సామాజిక మాధ్యమాల‍్లో వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం కొందరికి మహా సరదా. వాటికి వచ్చిన లైక్స్‌ను చూసి తెగ మురిసిపోతుంటారు. తమను చాలా మంది ఆదరిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే రూ.10 బెట్ గెలవడానికి ఓ యువకుడు చేసిన పని ట్రాఫిక్ పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. అతనికి రూ.3500 జరిమానాను విధించారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది.
ఎమ్. ఫారూక్(24) సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి రకరకాల వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తుండేవాడు. తన పోస్టులకు మరిన్ని లైక్స్‌ను రాబట్టడానికి తన స్నేహితునితో పందెం వేశాడు. ఇందుకు రూ.10 ని పందెంలో వేశారు. గెలిచినవారు ఆ డబ్బులను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
తన వీడియోకు ఎక్కువ లైక్స్ రావడానికి ఫారూక్.. రద్దీగా ఉండే సిగ్నల్ వద్ద నడిరోడ్డుపై స్నానం చేశాడు. ఒంటిపై నీటిని పోసుకున్నాడు. కారణం అడగగా.. వేడిని తట్టుకోవడానికి అలా చేసినట్లు స్థానికులకు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన జిల్లా డీఎస్పీ జీ.జే. జవార్.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితునికి రూ.3500 జరిమానా విధించారు.
చదవండి:కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment