానిసలవుతున్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే ఎంతోమంది జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ జూదానికి మరింత మంది బలైపోకముందే పోలీసులు మేల్కొని నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. -
పందెం ఓడాడు.. పేద్ద పేరొచ్చింది
మెల్బోర్న్: పందేలు కాయడానికి డబ్బులు, వస్తువులే కాదు వ్యక్తిగత అంశాలూ ఫణంగా పెడుతుంటారు. ఓడిపోతే పేరు మార్చుకుంటానని శపథం చేస్తుంటారు. న్యూజిలాండ్‌కు చెందిన ఓ పేకాట రాయుడు ఇలాంటి పందెమే కాశాడు. పోకర్ గేమ్ (పేకాట)లో ఓడిపోతే తన పేరు మార్చుకుంటాని మద్యం మత్తులో స్నేహితులతో సవాల్ చేశాడు. అన్నంత పనీ అయింది. జూదంలో ఓడిపోవడంతో అతనికి ఓ పేద్ద పేరు పెట్టారు. మొత్తం 99 అక్షరాలతో చాంతాడంత ఉంది. ఫ్రస్నోవా కాస్తా 'Full Metal Havok More Sexy N Intelligent Than Spock And All The Superheroes Combined With Frostnova'గా మారిపోయాడు. వినడానికి తమాషాగా ఉన్నా పాపం.. అతనికి తప్పలేదు. ఇప్పుడు ఇదే పేరు సార్థకమైపోయింది(!). ఐదేళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది. న్యూజిలాండ్‌లో వంద అక్షరాల వరకు పేరు పెట్టుకోవచ్చు. ఈ కొత్త పేరులో ఓ అక్షరం మాత్రమే తక్కువ. అప్పట్లో ఫీజు చెల్లించి ఈ పేరును రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. కాగా ఫ్రస్నోవా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులు గడువు ముగిసింది. కొత్త పేరుతో రెన్యువల్ చేయించాల్సివుంది.