దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.
లోక్‌సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.
భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్‌సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్‌కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.
ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment