
పొట్టేళ్ల మాదిరిగానే వీటిని రెచ్చగొట్టి వదిలారు. అవి ఒకదానిని ఒకటి బలంగా ఢీకొనడం, నోటితో కరవడం
రాయచోటి: కోడి పుంజులకు కత్తులు కట్టి బరిలో వదలడం చూశాం. అలాగే పొట్టేళ్లు, మేక పోతులు ఢీకొనడమూ చూశాం.. అయితే ఇపుడు కొత్తగా పందుల పోటీ కూడా ఈ జాబితాలో చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సమీపం లోని దిగువ అబ్బవరంలో గురువారం పందుల పోటీ నిర్వహించారు. పొట్టేళ్ల మాదిరిగానే వీటిని రెచ్చగొట్టి వదిలారు.
అవి ఒకదానిని ఒకటి బలంగా ఢీకొనడం, నోటితో కరవడం. కాళ్లతో రక్కడం.. ఇలా తమ శక్తిమేరకు పోరాడాయి. చివరకు కొన్ని పందులు పోటీ పడలేక పారిపోయాయి. విజేతలయిన వరాహాలకు రూ.2లక్షల బహుమతి ప్రకటించారు. ఈ పోటీలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఉత్సుకత ప్రదర్శించారు.