on road
-
బస్సు కింద పడ్డ బ్రతికి బట్ట కట్టిండు
-
టాప్‌గేర్‌లో వాహనాల స్పీడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) గురువారం తెలిపింది. ‘భారత్‌లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్‌లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్ఏడీఏ వివరించింది. ‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి. -
నడిరోడ్డుపై యోగా..పోలీసులు ఏం చేసారంటే ?
-
గుజరాత్ లో భయానక దృశ్యాలు.. వర్షాలకు రోడ్డెక్కిన మొసళ్ళు
-
ఇదేందయ్యా..ఇది..రైలు రోడ్డుపై వెళ్తుంది
-
రూ.10 పందెం గెలవడానికి నడిరోడ్డుపై యువకుడి స్నానం.. భారీ జరిమానా..!
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం కొందరికి మహా సరదా. వాటికి వచ్చిన లైక్స్‌ను చూసి తెగ మురిసిపోతుంటారు. తమను చాలా మంది ఆదరిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే రూ.10 బెట్ గెలవడానికి ఓ యువకుడు చేసిన పని ట్రాఫిక్ పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. అతనికి రూ.3500 జరిమానాను విధించారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. ఎమ్. ఫారూక్(24) సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి రకరకాల వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తుండేవాడు. తన పోస్టులకు మరిన్ని లైక్స్‌ను రాబట్టడానికి తన స్నేహితునితో పందెం వేశాడు. ఇందుకు రూ.10 ని పందెంలో వేశారు. గెలిచినవారు ఆ డబ్బులను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన వీడియోకు ఎక్కువ లైక్స్ రావడానికి ఫారూక్.. రద్దీగా ఉండే సిగ్నల్ వద్ద నడిరోడ్డుపై స్నానం చేశాడు. ఒంటిపై నీటిని పోసుకున్నాడు. కారణం అడగగా.. వేడిని తట్టుకోవడానికి అలా చేసినట్లు స్థానికులకు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన జిల్లా డీఎస్పీ జీ.జే. జవార్.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితునికి రూ.3500 జరిమానా విధించారు. చదవండి:కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది! -
వింత వాహనం.. నేల మీద, నీటిపైనా ఎక్కడైనా ప్రయాణించగలదు!
న్యూజీలాండ్‌కు చెందిన పడవల తయారీ కంపెనీ ‘డ్రెడ్‌నార్ట్ బోట్స్’ ఈ పోర్టబుల్ మల్టీయూజ్ పాడ్‌ను రూపొందించింది. చూడటానికి ఇది ఏదో విచిత్ర గ్రహాంతర వాహనంలా కనిపిస్తుంది గాని, ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటి మీద ప్రయాణించగలిగే ఈ వాహనాన్ని ‘డ్రెడ్‌నార్ట్ బోట్స్’ నిపుణులు సునామీలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) ఈ వాహనం కిటికీలకు దృఢమైన అద్దాలు, మిగిలిన భాగాలను భారీ నౌకల తయారీకి ఉపయోగించే నాణ్యమైన అల్యూమినియం ఉపయోగించారు. వాహనం లోపల విశాలమైన స్థలం, వాహనంలోనే వివిధ పరికరాలను చార్జ్ చేసుకునేందుకు వీలుగా 350 వాట్స్ సామర్థ్యం గల ఇన్వర్టర్ వంటివి ఏర్పాటు చేశారు. వాహనం పైభాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇది పూర్తిగా సౌరవిద్యుత్తుతో నడుస్తుంది. దీని ధర 61,243 డాలర్లు (రూ.50.40 లక్షలు) మాత్రమే! (sleepisol: ఈ హెడ్సెట్ పెట్టుకుంటే నిమిషాల్లో నిద్రొచ్చేస్తుంది!) -
వైరల్ వీడియో: రోడ్డుపై వెళ్తున్న అందర్నీ పలకరిస్తున్న పిల్లి
-
ప్రభుత్వ జీవోను సమర్ధించిన GVL
-
సంగారెడ్డి: రామచంద్రాపురంలో రోడ్డు పక్కనే మహిళ ప్రసవం
-
Viral Video: అమ్మా! ఏమరపాటు వద్దు.. థ్యాంక్ గాడ్..!
-
వినూత్న నిరసన: నడి రోడ్డుపై భారీ గుంత.. ఇది పార్టీ టైం..!
-
Viral Video: కార్ల సాయంతో నడి రోడ్డుపై వినూత్న స్నానం
-
రోడ్డుపై చెంపదెబ్బలు కొట్టుకున్న యువతీ,యువకుడు.. కారణం ఏంటంటే..
న్యూఢిల్లీ: సాధారణంగా యువతీ, యువకులు సరదాగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రాంక్ వీడియోలు చాలావరకు ఫన్నీగా సాగినప్పటికీ...కొన్నిసార్లు మాత్రం వివాదాస్పదమవుతాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసిందే. తాజాగా, సరదాకోసం చేసిన ఒక ప్రాంక్ వీడియో యువతీ, యువకులు కొట్టుకోవడం వరకు వచ్చింది. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఢిల్లీలోని కానాట్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక పార్కులో.. సదరు యువతి సరదాగా ప్రాంక్ వీడియో చేస్తుంది. దీనిలో భాగంగా శీతల పానీయాలను రోడ్డుపై వెళ్తున్న యువకులపై వేసింది. ఈ క్రమంలో ఒక యువకుడిపై, సదరు యువతి శీతల పానీయాన్ని వేసింది. దీంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ యువకుడిని, యువతి నోటికొచ్చినట్లు తిట్టింది. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఆ యువతి, యువకుడిని చెంపదెబ్బకొట్టింది. తొలుత యువకుడికి నోటమాట రాలేదు. ఆ తర్వాత అతను కూడా యువతిని లాగిపెట్టి కొట్టాడు. ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున గుమిగూడారు. వారిద్దరి గోడవను కొందరు వేడుకలాగా చూస్తున్నారు. మరికొందరు వారి గోడవను కూడా సెల్ఫీవీడియో తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘భలే.. సరైన సమాధానం ఇచ్చావు..’,‘ ఆడవళ్లే కదా.. ఏది చేసిన చెల్లుతుంది అనుకోవద్దు..’,‘ మీ.. ప్రాంక్ వీడియోలకు ఒక దండం..’, ‘ఒక వ్యక్తిని కించపర్చకూడదు..’‘ఇది.. స్ర్కిప్ట్ చేసిన వీడియో మాదిరిగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, గతంలో లక్నోలో ఒక యువతి నడిరోడ్డుపై ఒక క్యాబ్‌డ్రైవర్‌పై చేయిచేసుకున్న సంఘటన పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలసిందే. చదవండి: అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు! -
నడిరోడ్డుపై ప్రసవించిన మహిళ..
జవహర్‌నగర్: ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ ఎన్ని రకాల ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నప్పటికీ నేటికీ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందని పరిస్థితే ఉంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోగల జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ పేద గర్భిణి రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది. తీవ్ర ప్రసవ వేదనను అనుభవిస్తూ శిశువుకు జన్మనిచ్చినప్పటికీ కనీసం తల్లి నుంచి శిశువును వేరు చేసేందుకు పేగును కత్తిరించేవారు లేకపోవడంతో ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఆ ప్రాణం కొద్ది నిమిషాల్లోనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకరమైన జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే జరగడం మరింత విషాదకరం. రోడ్డుపై స్పృహతప్పి పడిపోయి..ప్రసవం మేడ్చల్‌కు చెందిన లక్ష్మి 8 నెలల గర్భిణి. కొంత కాలంగా ఆమె కాలి గాయంతో బాధపడుతోంది. తీవ్రమైన నొప్పితో ఆమె చికిత్స కోసం సోమ వారం ఉదయం 11.30 గంటలకు జవహర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌కు చేరుకుంది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న బెంచ్‌పై కూర్చొని ఉండగా కాలి గాయం నుంచి చీము కారుతుండటాన్ని ఫార్మసిస్ట్ గమనించింది. ఇదే అంశాన్ని స్టాఫ్ నర్సు సుశీలకు వివరించింది. గాయానికి డ్రెసింగ్ చేయాల్సిందిగా కోరడంతో హోలీ సెలవు నేపథ్యంలో డ్రెసింగ్ చే యడం కుదరదని, మంగళవారం ఉదయం వస్తే చేస్తామని చెప్పి, నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ మందులు ఇచ్చి పంపారు. దీంతో లక్ష్మి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లింది. కాగా, నీరసంతో ఉ న్న ఆమె ఆసుపత్రి సమీపంలోని రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనివ్వడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పేగును కత్తిరించి తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు. అప్పటికే శిశువు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. స్పృహతప్పి పోయిన ఆ బాలింతను మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా, అత్యవసర విభాగంలో అడ్మిట్ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు. గర్భవతి అని చెప్పలేదు: సుశీల స్టాఫ్ నర్సు, జవహర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లక్ష్మి తను కాలి నొప్పితో బాధపడుతున్నట్లు చె ప్పింది. గాయానికి డ్రెస్సింగ్ చేయాలని కోరింది. మంగళవారం రావాల్సిందిగా సూచించాను. అయి తే తను గర్భిణి అనే విషయాన్ని చెప్పలేదు. -
నడిరోడ్డులో శిలాఫలకం
సాక్షి, వికారాబాద్ అర్బన్: పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో నడిరోడ్డులోనే శిలాఫలకం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి కొత్తగా వాహనాలపై వచ్చే వారు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శిలాఫలకాన్ని రోడ్డుపై నుంచి తొలగించి పక్కకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
కన్న తండ్రిని వదిలించుకున్నారు.!
సాక్షి, తిరుపతి: నడక నేర్పించి, విద్యాబుద్ధులు చెప్పించి, ప్రయోజకులను చేసిన తండ్రి వారికి భారమయ్యాడు. ముదిమి వయసులో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిని దిక్కులేని వాడిగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నెల రోజులుగా నానా అవస్థలు పడుతున్న ఆ వృద్ధున్ని ‘అమ్మ ఒడి’ నిర్వాహకులు అక్కున చేర్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి తాలూక గాలివీడుకు చెందిన రొడ్డ చెన్నయ్య(70)కి ఐదుగురు పిల్లలు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్య అంజనమ్మ చనిపోవడంతో వారిని పోషించి, పెళ్లిళ్లు చేశాడు. 10 ఎకరాల పొలం ఉన్నా వచ్చే ఆదాయం బిడ్డలే తీసుకుంటూ వచ్చారు. వయస్సు మీదపడి నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమైన చెన్నయ్యను కోడళ్లు నిర్లక్ష్యం చేశారు. ఆయన ఉంటే తాము కాపురాలు చేయలేమని తెగేసి చెప్పడంతో భార్యల మాటకు విలువనిచ్చిన కుమారులు నెల రోజుల క్రింద అర్ధరాత్రి వేళ తండ్రిని ఒక వాహనంలో తీసుకొచ్చి స్థానిక మల్లికార్జున సర్కిల్ సమీపంలోని వారపుసంత గోడకింద వదిలేసి వెళ్లిపోయారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడు స్థానికులు పెట్టే మెతుకులతో ప్రాణాలు నిలబెట్టుకుంటూ వచ్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అమ్మ ఒడి ఆశ్రమ నిర్వాహకులు ఆయన్ను అక్కున చేర్చుకున్నాడు. -
ఘోరం.. నడిరోడ్డుపై ప్రసవం
