మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేసిన ఘటన సోమవారం గంగాధర మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటుచేసుకుంది.
గంగాధర (కరీంనగర్ జిల్లా) : మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేసిన ఘటన గురువారం గంగాధర మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు కసువు ఊడుస్తున్న మహిళను సర్పంచ్ ఇల్లు ఎక్కడ అని అడిగి..ఆమె అటువైపు తిరగగానే మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లారు.
మహిళ అరిచినా దగ్గరలో ఎవరూ లేకపోవడంతో వాళ్లను పట్టుకోలేకపోయారు. సుమారు రూ.30 వేల విలువ చేసే బంగారు గొలుసును దొంగిలించినట్లు బాధితురాలు రుద్రలక్ష్మి(55) తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.