Samajwadi
-
బీజేపీనా? సమాజ్‌వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్‌సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్‌సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్‌కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
లోక్‌సభ అభ్యర్థికి గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కాజల్ నిషాద్కు గుండెపోటుకు గురయ్యారు. ఆమెను వెంటనే లక్నోలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 5న ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమె స్థానిక స్టార్ హాస్పిటల్లో చేరారు. అయితే ఏప్రిల్ 7న అకస్మాత్తుగా ఆమెకు గుండెపోటు రావడంతో వైద్యుల సూచన మేరకు లక్నోకు తరలించారు. కాజల్ నిషాద్‌ను అంబులెన్స్‌లో లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. తొలుత ఆమె డీహైడ్రేషన్ కారణంగా స్టార్ హాస్పిటల్లో చేరారు. తరువాత ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె లక్నోలో చికిత్స పొందుతున్నారు. యూపీలోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో ఎంతో కీలకమైనది. గతంలో సీఎం యోగి ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం భోజ్‌పురి నటుడు రవికిషన్ ఈ స్థానానికి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా రవికిషన్ బీజేపీ తరపున గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. రవికిషన్‌పై సమాజ్‌వాదీ పార్టీ తరపున కాజల్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు. -
UP Election: ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో తన తల్లి గురించి మాట్లాడిన మోదీ.. ఏమన్నారంటే..?
లక్నో: ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శల వార్ కొనసాగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా, యూపీలో కాంగ్రెస్, ఎస్పీ పార్టీలపై పరోక్షంగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తాను, ఆయన తల్లి (హీరాబెన్ మోదీ) వ్యాక్సిన్ తీసుకున్నామన్నారు. ఆమెకు 100 ఏండ్లు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని చెప్పారు. ఆమె వంతు వచ్చినప్పుడే వాక్సిన్ తీసుకున్నట్టు మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే తన తల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఆమె బూస్టర్ డోసును కూడా తీసుకోలేదని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. వారిని పరోక్షంగా రాజవంశీకులతో పోల్చి.. వారైతే నిబంధనలు పాటించుకుండా వ్యాక్సిన్ తీసుకోవడం కోసం ముందు వరుసలో ఉండే వారని విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే వ్యాక్సిన్లను అమ్ముకునేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూపీలో ఫిబ్రవరి 27న ఐదో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
400 స్థానాల్లో బీజేపీతో ఢీ?
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా ఐక్య గళం వినిపించిన ప్రతిపక్షాలు బీజేపీని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఢీకొట్టేందుకు 400 స్థానాల్ని ప్రతిపక్షాలు గుర్తించాయి. ఈ ప్రణాళిక వివరాల్ని ఎన్సీపీ నేత మజీద్ మెమన్ ధ్రువీకరించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందే దీనిపై కసరత్తు జరిగిందని న్యూస్ 18 చానల్‌కు ఆయన వెల్లడించారు. రాష్ట్రాల్ని ప్రామాణికంగా తీసుకుని ఈ ప్లాన్ అమలు చేయడం ఉత్తమమని, దేశమంతా ఒకే ఫార్ములాతో ముందుకెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదనేది ప్రతిపక్ష నేతల అభిప్రాయమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. యూపీని ఉదాహరణగా తీసుకోవాలి: సమాజ్‌వాదీ యూపీలో బీఎస్పీ, ఎస్పీలు కలిసికట్టుగా బీజేపీని ఓడించిన ఉదంతాన్ని అందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి యూపీలో మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగగా మూడు చోట్ల ఎస్పీ, బీఎస్పీలు బలపర్చిన ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించారు. ‘అయితే కొన్నిచోట్ల మాత్రమే పొత్తులు ప్రయోజనకరం. కైరానాలో కాంగ్రెస్ మద్దతు మాకు లాభించింది. ఫూల్పూర్ వంటి చోట్ల ఆ పార్టీతో పొత్తు ప్రమాదకరం’ అని ఎస్పీ నేత ఒకరు పేర్కొన్నారు. ఫూల్పూరులో ఎస్పీ, బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ చేరకపోవడం లాభించిందని, ఆ పార్టీకి ఆ ప్రాంతంలో బ్రాహ్మణ పార్టీ ముద్ర ఉందని ఆయన విశ్లేషించారు. మమతా బెనర్జీ కీలక పాత్ర యూపీ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం.. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాల కూటమి బీజేపీని నేరుగా ఢీకొనే ప్రణాళికను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలకు కాంగ్రెస్ మద్దతివ్వాలని ఆమె సూచించారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి–అఖిలేశ్‌ల కూటమి బలంగా ఉంది. వారు కలిసి పోరాడితే మనం వాళ్లకు సాయపడాలి’ అని మమత అప్పట్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ వెనుక నుంచి మద్దతు ఇవ్వడమే సరైందని చెప్పారు. ‘బెంగాల్లో మమతా బెనర్జీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. బిహార్‌లో తేజస్వీ యాదవ్ ఊపుమీదున్నారు. కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు పంచుకునేందుకు వారు ఒప్పుకుంటారా?’ అని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఐక్యకూటమిలో కాంగ్రెస్ పార్టీనే కీలక పాత్ర పోషిస్తుందని, అయితే డిసెంబరులో జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పాత్ర తేలిపోతుందని అన్నారు. 3 రాష్ట్రాల ఎన్నికలయ్యాకక కూటమిపై స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు ఆజాద్, అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌లు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
'సమాజ్‌వాదీ' పదాన్ని తీసేసిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటి నుంచి 'సమాజ్‌వాదీ' అనే పదాన్ని తీసేశారు. దానికి బదులు 'ముఖ్యమంత్రి' అనే పదాన్ని చేర్చారు. ఈ విషయాన్ని కేబినెట్ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ విలేకరులకు తెలిపారు. గురువారం అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలేష్ ప్రభుత్వం ఇంతకుముందు సమాజ్‌వాదీ పెన్షన్ యోజన, సమాజ్‌వాదీ అంబులెన్స్ సేవ, సమాజ్‌వాదీ స్మార్ట్‌ఫోన్ యోజన లాంటి పథకాలు ప్రవేశపెట్టింది. వీటన్నింటి పేర్లలో ఉన్న పార్టీ పేరు తీసేసి వాటికి బదులు 'ముఖ్యమంత్రి' అని పెట్టనున్నారు. దాంతో ఏ పార్టీ ముఖ్యమంత్రి వచ్చినా ఆ పథకాలను కొనసాగించేందుకు వీలుంటుంది. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ముద్రించిన 60 లక్షల రేషన్ కార్డులను ప్రజలకు పంపణీ చేయకూడదని కూడా ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వాటన్నింటి మీద అఖిలేష్ ఫొటోను అప్పట్లో ముద్రించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ కార్డులను సిద్ధం చేశారు. దాంతో వాటన్నింటినీ రద్దుచేసి, కొత్త కార్డులు ఇవ్వాలని యోగి నిర్ణయించారు. జిల్లా కేంద్రాలన్నింటిలో రోజుకు 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగిలిన గ్రామాలు, తహసీళ్లలో కనీసం 18 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ఈ విషయమై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ త్వరలో సమావేశం కానున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న జెవార్ విమానాశ్రయ ప్రాజెక్టుకు కూడా యూపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడో మాయావతి ప్రభుత్వ హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టినా, అఖిలేష్ ప్రభుత్వం జెవార్ కంటే ఆగ్రాలో పూర్తిస్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలని అఖిలేష్ సర్కారు భావించి దీన్ని పక్కన పెట్టింది. యూపీలో కూడా గుజరాత్ తరహా అభివృద్ధిని తీసుకురావాలని యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలు, ఇతర విధానాలతో కూడిన ఒక యాప్ తేవాలని కూడా అనుకుంటున్నారు. బుందేల్‌ఖండ్ సంబంధిత అంశాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. -
పాంచ్ పటాకా పేలింది...!
న్యూఢిల్లీ : కౌంటింగ్‌కు ముందే పాంచ్ పటాకా పేలింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మరో 48 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈలోపే ఎన్నికలకు సంబంధించి ప్రజా అభిప్రాయ ఫలితాలు (ఎగ్జిట్ పోల్స్) గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పంజాబ్ కాంగ్రెస్, యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ, రెండో స్థానంలో ఎస్పీ కూటమి, మూడో స్థానంతో సరిపెట్టుకున్న బీఎస్పీ... ఉత్తరాఖండ్, మణిపూర్‌లో కమలం వికసించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. గోవా విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ : అతి పెద్ద రాష్ట్రం, దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి ఉత్తర ప్రదేశ్‌లో కమలం రెపరెపలాడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రం యావత్ దేశంలోనే అత్యంత కీలకం. అక్కడ గెలిస్తే ఢిల్లీకి దారి దగ్గరవుతుందనేది నానుడి. అందుకే ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ తో యూపీలో బీజేపీ వనవాసం ముగుస్తున్నట్లే కనిపిస్తోంది. పంజాబ్ : ఇంతకాలం పంజాబ్‌లో రెండు పార్టీల పాలనే. అయితే కాంగ్రెస్, లేకుంటే అకాలీదళ్ కూటమి. తాజాగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూపంలో బలమైన పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. దీంతో 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి ముక్కోణపు పోటీ జరిగింది. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 62-71 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే తేల్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 42-51 స్థానాలు సాధించనుందని తెలిపింది. ఇక అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే ఈ సర్వే తేల్చింది. అలాగే బీజేపీ ఇక్కడ చతికిలపడిందనే చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ : చిన్నరాష్ట్రం అయిన ఉత్తారాఖండ్ రాష్ట్రంలో కూడా తమిళనాడు, కేరళ తరహా వ్యవహారమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలను మార్చడం ఆ రాష్ట్ర ప్రజల ఆనవాయితీ. ఈసారి కూడా అదే పద్ధతి అనుసరించి... కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి...కమలం చేతపట్టారు. ఇక మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉత్తరాఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటన సందర్భంగా పలు నేషనల్ ఛానల్స్ బీజేపీ గెలుపుకే మొగ్గుచూపగా.. కాంగ్రెస్ ను రెండో స్థానానికి పరిమితం చేశాయి. గోవా: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గోవా ఎన్నికలు కూడా అందరినీ ఆకర్షించాయి. రక్షణమంత్రి మనోహర్ పారీకర్ సొంత రాష్ట్రం కావడంతో గోవాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ జరగ్గా... ఈసారి 4 స్తంభాలాటగా తప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఎంజీపీ కూటమి కూడా సెగలు పొగలు పుట్టించింది. కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఆప్‌కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. మణిపూర్ : ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు పండగే. ప్రచార ఆర్భాటాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో... ఒక విధమైన సందడి కనిపిస్తుంది. కాని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సైలెంట్‌గా ఎన్నికలు జరిగిపోయాయి. నాగాల ఆర్థిక దిగ్బంధం ప్రభావం ఉన్నా.. ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసారి మణిపూర్ ఎన్నికల్లో సరికొత్త కెరటం రాజకీయ రంగప్రవేశం చేసింది. ఆమె ఉక్కుమహిళ ఇరోం షర్మిల. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన షర్మిల... పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పీఆర్‌జేఏ అనే పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశారు. కాగా మణిపూర్ లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కమలం పార్టీకే పట్టం కట్టాయి. -
సైకిల్ హ్యాండిల్ కాంగ్రెస్ చేతిలో..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయడు అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీని స్థాపించిన వ్యక్తి(ములాయం సింగ్ యాదవ్) నుంచి సైకిల్(సమాజ్‌వాది పార్టీ గుర్తు)ను తీసుకొని.. దాని హ్యాండిల్‌ను కాంగ్రెస్ చేతిలో పెట్టారన్నారు. అందువల్ల ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం పోయిందన్నారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. యూపీలో కొంతమంది జిల్లా మేజిస్ట్రేట్లు నాలుగేళ్లకు పైగా అదే స్థానంలో పనిచేస్తున్నారని.. ఇలాంటి వారిని ఎన్నికల సందర్భంగా విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరినట్లు వెంకయ్యనాయుడు వెల్లడించారు. -
యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు ఎవరికి ప్రయోజనం?
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ పోరులో అతి పెద్ద సమరాంగణం ఉత్తర్‌ప్రదేశ్‌లో పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పొత్తు సంచలనం సృష్టిస్తోంది. వృద్ధ లోహియా సోషలిస్ట్ నేత ములాయంసింగ్ స్థాపించిన ఎస్పీ తన 24 ఏళ్ల చరిత్రలో తొలిసారి కాంగ్రెస్‌తో కలిసి యూపీ శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. రాష్ట్రంలో బలమైన రెండు పక్షాల్లో ఒకదానితో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌కు ఇది రెండోసారి. ఇప్పటి పొత్తు బీజేపీని ఎంత వరకు అధికారంలోకి రాకుండా అడ్డుకుని, విజయం సాధిస్తుందనే విషయం చర్చనీయాంశమైంది. ఎస్పీతో ఏ పార్టీ అయినా విలీనం కావచ్చుగాని, దేనితో పొత్తు ఉండదని డిసెంబర్ వరకూ ములాయం చెబుతూ వచ్చారు. ములాయం కొడుకు, ముఖ్యమంత్రి అఖేలేశ్ యాదవ్ పార్టీ అంతర్గత పోరాటంలో విజయం సాధించి, పార్టీపై పట్టు సాధించడంతో ఈ పొత్తు సాధ్యమైంది. 1999లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రధాని కాకుండా ములాయం అడ్డుకున్నప్పటి నుంచీ రెండు పార్టీలూ దాదాపు శత్రుపక్షాలుగానే ఉన్నాయి. 2003–07 మధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య పొడిచిన స్నేహం చివరికి తీవ్ర ద్వేషభావంతో ముగిసింది. 2008లో భారత–అమెరికా అణు ఒప్పందానికి నిరసనగా అప్పటి యూపీఏ సర్కారుకు వామపక్షాలు మద్దతు ఉపసంహరించినప్పుడు తాత్కాలికంగా మన్మోహన్సింగ్ ప్రభుత్వాన్ని ఎస్పీ నిలబెట్టింది. ఈ మైత్రి కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. 2009, 2014 లోక్‌సభ ఎన్నికలు, 2007, 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు ‘సెక్యులర్’ పార్టీల మధ్య ఎలాంటి అవగాహన లేదు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలో ములాయం పెద్ద కోడలు డింపుల్‌ను ప్రస్తుత యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ ఓడించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకా వాడ్రా బీఎస్పీ, ఎస్పీలు రెంటినీ శత్రుపక్షాలుగానే చిత్రించారు. ఎస్పీ నేతలను గూండాలుగా రాహుల్ అభివర్ణించారు. ఈ ఎన్నికలకు మూడు నెలల ముందు కాంగ్రెస్‌ది ఒంటరి పోరు. ఎన్నికల్లో గెలుపునకు బ్రాహ్మణ నేతను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఎన్నికల కన్సల్టెంట్, ఐప్యాక్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ సలహా పాటించి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ఎంపికచేసింది. ఎంత చేసినా యూపీలో వచ్చేది పాతిక సీట్ల లోపేననే అంచనాలు, పది లోపు స్థానాలేనని ఎన్నికల సర్వేల జోస్యాల కారణంగా ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కిందటి అక్టోబర్ నుంచి సమాజ్‌వాదీ యాదవ పరివారంలో మొదలైన ముసలంలో అఖిలేశ్ విజయం కాంగ్రెస్ ఎత్తుగడకు అనుకూలంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి యూపీలో ఉనికి కాపాడుకోవడానికి ఎస్పీతో పొత్తు తప్పదనే అంచనాతో మూడు నాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత 105 సీట్లలో పోటీకి కాంగ్రెస్ అంగీకరించింది. ఎస్పీ–కాంగ్రెస్ పొత్తులో కీలక పాత్రదారులు డింపుల్, ప్రియాంక! మొత్తం 403 సీట్ల పంపిణీలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయి, ఒప్పందం కుదరడానికి అఖిలేశ్ భార్య, కనౌజ్ ఎంపీ డింపుల్, ప్రియాంక ముఖ్య పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక ఫోన్ కాల్‌కు స్పందించని ఎస్పీ సీఎం మొబైల్‌ను స్విచాఫ్ చేస్తే, డింపుల్‌కు ప్రియంక ఫోన్ చేశారని, అప్పుడు అఖిలేశ్ ఆమెతో మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ స్థాయిలో ఇద్దరు ప్రముఖ మహిళలకు మంచి ప్రచారం లభించింది. ఈ ఇద్దరి మధ్య విరిసిన స్నేహం ఎస్పీ–కాంగ్రెస్ కూటమిని విజయపథంలో నడిపిస్తుందని రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆశిస్తున్నారు. గతంలో అన్న, అమ్మ లోక్‌సభ సీట్లు రాయ్‌బరేలీ, అమేఠీకే పరిమితమైన ప్రియాంక ఈసారి రాష్ట్రమంతా కాంగ్రెస్ తరఫున, కుదిరితే డింపుల్‌తో కలిసి కూటమి తరఫున సుడిగాలి ప్రచారం చేస్తారని వార్తలొస్తున్నాయి. 1993 ఎస్పీ–బీఎస్పీ పొత్తు పాక్షిక విజయం 1993 యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటి ఎస్పీ– బహుజన్‌సమాజ్ పార్టీ(బీఎస్పీ) పొత్తు కొంత మేరకు విజయం సాధించిపెట్టింది. 1992 బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత జరిగిన ఎన్నికలివి. బీఎస్పీ అధ్యక్షుడు కాన్షీరాం, ములాయం మధ్య కుదిరిన ఎన్నికల పొత్తు ఈ కూటమికి 176 సీట్లు తెచ్చిపెట్టింది. మెజారిటీకి 213 సీట్లు(ఉత్తరాఖండ్ ఏర్పాటుకు ముందు మొత్తం 424 సీట్లు) అవసరం కాగా జనతాదళ్(27), కాంగ్రెస్(28), వామపక్షాల(4) మద్దతుతో ఎస్పీ, బీఎస్పీలు కలిసి ములాయం యాదవ్ నేతృత్వంలో తొలి, చివరి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. ములాయం, మయావతి మధ్య విభేదాలతో ఈ ప్రభుత్వం ఏడాదిన్నరకే 1995 జూన్‌లో కూలిపోయింది. 1996 బీఎస్పీ–కాంగ్రెస్ పొత్తుకు నూరు సీట్లు! 1996 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పి.వి.నరసింహారావు బీఎస్పీ నేత కాన్షీరాంతో మాట్లాడి అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నారు. రాష్ట్రాన్ని కొన్ని దశాబ్దాల పాటు పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన 110 ఏళ్ల చరిత్రలో తొలిసారి జూనియర్ భాగస్వామిగా దళితుల నేతృత్వంలోని బీఎస్పీ నాయకత్వాన్ని అంగీకరించింది. బీఎస్పీ 296, కాంగ్రెస్ 126 సీట్లకు పోటీచేసి, వరుసగా 67, 33 సీట్లను మాత్రమే సాధించాయి. బీజేపీ 174 సీట్లతో మొదటి స్థానంలో నిలిచింది. 110 సీట్లతో ఎస్పీ రెండో స్థానం సంపాదించింది. బీఎస్పీ పోటీచేయని స్థానాల్లో ఈపార్టీ ఓటర్లైన బహుజనులు(ఎస్సీలు, బీసీలు) కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేశారు. బీఎస్పీ పోటీచేసిన చోట్ల మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులైన బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల వారు బీఎస్పీకి ఓటేయలేదని ఫలితాలు వచ్చాక కాన్షీరాం వివరించారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుపెట్టుకున్న బీఎస్పీ చివరికి బీజేపీ మద్దతుతో మాయావతిని రెండోసారి ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టింది. ఇలా రెండోసారి ఎన్నికల ముందు కుదిరిన ‘లౌకికపక్షాల’ స్నేహం విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో బీఎస్పీ ఏనాడూ ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు. 27 సాల్ బురా హాల్ నినాదం ఇచ్చాక ఎస్పీతో పొత్తు ఎందుకు? 1989 డిసెంబర్లో యూపీలో ప్రతిపక్షస్థానానికి పరిమితమైన కాంగ్రెస్ అప్పటి నుంచీ అక్కడే నిలబడిపోయింది. అందుకే ఈ 27 ఏళ్లలో యూపీ అధ్వాన్న పరిస్థితికి చేరుకుందంటూ నాలుగు నెలల క్రితం ‘27 సాల్ బురా హాల్’ నినాదం ఇచ్చింది. కిందటి అక్టోబర్‌లో యూపీలోని 48 జిల్లాల్లోని 141 అసెంబ్లీ స్థానాల్లో3,500 కిలోమీటర్ల కిసాన్ యాత్ర ముగించుకు వచ్చిన రాహుల్‌కు పరిస్థితి అర్ధమైంది. ఒంటరి పోరులో ఉన్న 28 సీట్లు నిలబెట్టుకోలేమని తెలిసొచ్చింది. అప్పటి నుంచీ ఎస్పీ సర్కారుపై ఆయన విమర్శల్లో వాడి, వేడి తగ్గడం మొదలైంది. ఎస్పీతో పొత్తుకు అఖిలేశ్‌తో మాట్లాడే పని పంజాబ్‌లో ఉన్న ప్రశాంత్ కిశోర్‌కు రాహుల్ అప్పగించారు. కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రధాన సిద్ధాంతంగా, వ్యూహంగా వాడుకుని రాజకీయ లబ్ధి పొందిన ములాయం ‘మూలన’పడడంతో రాహుల్ ఎత్తుగడ ఫలించింది. పొత్తు విజయం సాధించేనా? యూపీలో కాంగ్రెస్ దాదాపు 40 ఏళ్లు పాలన సాగించింది. దళితులు, ముస్లింలు, యాదవుల తర్వాత అధిక జనాభా ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన అయిదుగురు నేతలు సీఎంలు కావడానికి కూడా అవకాశం ఇచ్చింది. అయితే, ఈ వర్గంతోపాటు మిగిలిన అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు ఈ పార్టీకి దూరమయ్యారు. మండల్–మసీదు ఆందోళనల ఫలితంగా 1989 నుంచీ అసెంబ్లీలో పార్టీ బలం పడిపోతూ వచ్చింది.(1989లో 94, 91లో 46, 93లో 27, 96లో 33, 2002లో 25, 2007లో 22 సీట్లు) బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులు –ఇలా అన్ని ప్రధాన వర్గాల అత్యధిక ఓట్లు బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ వైపు తరలిపోయాయి. తొలుత స్నేహ హస్తం అందించినా ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో పొత్తుకు బీఎస్పీ నాయకురాలు మాయావతి తిరస్కరించారు. దాంతో అఖిలేశ్, డింపుల్, రాహుల్, ప్రియాంక రూపంలోని యువ ముఖాలు ముందు పెట్టి బీజేపీతో తలపడడం మేలని అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం భావించి చివరి నిమిషంలో పొత్తును కాపాడారు. బీజేపీపై వ్యతిరేకత మినహా ఎలాంటి సైద్ధాంతిక సారూప్యం లేని ఈ రెంటి కలయిక వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌కు ఇంకా మద్దతిస్తున్న దళితులు పార్టీ అభ్యర్థులు లేని స్థానాల్లో బీఎస్పీకి ఓటేస్తారని, బ్రాహ్మణులు బీజేపీ లేదా బీఎస్పీకి మద్దతు పలుకుతారని వారు అంటున్నారు. అయితే, ఎస్పీకి విధేయులైన ముస్లింలు, బీసీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారని, ఈ పొత్తు ఎస్పీ కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ ప్రయోజనకరమని కూడా వారు విశ్లేషిస్తున్నారు. అదీగాక ఎస్పీ ఈ అనవసర పొత్తు వల్ల కాంగ్రెస్‌కు మూడు దశాబ్దాలుగా దూరమైన ముస్లింలను చే జేతులా అప్పగించి నష్టపోతుందని కొందరు ఎన్నికల విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే, 2014 నాటి నరేంద్ర మోదీ హవా లేని ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో ఎన్నికల సమరాన్ని చతుర్మఖ పోటీల నుంచి త్రిముఖ పోటీలకు పరిమితం చేస్తే బీజేపీ మెజారిటీ సాధించలేదని, ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుకు ఈసారి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. వారసత్వ రాజకీయాలకు పునాదిగా మారిన యూపీలో నలుగురు కొత్త తరం నేతలను రంగంలోకి దింపి చేస్తున్న ఈ పొత్తు ప్రయోగం భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేక లౌకిక కూటమి ఏర్పాటుకు ఉపకరిస్తుందని కూడా భావిస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఎస్పీ-కాంగ్రెస్ కటీఫ్? రంగంలోకి ప్రియాంక
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మంచి సస్పెన్స్ డ్రామాను తలపిస్తున్నాయి. నిమిషానికో సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తండ్రీ కొడుకుల మధ్య ఏదో జరిగిపోయిందని అనుకుంటే.. శివపాల్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా అదంతా తుస్‌మన్నట్లే అయింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలతో కూడిన మహా కూటమి బీజేపీ - బీఎస్పీల భరతం పడుతుందని ముందునుంచి చెబుతుంటే, ఇప్పటికే ఆర్ఎల్డీ దాంట్లోంచి తప్పుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంగతి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఎవరికి వాళ్లు పంతాలు పట్టింపులకు పోతుండటంతో పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ప్రియాంకా గాంధీ వెంటనే రంగంలోకి దిగారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో చర్చించడానికి తన వ్యక్తిగత దూతను లక్నో పంపారు. సమాజ్‌వాదీ పార్టీ 210 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేయడంతో కాంగ్రెస్‌లో గుబులు పట్టుకుంది. రెండు పార్టీల మధ్య పొత్తు విషయం ఇంకా ఏమీ తేలకముందే ఇలా సొంత జాబితా ఇచ్చేయడం, అందులోనూ.. గాంధీల కంచుకోటలు అయిన అమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కూడా ఉండటం కాంగ్రెస్‌ను కలవరపరిచింది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తామే పోటీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ వ్యవహారం గురించి మాట్లాడేందుకు ప్రియాంక తరఫున దూతగా వచ్చిన ధీరజ్.. సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ఇంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తోనే తాము ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఆయనతో చర్చిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ చెప్పారు. అయితే, ప్రియాంకా గాంధీ ఏకంగా 11 మెసేజ్‌లు పెట్టినా, అఖిలేష్ నుంచి వాటికి సమాధానం వెళ్లలేదని విశ్వసనీయ సమాచారం. దాంతో అసలు మహాకూటమి విషయం పక్కన పెడితే మామూలు పొత్తులు కూడా అయోమయంలోనే పడ్డాయి. అవసరమైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కూడా రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. చిట్టచివరి నిమిషంలో అఖిలేష్ ఇలా చేస్తారని కాంగ్రెస్ అసలు ఊహించలేదు. తమకు కనీసం వంద సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ ఒప్పుకొందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నా, అది చాలా పెద్ద సంఖ్య అవుతుందని సమాజ్‌వాదీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఏమంత గొప్పగా లేదని, గత ఎన్నికల్లో కేవలం 28 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీకి ఇప్పుడు ఏకంగా వంద స్థానాలు కేటాయిస్తే వాటిలో కూడా తాము కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా లక్నో వచ్చి చర్చించాలని అఖిలేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనికి కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాలేదు. రాహుల్ వస్తే ఇద్దరూ కలిసి సంయుక్త ప్రచారం చేద్దామని కూడా అఖిలేష్ ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్నాళ్లూ 103 సీట్లు అడుగుతుండగా, ఒక్కసారిగా ఆ సంఖ్యను 138కి పెంచేసింది. అసలు వంద స్థానాలు ఇవ్వడమే దండగ అనుకుంటే ఇప్పుడు ఏకంగా 138 ఎలా ఇస్తామన్నది సమాజ్‌వాదీ వర్గాల వాదన. ఆదివారం నాడు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. లాభం ఎవరికి? ఒకవేళ నిజంగానే సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పొత్తు కుదరకపోతే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. ప్రశాంత కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తను రంగంలోకి దించినా అక్కడ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. 404 (403 + ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ మెంబర్) అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఈసారి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే 15 స్థానాలకు మించి రావడం కష్టమని కూడా అంటున్నారు. కానీ, ఆ పార్టీ సమాజ్‌వాదీ, బీఎస్పీల నుంచి ముస్లిం ఓట్లను కొంతమేర చీల్చుకుంటుంది. అప్పుడు అసలు ప్రయోజనం మొత్తం బీజేపీకి వస్తుంది. సమాజ్ వాదీ, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు జరిగితే మాత్రం కమలనాథులు ప్రశాంతంగా ఉండొచ్చనేది ఎన్నికల పండితుల అంచనా. -
అఖిలేశ్‌కే ‘సైకిల్’
సమాజ్‌వాదీ పేరు, సైకిల్ గుర్తు సీఎం వర్గానికే కేటాయిస్తూ ఈసీ నిర్ణయం • ములాయంకు భంగపాటు • సరైన నిర్ణయం, త్వరలో పొత్తు అవకాశం: రాంగోపాల్ • అఖిలేశ్ ముస్లిం వ్యతిరేకి.. తీరు మార్చుకోకుంటే కొడుకుపై పోటీకి సిద్ధం: ములాయం న్యూఢిల్లీ, లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీ కొడుకుల సమరంలో చివరికి తనయుడే పైచేయి సాధించాడు. సమాజ్‌వాదీ పార్టీ పేరు, గుర్తు కోసం ములాయంసింగ్, అఖిలేశ్‌ల మధ్య సాగుతున్న పోరుకు సోమవారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ముగింపు పలికింది. అఖిలేశ్ వర్గానికే సైకిల్ గుర్తు, పార్టీ పేరును ఖరారు చేస్తూ సీఈసీ కీలక నిర్ణయం తీసుకోవడంతో ములాయం వర్గానికి భంగపాటు ఎదురైంది. ఎన్నికల సంఘం తీర్పు వెలువడిన వెంట నే తండ్రి ఆశీర్వాదం కోసం సీఎంఅఖిలేశ్.. ములాయం ఇంటికి వెళ్లగా, ఈ పోరు ఇంతటితో ఆగదని ఈసీ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానంటూ ములాయం స్పష్టం చేశారు. తమకే పార్టీ గుర్తు, పేరు చెందాలంటూ ములాయం, అఖిలేశ్ వర్గాలు ఈసీ ముందు పంచాయితీ పెట్టడంతో నిర్ణయంపై కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. సైకిల్ గుర్తు ఇరు వర్గాలకు కేటాయించకుండా చెరో కొత్త గుర్తును కేటాయిస్తారంటూ ప్రచారంసాగింది. జనవరి 17 నుంచి ఉత్తరప్రదేశ్ మొదటివిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో సోమవారం ఏదొ ఒక నిర్ణయం రావచ్చని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నదీం జైదీ నేతృత్వంలోసోమవారం సమావేశమైన ఈసీ బృందం... అఖిలేశ్ వర్గానికి సమాజ్‌వాదీ పేరును వాడుకునేందుకు అనుమతించడంతో పాటు, సైకిల్ గుర్తును రిజర్వ్ చేస్తూ తీర్పునిచ్చింది. అఖిలేశ్‌దే అసలైన సమాజ్‌వాదీ: ఈసీ ‘అఖిలేశ్ నేతృత్వంలోని గ్రూపును సమాజ్‌వాదీ పార్టీగా గుర్తిస్తున్నాం. పార్టీ పేరును వాడుకునేందుకు అఖిలేశ్ వర్గానికే అర్హత ఉంది. ఎన్నికల గుర్తుగా వాడుకునేందుకు సైకిల్ గుర్తును రిజర్వ్ చేస్తున్నాం’ అంటూ ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లోపేర్కొంది. అఖిలేశ్ వర్గం 228 మంది ఎమ్మెల్యేలకు గాను 205 మంది అఫిడవిట్లు, 68 మంది ఎమ్మెల్సీలకు 56, 24 మంది ఎంపీలకుగాను 15, 46 మంది జాతీయ కార్యవర్గ సభ్యులకుగాను 28 మంది, 5,731 జాతీయ కన్వెన్షన్ ప్రతినిధులకు గాను4,400 మంది అఫిడవిట్లు సమర్పించినట్లు ఈసీ తెలిపింది. ములాయం వైపు నుంచి ఎలాంటి అఫిడవిట్లు రాలేదంది.అఖిలేశ్ నివాసం వద్ద సంబరాలుఈసీ తీర్పుపై పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్ స్పందిస్తూ... ‘పార్టీ గుర్తు, పేరును దక్కించుకునేందుకు ములాయం వర్గం వద్ద ఎలాంటి సరైన ఆధారాలు లేవు. ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రి చాలా సంతోషంగా ఉన్నారు’ అని చెప్పారు.యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలపై స్పందిస్తూ.. పార్టీ అధ్యక్షుడు ఆ విషయాన్ని నిర్ణయిస్తారని, త్వరలో పొత్తు కుదరవచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పు అనంతరం లక్నోలోని 5– కాళిదాస్ మార్గ్‌లో ఉన్న సీఎం నివాసం వద్దకార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు. వందలాది మంది మద్దతుదారులు అఖిలేశ్ నివాసానికి చేరుకుని బాణసంచా పేలుస్తూ.. నృత్యాలు చేశారు. మరోవైపు, ములాయం వర్గం మాత్రం ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడింది. సోమవారం ములాయంను కలిశాక అఖిలేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో మొదటి నుంచి పోటాపోటీగా... జనవరి 1న అఖిలేశ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తూ లక్నోలో నిర్వహించిన జాతీయ సమావేశం నిర్ణయం తీసుకుంది. ములాయం సోదరుడు శివపాల్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నుంచి తొలగించడంతోపాటు అమర్‌సింగ్‌ను పార్టీ నుంచిబహిష్కరించారు. దీటుగా స్పందించిన ములాయం.. తానే ఎస్పీ జాతీయాధ్యక్షుడినంటూ..రాంగోపాల్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. అఖిలేశ్ కీలుబొమ్మ: ములాయంముస్లిం ఓటు బ్యాంకు చేజారకుండా ఉండేందుకు కొడుకు అఖిలేశ్‌పై ములాయంసింగ్‌యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ముస్లింల పట్ల అఖిలేశ్‌కు వ్యతిరేక అభిప్రాయం ఉందని, ఆ ధోరణి మార్చుకోకపోతే... తన కొడుకుపై పోటీ చేస్తానని చెప్పిపార్టీ కార్యకర్తల్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రానికి డీజీపీగా నియమించాలని చెప్పడంతో అఖిలేశ్ 15 రోజులునాతో మాట్లాడలేదు. డీజీపీ పదవిని ముస్లిం చేపట్టడం అతనికి ఇష్టం లేదు. రాంగోపాల్ యాదవ్ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు. రాంగోపాల్ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు. నేను ముస్లింల కోసమే బతుకుతా.. వారి కోసమేమరణిస్తా. ముస్లిం ప్రయోజనాల కోసం కొడుకుతో పోరుకైనా సిద్ధం’ అని ములాయం అన్నారు. పార్టీ దాదాపుగా చీలిపోయిందని అంగీకరిస్తూ... చీలికను అడ్డుకోవడంతో తాను నిస్సహాయుడినని చెప్పారు. సైకిల్ గుర్తు, పార్టీ పేరు కేటాయింపులో ఈసీతనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ‘పార్టీ అభివృద్ధికి నేను ఎన్నో త్యాగాలు చేశాను. అఖిలేశ్ నా మాట వినకుండా అనేక మంది మంత్రుల్ని తొలగించాడు. కారణాల్లేకుండా సీనియర్ మంత్రుల్ని తప్పించాడు.రాంగోపాల్ చేతుల్లో పావుగా మారి నా కొడుకు తిరుగుబాటు చేస్తే నేనేం చేయగలను’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. అఖిలేశ్ తనకు వ్యతిరేకంగా మారాడని, ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. మహాకూటమి ఏర్పాటుకు యత్నాలు బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్‌తో కలసి మహా కూటమి ఏర్పాటుకు అఖి లేశ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల గుర్తుపై అడ్డంకులు తొలగిపోవడంతో కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్, ఎన్సీపీలతో పొత్తును రెండు, మూడు రోజుల్లో ఖరారుచేసేందుకు అఖిలేశ్ వర్గం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో అఖిలేశ్ చర్చలు జరపనున్నట్లు సమాచారం. 100 సీట్లలో పోటీకి కాంగ్రెస్ పట్టుబడుతుండగా, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు 25–30 సీట్లు కేటాయించాలని ఎస్పీ అవగాహనకువచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ 25 సీట్లను డిమాండ్ చేయవచ్చని భావిస్తున్నారు. -
'కైరానాలో హిందూ వలసలు అందుకే'
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో మస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందువుల వలసలు కొనసాగుతుండటం పట్ల సమాజ్‌వాదీ పార్టీపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇటీవల జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) నివేదికలో సైతం ఉత్తరప్రదేశ్‌లోని కైరానా ప్రాంతంలో హిందూ వలసలు కొనసాగుతున్నాయని వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో హిందువులపై కొనసాగుతున్న దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమవడం మూలంగానే వలసలు కొనసాగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ సమాజ్‌వాదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుమారు 300 కుటుంబాలు భయాందోళనలతో కైరానాను విడిచి వెళ్లాయని హుకుమ్ సింగ్ తెలిపారు. తాను ఎప్పటి నుంచో చెబుతున్న విషయం మానవహక్కుల నివేదికతో తేటతెల్లమైందని అన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నేరగాళ్లకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని అందువల్లనే ప్రజలు భయంతో వలసలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించి ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్ల అనంతరం ఆ ప్రాంతంలో సామాజిక ఉద్రిక్తతలు పెరిగాయని మానవహక్కుల నివేదిక వెల్లడించింది. -
పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీకి ఎదురుదెబ్బ
ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. 35,000 ప్రాంతీయ పంచాయతీ వార్డులకు జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రముఖులు ఓటమి చెందారు. అత్యధిక స్థానాల్లో మంత్రులకు సంబంధించిన అభ్యర్ధులు ఓటమి చెందారు. ఫలితాలపై భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బహదూర్ పాఠక్ మాట్లాడుతూ.. 'ఎన్నికల ఫలితాలు ప్రజల్లో సమాజ్ వాదీ పార్టీకి గల వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని నిశ్చయించుకున్నారు' అని తెలిపారు -
అమర్‌సింగ్‌కు ములాయం జెల్ల!
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. తన పాత మిత్రుడు అమర్‌సింగ్‌కు మరోసారి జెల్లకొట్టారు. వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే ఆరుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. వాటిలో అమర్ సింగ్ పేరు మాత్రం లేదు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమర్ సింగ్ పదవీకాలం త్వరలోనే ముగుస్తోంది. అయితే, సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాంగోపాల్ యాదవ్, జావేద్ అలీ, చంద్రపాల్ సింగ్ యాదవ్, నీరజ్ శేఖర్, రవిప్రకాష్ వర్మ, తంజీమ్ ఫాతిమాల పేర్లు మాత్రమే ఉన్నాయి. వాళ్లలో నీరజ్ శేఖర్.. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు. ఫాతిమా.. మంత్రివర్గంలో అత్యంత శక్తిమంతుడైన ఆజం ఖాన్ భార్య. రాంగోపాల్ యాదవ్ అంటే స్వయానా ములాయం సింగ్ యాదవ్‌కు బంధువు. చాలామంది ఈసారి అమర్ సింగ్‌కు కూడా రాజ్యసభ అవకాశం వస్తుందని అంచనా వేశారు గానీ, అది మాత్రం సాధ్యం కాలేదు. కొన్ని రోజుల క్రితం అమర్ సింగ్ వెళ్లి సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ ఇద్దరినీ కలిశారు. కానీ, అసలు అమర్‌సింగ్ మళ్లీ పార్టీలోకి రావడాన్నే రాంగోపాల్ యాదవ్, ఆజంఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాగోలా ఆ అడ్డంకులను అధిగమించి అమర్ సింగ్ వచ్చినా, చివరకు ఆయనకు పదవి దక్కకుండా వీరిద్దరూ అడ్డుకుని.. తమవాళ్లకు ఇప్పించుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఈసారి మొత్తం 10 మందిని ఎన్నుకోవాలి. అసెంబ్లీలో బలాన్ని బట్టి సులభంగా 6 సీట్లు సమాజ్‌వాదీకి దక్కుతాయి. -
ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ చాలా చోట్ల గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే... కేవలం రెండు చోట్ల మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మిగిలిన 9 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ దూసుకుపోతోంది. ఈ పదకొండు స్థానాలు బీజేపీవే. ఉత్తరప్రదేశ్‌లో పెచ్చరిల్లిన అత్యాచారాలు, మతఘర్షణలు ఉపఎన్నికలపై ప్రభావం చూపలేకపోయాయి. ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ఈ ఎన్నికల్ని చాల సీరియస్‌గా తీసుకున్నారు. మతఘర్షణలతో ఓట్లు చీలి ఉత్తరప్రదేశ్‌లో లాభపడతామని ఆశించిన బీజేపీకి ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించేవే. అటు మోడీ ఖిల్లా గుజరాత్‌లోనూ రాజకీయాలు మారిపోయాయి. బీజేపీకి చెందిన సిట్టింగ్ స్థానాలు రెండింటిలో కాంగ్రెస్ పాగా వేసింది. గుజరాత్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా కేవలం ఆరు స్థానాల్లోనే బీజేపీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. గడిచిన 12 ఏళ్లలో గుజరాత్లో మోడీ లేకుండా జరిగిన తొలిఎన్నికలివి. ఇక గుజరాత్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం బీజేపీని ఇబ్బందుల్లో నెట్టినట్టు కనిపిస్తోంది. ఉపఎన్నికల్లో సీనియర్ నేతలెవరూ ప్రచారం చేయలేదు. మోడీ ఎమ్మెల్యేగా ఉన్న మణినగర్ నియోజకవర్గంలో కేవలం 33 శాతం పోలింగ్ నమోదవటం గుజరాత్ ఓటర్ల నిరాకస్తతను తెలిపింది. వడోదరాలో భారీ మెజార్టీతో రంజన్ బెన్ గెలవడం బీజేపీకి ఊరటే. ఇక రాజస్థాన్‌లోనూ కమలం వాడిపోయింది. నాలుగు సిట్టింగ్ స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్‌కు అప్పగించింది. ఒక్క చోట మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. అటు శారదా చిట్స్ స్కామ్ మమతా బెనర్జీ సర్కారుపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు తప్పాయి. బెంగాల్లో ఉపఎన్నికలు జరిగిన రెండు చోట్ల ఓ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్, మరో స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. -
హత్యాచారంపై కదిలిన యూపీ సర్కారు
బదౌన్ ఎస్పీ సస్పెన్షన్, కలెక్టర్‌పై చర్యలు 66 మంది ఐఏఎస్, 42 మంది ఐపీఎస్‌ల బదిలీలు ఒక బాధితురాలిపై అత్యాచారం జరగలేదు: డీజీపీ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ సర్కారు ఎట్టకేలకు కదిలింది. గత నెలలో బదౌన్ జిల్లాలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లపై జరిగిన అత్యాచారం, హత్యపై దేశమంతటా గగ్గోలు రేగుతున్న నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ అతుల్ సక్సేనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) ఉదయ్‌రాజ్ సింగ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏకంగా 66 మంది ఐఏఎస్, 42 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. హత్యాచారోదంతంపై ప్రభుత్వ యంత్రాంగం మరింత సజావుగా వ్యవహరించి ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ అంగీకరించారు. మరోవైపు బాధితుల్లో ఒకరిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కాలేదని, ఆస్తి కోసం ఆమెపై దాడి జరిగి ఉండొచ్చని రాష్ట్ర డీజీపీ ఏఎల్ బెనర్జీ వ్యాఖ్యానించారు. తద్వారా వివాదాన్ని కొత్త మలుపు తిప్పారు. స్థానిక పోలీసులు తక్షణం స్పందించి రంగంలోకి దిగి ఉంటే మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించడం వీలయేదన్నారు.