జయపురం(ఒడిశా): నడిరోడ్లపైన, ఆటోలలోను, ఆరుబయట ప్రదేశాలలోను గర్భిణులు ప్రసవిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి సంఘటనలు పునరావృతం కాకండా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు శూన్యంగా ఉన్నాయి. అందుచేత గర్భిణులు పురిటి నొప్పులతో రోడ్లపై ప్రసవిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలో ఒక గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు 102 అంబులెన్స్ రాకపోవడంతో బంధువులు ఆమెను మోసుకు వెళ్తుండగా రోడ్డుపైనే జోలిలో మగబిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన జిల్లాలో జననీ సురక్షా పథకాలు, 102 అంబులెన్స్‌ల పనితీరును, మారుమూల గ్రామీణ ప్రాంతాల దురావస్థను చాటి చెబుతోంది. కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలోని మారుమూల దుర్గమ ప్రాంతం ముర్జ గ్రామ పంచాయతీలోని కుసుమపుట్ గ్రామం. గ్రామానికి చెందిన జునేశ్ జానీ భార్య సువాలొంగ్ గర్భిణి. ఆమె శనివారం పురిటి నొప్పులతో మెలికలు తిరుగుతూ బాధపడుతుంటే భర్త వెంటనే ఈ విషయం గ్రామంలోని ఆశా కార్యకర్తకు తెలియజేశాడు. ఆమె వచ్చి పరిస్థితిని చూచి 102 అంబులెన్స్‌కు ఫోన్‌చేసి వెంటనే రమ్మని కోరింది. అయితే మచ్ఛపుట్–కుసుముపుట్ గ్రామాల మధ్య రహదారి బాగులేక పోవడం వల్ల అంబులెన్స్ రాలేక పోయింది. మరోమార్గం లేక గర్భిణి బంధువులు ఆమెను ఒక జోలీలో మోసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఆమె ప్రసవించింది. అయితే అమెను హాస్పిటల్‌కు చేర్చాలన్న లక్ష్యంతో అంబులెన్న ఉన్న చోటువరకు తల్లీబిడ్డలను బంధువులు మోసుకువెళ్లారు. అక్కడినుంచి తల్లీబిడ్డలను దశమంతపూర్ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి తరలించారు. అధ్వానంగా రహదారులు ముఖ్యంగా జిల్లాలో అనేక గ్రామాలకు రహదారులు లేకపోవడం, ఉన్నా అవి గతకుల మయమై వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, తదితర కారణాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేసేందుకు, పంచాయతీలతో గ్రా మ ప్రాంతాలను సంధానపరిచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నా అత్యధిక గ్రామాలు, ముఖ్యంగా మారు మూల దర్గమ ప్రాంతాలలో గల గ్రామాలకు రోడ్లు లేకపోవడం వల్ల ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -
రోడ్డుపైకి వచ్చిన మయూరం
మడకశిర రూరల్ : అటవీ ప్రాంతంలో మేత, నీరు లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఆదివారం మండలంలోని గుడ్డంపల్లి సమీపంలోని ప్రధాన రోడ్డుపైకి నెమలి వచ్చింది. కొద్దిసేపు రోడ్డుపైనే అటూ ఇటూ తిరిగి సమీపంలో ఇళ్ల ముందున్న నీరు తాగింది. అనంతరం సమీపంలోని పొదల్లోకి వెళ్లింది. అధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం మేత, నీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
రోడ్డెక్కిన యుద్ధ విమానం
వినువీధిలో దూసుకుపోతూ, శత్రులక్ష్యాలపై దాడి చేసే యుద్ధ విమానం జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ కనిపించింది. ప్రయాణించడం అంటే తనంతట తాను వెళ్లడం కాదు.. తానే మరో వాహనాన్ని ఆశ్రయించి గమ్యానికి వెళ్లడం. ఆదివారం గోవా నుంచి విశాఖపట్నానికి ట్రాలీపై తరలిస్తున్న యుద్ధ విమానం రావులపాలెం మండలం ఈతకోట వద్ద ‘సాక్షి’కి కనిపించింది. ముందు భాగంలో రాకెట్ తరహాలో ఉన్న ఈ యుద్ధ విమానాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ట్రాలీ డ్రైవర్ని అడిగితే ‘ఆర్మీ వినియోగించే విమానం’ అని మాత్రమే చెప్పాడు. – -రావులపాలెం (కొత్తపేట) -
రోడ్డెక్కిన రైతులు
ఓడీ చెరువు: రక్షకతడి కోసం రైతులందరికీ పైపులు, రెయిన్గన్లు ఇవ్వాలంటూ గురువారం పలు గ్రామాల రైతులు రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లాపల్లి, వనుకువారిపల్లి, గాజుకుంటపల్లి తదితర గ్రామాల రైతులు మాట్లాడుతూ రక్షక తడికోసం కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోయారు. వారం నుంచి తిరుగుతున్నా ఇప్పటికీ పైపులు ఇవ్వడం లేదన్నారు. అధికార పార్టీ అండదండలు ఉన్న వారికే అందిస్తున్నారని వారు ఆరోపించారు. పంట ఎండాక పైపులు ఇస్తే ఏం చేసుకోవాలని వారు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం పైపులు ఇస్తామని స్లిప్పులు రాసిచ్చారన్నారు. అవి తీసుకుని గోడౌన్ వద్దకు వస్తే పైపులు అయిపోయాయి.. వచ్చాక ఇస్తామని వెనక్కి పంపుతున్నారన్నారు. స్లిప్పులు ఇచ్చిన రైతులందరకీ పైపులు ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. అమడగూరు మండలానికి వెళ్తున్న పైపుల లారీలను అడ్డుకుని ఓడీసీ రైతులకు అందచేయాలని లేకుంటే వెళ్లనీయమని అడ్డుకున్నారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులతో మాట్లాడారు. అందరికీ పైపులు ఇస్తారని నచ్చజెప్పి నిరసన విరమింపచేశారు. -
బండవడింది..!
గ్రానైట్ కార్వీ యజమానుల నిర్లక్ష్యమో... ఓవర్‌లోడ్ ఫలితమో... లారీ ఫిట్నెస్ పరీక్షించడంలో ఆర్టీఏ అధికారుల తప్పిదమో... ఏదైతేనేం గ్రానైట్ లారీలతో ప్రజలకు ప్రమాదాలు పొంచివున్నాయనడానికి నిదర్శనం ఈ చిత్రం. గంగాధర మండలంలోని ఓ గ్రానైట్ క్వారీ నుంచి కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు పే...ద్ద గ్రానైట్ బండను తరలిస్తుండగా లారీ ఇంజన్, బాడీ మధ్యనుండే రాడ్ విరిగిపోయింది. నడిరోడ్డుపై భారీ శబ్ధంతో బండరాయి పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక సుభాష్‌నగర్ విగ్రహం వద్ద ఈ సంఘటన జరిగితే.. సాయంత్రం వరకు ఆ బండ రోడ్డుపైనే ఉంది. దానికి తొలగించకపోవడంతో కరీంనగర్–చొప్పదండి రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. –ఫొటో : గుంటపల్లి స్వామి, సాక్షి ఫొటోగ్రాఫర్ కరీంనగర్. -
పాపం పసిపాపలు
-
పాపం పసిపాపలు
రోడ్డుపాలైన ఇద్దరు ఆడ శిశువులు ఒకరికి అనారోగ్యం, మరొకరిని కావాలని వదిలి వెళ్లిన వైనం...ఆడపిల్ల భారం అనుకుందో ఓ అమ్మ...అనారోగ్యంతో ఉన్న బిడ్డను దేవుడి మెట్లపై ఉంచి నిర్దయగా వదిలివెళ్లిందో మరో తల్లి..దీంతో వెచ్చని పొత్తిళ్లలో ఉండాల్సిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం సిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ పసికందును(ఆడశిశువు) ఎవరో గర్భిణుల వార్డు ఆవరణలో వదిలి వెళ్లారు. కుక్కలు స్వైర విహారం చేస్తున్న ఈ ప్రాంతంలో ఆ చిన్నారి పెట్టిన చావు కేకలే పాపను కాపాడాయి. క్షణం ఆలస్యం జరిగి ఉన్నా... స్థానికులు సకాలంలో స్పందించక పోయినా..పాప శునకాలకు ఆహారంగా మారిపోయేది. ఈ ఘటనపై ఇన్చార్జ్ ఆర్ఎంఓ, శివకుమార్ మాట్లాడుతూ.. గర్భిణుల వార్డు ఆవరణలోని నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి పెట్టారనీ, చీకట్లో పాప ఏడుపులు విని స్థానికులు సమాచారం ఇవ్వడంతో విషయం తమకు తెలిసిందన్నారు. పాపను పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకుని పరీక్షించగా, కామెర్లు ఉన్నట్లు గుర్తించి వైద్యం అందిస్తున్నామన్నారు. శిశువు చేతికి ఉన్న ట్యాగ్‌ను బట్టి చూస్తే ప్రైవేట్ ఆస్పత్రి నుంచి తీసుకువచ్చి ఇక్కడ వదిలేసినట్లు తెలుస్తోందన్నారు. ఇక ధర్మవరానికిSచెందిన శిశువు అనారోగ్యంతో ఉండడంతో తల్లిదండ్రులే ధర్మవరం రూరల్ పరిధిలోని నగటూరు గ్రామంలోని పోతప్పస్వామి ఆలయం మెట్లపై వదిలి పెట్టినట్లు తెలుస్తోందన్నారు. నిఘాలో తేలుతుంది.. సర్వజనాస్పత్రి ఆవరణ మెత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పసి కందును ఎవరు వదిలి పెట్టారో ఉదయాన్నే గుర్తించే వీలుందని వైద్యాధికారి తెలిపారు. పోలీసులు కూడా ఆ పనుల్లో ఉన్నారన్నారు. -
రోడ్డెక్కిన గోదావరి జలాలు
పైప్ లీకేజితో వృథాగా పోతున్న నీరు జగన్‌గూడ మూలమలుపు వద్ద లీకేజీ శామీర్‌పేట్: శామీర్‌పేట్ మండలం జగన్‌గూడలో గోదావరి జలాల కోసం ఏర్పాటు చేసిన పైప్‌లైన్ లీకేజీతో నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరాస్తా నుంచి యాదాద్రి(యాదగిరి గుట్ట) వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైప్‌లైన్ జగన్‌గూడ వద్ద గురువారం ఉదయం లీకేజీ అయింది. దీంతో గోదావరి జలాలు రోడ్డుపై పారుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సబ్ కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పైప్‌లైన్ లీకైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పైప్‌లైన్‌ను పరిశీలించి లీకేజీని అరికట్టి నీరు వృథా కాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నడిరోడ్డుపైనే ప్రసవం
విజయవాడ: ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం ఆస్పత్రికి వెళుతూ.. నడిరోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విజయవాడ నగరంలోని చిట్టినగర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామన ఈ ఘటన జరిగింది. చిట్టినగర్ సొరంగ మార్గం సమీపంలో నివసించే షేక్ గౌసియా (21) అనే మహిళకు పురుటి నొప్పులు మొదలుకావడంతో తల్లితో కలసి సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రికి బయల్దేరింది.. అయితే రోడ్డుపై నడచి వెళుతుండగానే నొప్పులు అధికం కావడంతో అక్కడికక్కడే కూలబడిపోయింది. ఇది గమనించిన స్థానిక మహిళలు సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఇంట్లో ఉన్న చీరలు తెచ్చి గౌసియా చుట్టూ అడ్డంగా పెట్టాంరు. నొప్పుల బాధపడుతున్న ఆమెను ఓదార్చారు. ఓ అరగంట వేదన అనంతరం గౌసియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరికళ్ల వెంబడి ఆనందభాష్పాలు రాలాయి. ఆ తరువాత 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం గౌసియా, ఆమె కొడుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు. -
హైవేపై కుప్పకూలిన విమానం
ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ నుంచి క్వెరెటరోకు వెళుతోన్న ఎం7 ఎయిరోస్పేస్ ఎల్పీ అనే చిన్నతరహా విమానం ఒక్కసారిగా హైవేపై కుప్పకూలి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారని బుధవారం స్థానిక అధికారులు తెలిపారు. వేల అడుగుల ఎత్తులో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్ ప్రయత్నం చేశాడని, ఆ క్రమంలోనే విమానం అదుపు తప్పి నేలను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా పేలిపోయిందని స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారి గెరార్డో చెప్పారు. చనిపోయిరవారి వివరాలు ఇంకా తెలియాల్సిఉందన్నారు.