ఫిబ్రవరిలో 13 శాతం వృద్ధి
20,29,541 యూనిట్ల విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) గురువారం తెలిపింది.
‘భారత్‌లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్‌లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్‌ఏడీఏ వివరించింది.
‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment