వ్యవసాయ రుణం ఇవ్వడం లేదని బ్యాంక్ ఆవరణలోనే ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గంగధార (కరీంనగర్) : వ్యవసాయ రుణం ఇవ్వడం లేదని బ్యాంక్ ఆవరణలోనే ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గంగధార మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతు చిలమల నర్సయ్య(54) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడులకు డబ్బులు లేక వ్యవసాయ రుణం కోసం మండలంలోని ఎస్‌బీహెచ్‌కు వెళ్లాడు.
అయితే వ్యవసాయ రుణం ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆయన బ్యాంక్ ఆవరణలోనే ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన తోటి వినియోగదారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై బ్యాంక్ అధికారులను వివరణ కోరగా.. ఐదేళ్ల కిందట గృహ నిర్మాణం కోసం రూ.6 లక్ష ల75 వేలు ఇంటి రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి నయా పైసా కూడా తిరిగిచెల్లించలేదు. అందుకే రుణం నిరాకరించామని తెలిపారు.