బండవడింది..! | stone droped | Sakshi
Sakshi News home page

బండవడింది..!

Aug 25 2016 11:47 PM | Updated on Sep 4 2017 10:52 AM

గ్రానైట్‌ కార్వీ యజమానుల నిర్లక్ష్యమో... ఓవర్‌లోడ్‌ ఫలితమో... లారీ ఫిట్‌నెస్‌ పరీక్షించడంలో ఆర్టీఏ అధికారుల తప్పిదమో... ఏదైతేనేం గ్రానైట్‌ లారీలతో ప్రజలకు ప్రమాదాలు పొంచివున్నాయనడానికి నిదర్శనం ఈ చిత్రం. గంగాధర మండలంలోని ఓ గ్రానైట్‌ క్వారీ నుంచి కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌కు పే...ద్ద గ్రానైట్‌ బండను తరలిస్తుండగా లారీ ఇంజన్, బాడీ మధ్యనుండే రాడ్‌ విరిగిపోయింది.

గ్రానైట్‌ కార్వీ యజమానుల నిర్లక్ష్యమో... ఓవర్‌లోడ్‌ ఫలితమో... లారీ ఫిట్‌నెస్‌ పరీక్షించడంలో ఆర్టీఏ అధికారుల తప్పిదమో... ఏదైతేనేం గ్రానైట్‌ లారీలతో ప్రజలకు ప్రమాదాలు పొంచివున్నాయనడానికి నిదర్శనం ఈ చిత్రం. గంగాధర మండలంలోని ఓ గ్రానైట్‌ క్వారీ నుంచి కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌కు పే...ద్ద గ్రానైట్‌ బండను తరలిస్తుండగా లారీ ఇంజన్, బాడీ మధ్యనుండే రాడ్‌ విరిగిపోయింది. నడిరోడ్డుపై భారీ శబ్ధంతో బండరాయి పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక సుభాష్‌నగర్‌ విగ్రహం వద్ద ఈ సంఘటన జరిగితే.. సాయంత్రం వరకు ఆ బండ రోడ్డుపైనే ఉంది. దానికి తొలగించకపోవడంతో కరీంనగర్‌–చొప్పదండి రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
–ఫొటో : గుంటపల్లి స్వామి, సాక్షి ఫొటోగ్రాఫర్‌ కరీంనగర్‌. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement