Gangadhara
-
ఆ ఇల్లే.. ఓ మ్యూజియం!
చెక్క ఫ్యాన్ ను చూశారా? వందేళ్ల కిందటే వంట పాత్ర కమ్ హాట్ క్యారేజ్ ఉండేది తెలుసా? రేడియో ఉండాలంటే లైసెన్ ్స కావాలా? ఇలా మనం చూడని.. మనకు తెలియని ఎన్నో వస్తువులు, కళ్లు చెదిరే కళాఖండాలు, అబ్బురపరచే చిత్రాలెన్నో అక్కడ దర్శనమిస్తాయి. వీటిని చూడాలన్న ఉత్సుకత.. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే పరవాడలోని కోరుపోలు గంగాధరరావు ఇంటికి వెళ్లాల్సిందే! ఆయన 22 ఏళ్ల ఈ ప్రయాణాన్ని తెలుసుకోవలసిందే!గంగాధరరావు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని బపాడుపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. పిల్లలకు పాఠాలు చెబుతున్న సమయంలో పుస్తకాల్లో ఉన్నది చెప్పడంతో పాటు వాటిని పిల్లలకు ప్రత్యక్షంగా చూపిస్తే వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇచ్చినట్టవుతుంది కదా అనే ఆలోచన వచ్చింది ఆ టీచర్‌కి. ఆ బాటలో సాగిపోతుండగా ఒకరోజు ఆయనకు అల్యూమినియం, రాగి నాణేలు లభించాయి.వాటి మీద ఆసక్తి పెరిగి నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం ప్రారంభించాడు. అది కాస్త ఒక యజ్ఞంలా మారి ‘మోస్ట్ కలెక్షన్ ఆఫ్ వెరైటీ టెన్ రూపీస్ కాయిన్స్’ అంశంపై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ కాయిన్ ్స అంశంలో మూడుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరును నమోదు చేసింది. 2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కూ దరఖాస్తు చేసుకున్నారాయన. నాణేలు సరే.. కనుమరుగైపోతున్న వస్తువులనూ ఈ తరానికి చూపించాలన్న ఆలోచనా చేశారు గంగాధరరావు.తక్షణమే వాటి సేకరణాæ మొదలుపెట్టారు. అలా ఆయన ఇల్లు ఇప్పుడు 100 నుంచి 300 ఏళ్ల నాటి ఇత్తడి కొలత పాత్రలు, కంచు గిన్నెలు, గోకర్ణాలు, బోషాణం, రంగం పెట్టెలు, బ్రిటిష్ కాలం నాటి పాత పేపర్లులాంటి పలురకాలకు చెందిన రెండువేలకు పైగా వస్తువులతో మ్యూజియమ్‌ను తలపిస్తోంది. ఆ వస్తువుల్లో ఆసక్తిరనమైన కొన్ని..మ్యూజియం ఏర్పాటే లక్ష్యం.. "అప్పట్లో వాడిన ప్రతి వస్తువుకూ ఓ ప్రత్యేకత ఉంది. ఆ వస్తువుల్లో ఆరోగ్యం ఉండేది. ఆ ప్రాముఖ్యతను, ఆ సంప్రదాయాలను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే మన పూర్వీకులు వాడిన ప్రతి వస్తువును సేకరించి భద్రపరచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. అవి అందరికీ అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఓ మ్యూజియమ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సహకరిస్తే నా కల నెరవేరుతుంది". – గంగాధరరావు, పరవాడచెక్క ఫ్యాన్..దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెక్క ఫ్యాన్‌కు పేటెంట్ కూడా ఉంది. బ్రిటిష్ కాలంలో ఈ ఫ్యాన్ ను వినియోగించేవారు. ఇందుకోసం పంకా మ్యాన్ అనే ఉద్యోగం ఉండేది. చెక్క ఫ్యాన్ తిప్పడమే ఆ ఉద్యోగి పని. 1920లో తయారైన ఈ ఫ్యాన్ కోసం గంగాధరరావు రూ. 45 వేలు పెట్టి.. ఢిల్లీ నుంచి తెప్పించారు.స్టీమ్ క్యారేజ్..1917లో తయారైన ఈ స్టీమ్ క్యారేజ్ సుమారు పది కిలోల బరువు ఉంటుంది. ఇందులో వంట వండుకోవడమే కాక వండిన వంటను 10 నుంచి 12 గంటల పాటు వేడిగానూ పెట్టుకోవచ్చు. దీన్ని గంగాధరరావు రూ. 16 వేలు వెచ్చించి రాజస్థాన్ , జైపూర్ నుంచి తీసుకొచ్చారు.రేడియోలు.. లైసెన్సులు..మొదటితరం నాటి 10 రకాల రేడియోలను ఆయన సేకరించారు. అప్పట్లో రేడియో ఉండాలంటే పోస్టాఫీస్ నుంచి లైసెన్స్ తీసుకోవలసి వచ్చేదట. ఆ లైసెన్ ్స కాపీలూ మాష్టారి వద్ద ఉన్నాయి. అంతేకాదు బ్రిటిష్ వారి గెజిట్స్, స్వాతంత్య్ర ఉద్యమం నాటి పోస్ట్కార్డ్స్నూ ఆయన సేకరించారు.సేకరణలో కష్టాలెన్నో.. ఇలాంటి వస్తువులన్నింటినీ సేకరించేందుకు మొదట్లో గంగాధరరావు.. ఫలానా వస్తువు ఫలానా చోట ఉంది అని తెలియగానే సంబంధిత వ్యక్తులకు ఉత్తరాలు రాసేవారట. తర్వాత ఫోన్లు రావడం, వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ కావడంతో పని కొంత సులువైందంటారు. ఫలానా చోట వస్తువు ఉందంటే ముందుగా డబ్బులు చెల్లిస్తే.. వారే ఇంటికి పంపిస్తున్నారట. ఇందులో కూడా పోటీ ఉంటుంది. ఒకసారి మిస్ అయితే ఆ వస్తువు మళ్లీ దొరకదు.అందుకే ఎంత కష్టమైనా వెంటనే డబ్బులు చెల్లించి వస్తువు సేకరిస్తున్నారు. దీనికోసం ఆయన ప్రతి నెలా తనకు వచ్చే ఆదాయంలోంచి 20 శాతాన్ని కేటాయిస్తున్నారు. తను సేకరించిన వస్తువుల కోసం ఇప్పటివరకు రూ. 10 లక్షలకు పైనే వెచ్చించారు. ఆయనకు ‘ఎఖఅNఖీఐఖ్ఖఉ ’ అనే యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఆయన సేకరించిన ప్రతి వస్తువు గురించి ఇందులో వివరిస్తుంటారు. దీనికి 2.58 కోట్ల మంది వ్యూయర్స్, 1.38 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.‘గోల్డ్ స్పాట్ గురించి చెబితే దాదాపు 5 లక్షల మంది చూశారు. గోల్డ్ స్పాట్ జ్ఞాపకాలను పంచుకుంటూ 20 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. లూనాపై వీడియో చేస్తే కూడా అంతే వైరల్ అయింది. నా దగ్గరున్న వస్తువులను చూడ్డానికి హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు. నా యూట్యూబ్ చానెల్ వీడియోలు చూసి చాలామంది సినిమా డైరెక్టర్లూ నన్నూ అప్రోచ్ అవుతున్నారు.. నేను సేకరించిన వస్తువులను తమ సినిమాల్లో ఉపయోగించుకుంటామంటూ! ఈ రెస్పాన్స్ భలే సంతోషాన్నిస్తోంది. నేను పడ్డ శ్రమ, పెట్టిన ఖర్చును మరచిపోయేలా చేస్తోంది’ అంటారు గంగాధరరావు. – గొరకల పూర్ణచందర్, సాక్షి, విశాఖపట్టణం -
‘ఏందిరా ఈ పంచాయితీ’ ఎప్పుడంటే..?
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. భరత్, విషికా లక్ష్మణ్ జంటగా టి. గంగాధర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఎం. ప్రదీప్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న విడుదల కానుంది. ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కు, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ స్వరకర్త. -
ఆకట్టుకుంటున్న 'ఏందిరా ఈ పంచాయితీ' గ్లింప్స్
ప్రేమ కథలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. కథలో కొంచెం కొత్తదనం ఉంటే చాలు.. ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకే యువ దర్శకులు ఎక్కువగా లవ్‌స్టోరీలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో ప్రేమ కథా చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’ రాబోతుంది. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గంగాధర.టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్ తాజాగా విడుదలైంది. మంచోడే అంటావా?’ అంటూ హీరోయిన్ డైలాగ్‌తో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది. ‘ఎవరే.. ’అని హీరోయిన్ ఫ్రెండ్ డైలాగ్.. ‘అదే అభి..’ అంటూ హీరోయిన్ కాస్త హీరో ఇంట్రడక్షన్ గురించి చెప్పడం.. ‘యమునా.. తొందరగా నా గురించి ఏమైనా ఆలోచించొచ్చు కదా?’ అని హీరో అనడం.. (నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా?’ అని హీరోయిన్ డైలాగ్ ఇలా గ్లింప్స్ మొత్తం కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
కరీంనగర్: సంబురంగా చిందులేస్తూ కుప్పకూలి..
సాక్షి, కరీంనగర్: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులవి. పైగా గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం మరీ ఘోరం. తాజాగా జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఆగి కన్నుమూసింది. అదీ సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే.. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ హుషారులో డాన్స్ చేస్తూ కుప్పకూలింది ఓ విద్యార్థి. ఊపిరి తీసుకోవడంలో అవస్థలు పడింది. దీంతో ఆమెకు సీపీఆర్ చేసి మరీ ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అయితే మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తిగా గుర్తించారు.అయితే ఆమెకు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ప్రదీప్తి మరణంతో ఆమె సొంతూరు వెంకటాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: లవర్‌ను రప్పించి మరీ యువతి ఘాతుకం -
గంగాధర మిస్టరీ మరణాల్లో కొత్తకోణం.. మమత శరీరంలో ఆర్సెనిక్!
సాక్షి, కరీంనగర్: సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లాలోని గంగాధర మిస్టరీ కేసు మరో మలుపు తిరగనుంది. పోలీసులు అనుమానిస్తున్నట్లు ఇంటి పెద్ద వేముల శ్రీకాంత్ తన భార్యాపిల్లలపై విషప్రయోగం చేశాడని నిర్ధారణ అయితే.. పిల్లల మృతదేహాలకూ పోస్టుమార్టం తప్పేలా లేదు. డిసెంబరు 30న అర్ధరాత్రి వేముల శ్రీకాంత్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే విషయాన్ని చికిత్స సమయంలో వైద్యులకు చెప్పాడు. ఈ పరిణామంతో పోలీసుల దర్యాప్తు అకస్మాత్తుగా శ్రీకాంత్ వైపు తిరిగింది. శ్రీకాంత్ బయోటెక్నాలజీలో పీజీ చేయడం.. ఫుడ్ సైన్స్ లెక్చరర్ కావడం.. రోజూ ప్రయోగాల కోసం ల్యాబ్‌లో రసాయనాలు వినియోగించడం.. వెరసీ అతనికి కెమికల్స్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉందని పోలీసులు నిర్ధా రణకు వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల తరహాలోనే తానూ రక్తపువాంతులు, విరోచనాలు చేసుకుని మరణించడంతో వారి శరీరంలోనూ సోడియం హైడ్రాక్సైడ్ చేరిందా..? అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఫోరెన్సిక్ అధికారులు మమత శరీరంలో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు వారు మరింత లోతుగా రసాయన విశ్లేషణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఎఫ్ఎస్ఎల్ తుది నివేదిక పంపితే.. మమత మరణానికి స్పష్టమైన కారణం తెలియనుంది. 45 రోజుల్లో నలుగురు ఈ ఘటనల్లో తొలుత శ్రీకాంత్ కొడుకు అద్వైత్ (20నెలలు)వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురై నవంబరు 16న కన్నుమూశాడు. అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) డిసెంబర్ ఒకటిన ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు. అంతుచిక్కని వ్యాధి, కలుషిత తాగునీరు కారణమనుకుని సమీపంలోని బావిలోని తాగునీటిని, బాధితుల బంధువుల రక్తాన్ని పరీక్షించారు. అయినా వారికి ఏమీ చిక్కలేదు. దీంతో మిస్టరీ మరణాలు చేతబడి, మంత్రాల కారణంగా జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. శ్రీకాంత్ భార్య మమత (26) కూడా అనారోగ్యానికి గురై డిసెంబరు 18న మరణించింది. డిసెంబరు 30న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 45 రోజుల వ్యవధిలో మొత్తం కుటుంబం అనుమానాస్పద స్థితిలో తుడిచిపెట్టుకుపోయింది. మమత శరీరంలో ఆర్సెనిక్..! మరి పిల్లల్లో..? పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మమత శరీర భాగాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లను గుర్తించారు. దీన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆమె శరీరంలోకి ఎలా చేరింది..? పిల్లల మరణాలకు కారణం ఆర్సెనికా..? లేదా సోడియం హైడ్రాక్సైడా..? అనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. పిల్లలిద్దరూ అనారోగ్య లక్షణాలతో మరణించారని వారికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఇపుడు వారి మరణంపై అనేక సందేహాలు వెలుగులోకి రావడంతో వారి శవాలకు పోస్టుమార్టం తప్పనిసరి కానుంది. అందుకే పిల్లల శరీర భాగాల నుంచి విస్రా (అంతర్భాగాల నుంచి నమూనాలు)ను తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్! రెండు నెలల అనంతరం.. నవంబరు 16న 20 నెలల అద్వైత్ అనుమానాస్పదంగా మరణించాడు. అతడిని గంగాధర శివారులోని వంతెన సమీపంలో ఖననం చేశారు. డిసెంబరు ఒకటిన అమూల్య (6) కూడా కన్నుమూసింది. దీంతో తమ్ముడి సమాధి పక్కనే అక్కనూ ఖననం చేశారు. వీరిలో అద్వైత్ మరణించి 50 రోజులు, అమూల్య చనిపోయి 35 రోజులు దాటింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి వారం పట్టవచ్చని పోలీసులు అంటున్నారు. ఒకవేళ మమత శరీరంలో విష ఆనవాళ్లు ఉంటే పిల్లల మరణాలకు కారణం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైతే.. పిల్లలు మరణించిన దాదాపు రెండు నెలల అనంతరం పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
కరీంనగర్ జిల్లా: నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురి మృతి
-
అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్లో కుటుంబం బలి
సాక్షి, కరీంనగర్: అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం బలైంది. ఒకే వ్యాధితో ఇద్దరు చిన్నారులతో సహా తల్లిదండ్రులు మృతి చెందిన ఘటన గంగాధర మండల కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది. నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు..గంగాధరకు చెందిన లక్ష్మీపతి కుమారుడు శ్రీకాంత్‌కు చొప్పదండికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా వీరికి కూతురు అమూల్య (6), కుమారుడు అద్వైత్ (2) జన్మించారు. నవంబర్ నెలలో మొదట శ్రీకాంత్ తనయుడు అద్వైత్ వాంతులు విరేచనాలు, వాంతులు చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తనయుడి మరణం నుంచి కోలుకోకముందే శ్రీకాంత్ కూతురు అమూల్యం కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్9న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. ఇటీవల ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్‌కు ఏడుపే మిగిలింది. భార్య, పిల్లల మృతితో అనారోగ్యానికి గురైన శ్రీకాంత్ కూడా శనివారం ఉదయం ఇంట్లో రక్తం కక్కుకొని మరణించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. మృతుల రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ కుటుంబానికి బలితీసుకున్న వ్యాధి ఏంటనేది మిస్టరీగా మారింది. జన్యుపర లోపాలా లేక ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట హైదరాబాద్‌లో చికిత్స పొందిన చిన్నారులు, తల్లి విషయంలో డాక్టర్లు వీరికి సోకిన వ్యాధిని నిర్ధారించలేకపోయారని మృతుల బంధువులు చెప్తున్నారు. మరోవైపు అంతుచిక్కని వ్యాధిపై గంగాధర స్థానికల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. -
కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. వింత రోగంతో తొలుత కొడుకు, ఆ తర్వాత బిడ్డ ఇటీవల భార్య ఒక్కొక్కరుగా కన్నుమూశారు. వాంతులు, విరేచనాలతో తల్లిడిల్లి కానరాకుండా పోయారు. ఆ మరణాలకు కారణాలేమై ఉంటాయో ఇప్పటికీ తెలియకపోవడం మరో విషాదం. తాజాగా ఆ కుటుంబ యజమాని వేముల శ్రీకాంత్ తనవాళ్లలాగే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కరీంగనగర్ జిల్లా మండల కేంద్రమైన గంగాధరలో భయాందోళనలు రేపుతున్న ఘటన వివరాలిలా ఉన్నాయి... వేముల శ్రీకాంత్ కుటుంబం కొన్నేళ్ల నుంచి వాగు ఒడ్డున నివసిస్తోంది. ఆయనకు భార్య మమత, కూతురు అమూల్య (4), అద్వైత్ (2) ఉన్నారు. ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబ ప్రయాణంలో తీరని విషాదం నవంబర్ 16న చోటుచేసుకుంది. శ్రీకాంత్ తనయుడు అద్వైత్ వాంతులు, విరేచనాలతో అవస్థ పడగా, ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. అయ్యో అమూల్య! తనయుడి మరణం నుంచి కోలుకోకుండానే శ్రీకాంత్ కూతురు అమూల్య కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్ 4న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. మరోవైపు తమ బిడ్డల్ని బలితీసుకున్న ఆ వింతరోగమేంటో తెలియని పరిస్థితి! బిడ్డల కర్మకాండలు పూర్తి చేసుకున్న శ్రీకాంత్, మమత దంపతులు ఇటీవల ధర్మపురిలో గంగ స్నానం ఆచరించి ఇంటికివెళ్లారు. అయితే, ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్ క్షణం ఆలస్యం చేయకుండా భార్యను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్‌కు ఏడుపే మిగిలింది. అయితే, తమ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న ఆ వింతవ్యాధి ఏంటో తెలియడం లేదని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈక్రమంలోనే శ్రీకాంత్ కూడా అదే తరహాలో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతని రక్త నమూనాలు, వారు వినియోగిస్తున్న నీటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ముంబై పంపించామని వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే, జిల్లా వైద్య అధికారులు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కుటుంబ సభ్యులకు విషం; మరో వ్యక్తితో పరారీ..
సాక్షి, గంగాధర(కరీంనగర్) : స్వీటు పదార్థంలో కుటుంబ సభ్యులకు విషం కలిపిచ్చిందో మహిళ. దాన్ని తిన్న నలుగురు స్పృహ తప్పి పడిపోగా.. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగరం ఉమ గురువారం రాత్రి సేమియా తయారుచేసింది. దాన్ని భర్త విలాసాగరం అంజయ్య, మామ రాజేశం, కొడుకు సిద్దార్థ(11), కూతురు మన్విత(4)కు వడ్డించింది. అత్త లక్ష్మికి ఇవ్వగా తినలేదు. స్వీటుతిన్న కాసేపటికే నలుగురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన ఉమ గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయింది. శుక్రవారం వేకువజామున స్పృహలోకి వచ్చిన అంజయ్య తేరుకుని విషయాన్ని అదే గ్రామంలో ఉన్న బంధువులకు చెప్పేందుకు వెళ్తుండగా.. డ్రెయినేజీలో పడి గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు నలుగురిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు కోలుకోగా.. మన్విత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అంజయ్య తెలిపాడు. -
ముగిసిన కళాశాలల వాలీబాల్ పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో అండర్ –19 బాలబాలికలకు నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలు గురువారం ముగిసాయి. పోటీలకు జిల్లా వ్యాప్తంగా 32 బాలబాలికల జట్లు హాజరయ్యాయి. బాలుర విభాగంలో రుక్మాపూర్ గురుకుల పాఠశాల, మహాత్మగాం«ధీ జ్యోతిబాపూలే కమలాపూర్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగాధర జట్టుప్రథమ, ప్రభుత్వ జూనియర్ కళాశాల కోహెడ జట్టు ద్వితీయస్థానాల్లో నిలిచాయి. సాయంత్రం జరిగిన బహుమతి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య కార్యదర్శి జి.మధుజాన్సన్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫిజికల్ డైరెక్టర్లు ఆనంద్, నాగేశ్వర్రావు,వెంకటరెడ్డి, సరిత, సుష్మా తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జట్ల జాబితాను కార్యదర్శి ప్రకటించారు. బాలుర జట్టు: సతీష్(రుక్మాపూర్), దినేష్,నరేష్, మునీందర్(గంగాధర), గణేష్, కార్తీక్(గొల్లపల్లి), రాజేష్(హుజురాబాద్), నరేష్(హుస్నాబాద్), మహేశ్(జూలపల్లి), మారుతి(సుల్తానాబాద్), గణేష్, విజయ్(కమలాపూర్)లు ఎంపిక కాగా స్టాండ్‌బైగా శౌర్య, శ్రీనివాస్, భగత్, మనోహర్, శివ, సాయిచరణ్‌లు ఎంపికయ్యారు. బాలికల జట్లు: జ్వాల(హుజూరాబాద్), ఆకాంక్ష, నర్మద, శ్రీలేఖ, దివ్య, లహరి, శ్రీవైష్ణవి(కొత్తపల్లి), స్రవంతి, శృతి, మాధురివాణి, సంఘవి(అల్గునూరు), ప్రియాంక(చింతకుంట), అనూష, స్వప్న(నందిమేడారం), పూజ, రిషిత(కరీంనగర్)లు ఎంపిక కాగా స్టాండ్‌బైగా అతిథి, అనూష, సురేఖలు ఎంపికయ్యారు. బాలికల క్రికెట్ జట్టు ఎంపిక... జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో అండర్–19 బాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ముగిశాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారిణులు ప్రతిభ చాటారు. జిల్లా కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి మధుజాన్సన్, వరుణ్‌రావు పాల్గొన్నారు. నేడు వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలో అండర్–19 బాలబాలికలకు వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య కార్యదర్శి మ«ధుజాన్సన్ తెలిపారు. 20న అండర్–19 బాలబాలికలకు స్టేడియంలోనే ఖోఖో, బాలురకు క్రికెట్ జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తిగల క్రీడాకారులు సంబంధిత తేదీల్లో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. -
బండవడింది..!
గ్రానైట్ కార్వీ యజమానుల నిర్లక్ష్యమో... ఓవర్‌లోడ్ ఫలితమో... లారీ ఫిట్నెస్ పరీక్షించడంలో ఆర్టీఏ అధికారుల తప్పిదమో... ఏదైతేనేం గ్రానైట్ లారీలతో ప్రజలకు ప్రమాదాలు పొంచివున్నాయనడానికి నిదర్శనం ఈ చిత్రం. గంగాధర మండలంలోని ఓ గ్రానైట్ క్వారీ నుంచి కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు పే...ద్ద గ్రానైట్ బండను తరలిస్తుండగా లారీ ఇంజన్, బాడీ మధ్యనుండే రాడ్ విరిగిపోయింది. నడిరోడ్డుపై భారీ శబ్ధంతో బండరాయి పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక సుభాష్‌నగర్ విగ్రహం వద్ద ఈ సంఘటన జరిగితే.. సాయంత్రం వరకు ఆ బండ రోడ్డుపైనే ఉంది. దానికి తొలగించకపోవడంతో కరీంనగర్–చొప్పదండి రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. –ఫొటో : గుంటపల్లి స్వామి, సాక్షి ఫొటోగ్రాఫర్ కరీంనగర్. -
అడ్రస్ అడిగి.. గొలుసు లాక్కెళ్లారు!
గంగాధర (కరీంనగర్ జిల్లా) : మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేసిన ఘటన గురువారం గంగాధర మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు కసువు ఊడుస్తున్న మహిళను సర్పంచ్ ఇల్లు ఎక్కడ అని అడిగి..ఆమె అటువైపు తిరగగానే మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లారు. మహిళ అరిచినా దగ్గరలో ఎవరూ లేకపోవడంతో వాళ్లను పట్టుకోలేకపోయారు. సుమారు రూ.30 వేల విలువ చేసే బంగారు గొలుసును దొంగిలించినట్లు బాధితురాలు రుద్రలక్ష్మి(55) తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ ఆవరణలో రైతు ఆత్మహత్యాయత్నం
గంగధార (కరీంనగర్) : వ్యవసాయ రుణం ఇవ్వడం లేదని బ్యాంక్ ఆవరణలోనే ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గంగధార మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతు చిలమల నర్సయ్య(54) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడులకు డబ్బులు లేక వ్యవసాయ రుణం కోసం మండలంలోని ఎస్‌బీహెచ్‌కు వెళ్లాడు. అయితే వ్యవసాయ రుణం ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆయన బ్యాంక్ ఆవరణలోనే ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన తోటి వినియోగదారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై బ్యాంక్ అధికారులను వివరణ కోరగా.. ఐదేళ్ల కిందట గృహ నిర్మాణం కోసం రూ.6 లక్ష ల75 వేలు ఇంటి రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి నయా పైసా కూడా తిరిగిచెల్లించలేదు. అందుకే రుణం నిరాకరించామని తెలిపారు.