ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కాజల్ నిషాద్‌కు గుండెపోటుకు గురయ్యారు. ఆమెను వెంటనే లక్నోలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 5న ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమె స్థానిక స్టార్ హాస్పిటల్‌లో చేరారు. అయితే ఏప్రిల్ 7న అకస్మాత్తుగా ఆమెకు గుండెపోటు రావడంతో వైద్యుల సూచన మేరకు లక్నోకు తరలించారు.
కాజల్ నిషాద్‌ను అంబులెన్స్‌లో లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. తొలుత ఆమె డీహైడ్రేషన్ కారణంగా స్టార్ హాస్పిటల్‌లో చేరారు. తరువాత ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె లక్నోలో చికిత్స పొందుతున్నారు.
యూపీలోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో ఎంతో కీలకమైనది. గతంలో సీఎం యోగి ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం భోజ్‌పురి నటుడు రవికిషన్ ఈ స్థానానికి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా రవికిషన్ బీజేపీ తరపున గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. రవికిషన్‌పై సమాజ్‌వాదీ పార్టీ తరపున కాజల్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment