బదౌన్ ఎస్పీ సస్పెన్షన్, కలెక్టర్‌పై చర్యలు
66 మంది ఐఏఎస్, 42 మంది ఐపీఎస్‌ల బదిలీలు
ఒక బాధితురాలిపై అత్యాచారం జరగలేదు: డీజీపీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ సర్కారు ఎట్టకేలకు కదిలింది. గత నెలలో బదౌన్ జిల్లాలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లపై జరిగిన అత్యాచారం, హత్యపై దేశమంతటా గగ్గోలు రేగుతున్న నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ అతుల్ సక్సేనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) ఉదయ్‌రాజ్ సింగ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏకంగా 66 మంది ఐఏఎస్, 42 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు.
హత్యాచారోదంతంపై ప్రభుత్వ యంత్రాంగం మరింత సజావుగా వ్యవహరించి ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ అంగీకరించారు. మరోవైపు బాధితుల్లో ఒకరిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కాలేదని, ఆస్తి కోసం ఆమెపై దాడి జరిగి ఉండొచ్చని రాష్ట్ర డీజీపీ ఏఎల్ బెనర్జీ వ్యాఖ్యానించారు. తద్వారా వివాదాన్ని కొత్త మలుపు తిప్పారు. స్థానిక పోలీసులు తక్షణం స్పందించి రంగంలోకి దిగి ఉంటే మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించడం వీలయేదన్నారు.
హత్యాచారంపై కదిలిన యూపీ సర్కారు
Published Sun, Jun 8 2014 1:04 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement