సైకిల్ హ్యాండిల్ కాంగ్రెస్ చేతిలో..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయడు అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీని స్థాపించిన వ్యక్తి(ములాయం సింగ్ యాదవ్) నుంచి సైకిల్(సమాజ్‌వాది పార్టీ గుర్తు)ను తీసుకొని.. దాని హ్యాండిల్‌ను కాంగ్రెస్ చేతిలో పెట్టారన్నారు. అందువల్ల ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం పోయిందన్నారు.
అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. యూపీలో కొంతమంది జిల్లా మేజిస్ట్రేట్‌లు నాలుగేళ్లకు పైగా అదే స్థానంలో పనిచేస్తున్నారని.. ఇలాంటి వారిని ఎన్నికల సందర్భంగా విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరినట్లు వెంకయ్యనాయుడు వెల్లడించారు.