pigs
-
టీ–17 పందులు సూపర్.. నెలకు లక్షకు పైగా నికరాదాయం!
తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించే సీమ పందుల పెంపకంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పందుల పరిశోధనా కేంద్రం ఎస్వీవీయూ టీ–17 రకం సీమ పందుల జాతిని అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ ఈ జాతి పందులను పెంచుతున్న రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. యువ రైతులు సైతం ఆసక్తి చూపుతుండటం విశేషం. పంది మాంసాన్ని ‘పోర్క్’ అంటారు. కండ (హమ్), వారు (బాకన్), సాసెజ్, నగ్గెట్స్, ప్యాట్టీస్, పోర్క్ పచ్చడి, బ్యాంబూ పోర్క్ల రూపంలో సీమ పంది ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. వీటిలో మాంసకృత్తులు, విటమిన్లతో పాటు ఓలిక్ లినోలిక్ ఫాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి సీమ పంది మాంసం ఉత్పత్తులు ఉపయోగపడతాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. పందుల పెంపకాన్ని లాభదాయకం చేయడంతో పాటు కొత్త పంది రకాల అభివృద్ధికి తిరుపతిలోని పరిశోధనా కేంద్రం గడిచిన ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. స్థానికంగా లభ్యమయ్యే వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులను 10–15 శాతం వరకు పందుల దాణా తయారీకి వినియోగించి ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పందులకు సంక్రమించే మేంజ్ అనే చర్మ వ్యాధికి డోరోమెక్టిన్ అనే ఔషధాన్ని కనిపెట్టారు. 20 శాతం మంది పోర్క్ తింటున్నారు దేశంలో 9 లక్షల మిలియన్ల పందులుంటే, ఆంధ్రప్రదేశ్‌లో 92 వేలున్నాయి. దేశంలో 22 శాతం మంది, రాష్ట్రంలో 11 శాతం మంది పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మాంసాహారుల్లో పంది మాంసం తినే వారి సంఖ్య 18–20 శాతం ఉన్నారని అంచనా. ఏటా రూ.18 కోట్ల విలువైన 894 టన్నుల పంది మాంసం ఉత్పత్తులు మన దేశం నుంచి వియత్నాం, కాంగో, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఒక పంది... 80 పిల్లలు... ఐదేళ్ల క్రితం విదేశీ జాతి పందులతో దేశవాళీ పందులను సంకరపరిచి ఎస్వీవీయూ టీ–17 (75 శాతం లార్జ్‌వైట్ యార్క్‌షైరు, 25 శాతం దేశవాళీ పంది) అనే కొత్త పంది జాతిని అభివృద్ధి చేశారు. వాడుకలో సీమ పందిగా పిలిచే వీటి పెంపకంపై రైతులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. జీవిత కాలంలో ఈతకు 8 చొప్పున 10 ఈతల్లో 80 పిల్లలను పెడుతుంది. పుట్టినప్పుడు 1.12 కేజీలుండే ఈ పంది పిల్ల వధించే సమయానికి 85 కేజీల వరకు బరువు పెరుగుతుంది. పది ఆడ, ఒక మగ పందిని కలిపి ఒక యూనిట్‌గా వ్యవహరిస్తారు. కేంద్రం నుంచి అభివృద్ధి చేసిన పందులకు సంబంధించి 400 యూనిట్లను రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఏపీలో రైతుల దగ్గర 20 వేల పైగా ఈ రకం పందులు పెరుగుతున్నాయి. ఒక యూనిట్ దేశవాళీ పందుల పెంపకం ద్వారా సగటున ఏటా రూ. 3–3.5 లక్షల ఆదాయం వస్తుంటే, ఈ రకం సీమ పందుల పెంపకం ద్వారా రూ. 6–7 లక్షల ఆదాయం వస్తుంది. మాంసం రూపంలో అమ్మితే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి నెలకు రూ. లక్షకు పైగా నికరాదాయం నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. రెండేళ్లుగా పశుపోషణ చేస్తున్నా. గతేడాది తిరుపతి పందుల పరిశోధనా కేంద్రం నుంచి 15 పిల్లలతో పాటు 5 పెద్ద పందులను కొని పెంపకం చేపట్టా. హాస్టళ్లు, హోటళ్ల నుంచి సేకరించే పదార్థాలను పందులకు మేపుతున్నాం. చూడి/పాలిచ్చే పందులకు విడిగా దాణా పెడతున్నా. నెలకు రూ. 49,400 ఖర్చవుతోంది. మాంసం ద్వారా రూ.1.40 లక్షలు, పంది పిల్లల అమ్మకం ద్వారా రూ.13,500 ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను నెలకు రూ.లక్షకు పైగా నికరాదాయం వస్తోంది. పందుల పెంపకం లాభదాయకంగా ఉంది. – సుంకర రామకృష్ణ, నూజివీడు, ఎన్టీఆర్ జిల్లా మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తే... నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. పందుల పెంపకంపై ఆసక్తితో తిరుపతి పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందాను. ఈ పరిశ్రమ ఎంతో లాభసాటిగా ఉందని గ్రహించాను. త్వరలో పందుల పెంపకం యూనిట్ పెడుతున్నా. మార్కెటింగ్‌పై మరింత అవగాహన కల్పిస్తే యువత ఆసక్తి కనపరుస్తారు. –జి.మహేష్, గాజులమండ్యం, తిరుపతి జిల్లా పొరుగు రాష్ట్రాల రైతుల ఆసక్తి శాస్త్రీయ పద్ధతుల్లో సీమ పందుల పెంపకంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాం. ఎస్వీవీయూ టీ–17 జాతి పందులకు మంచి డిమాండ్ ఉంది. పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పెంపకంలో మెళకువలతో పాటు వీటికి సంక్రమించే వ్యాధులను గుర్తించి తగిన చికిత్స, నివారణా చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంది మాంసం ఉత్పత్తుల్లో ఉండే పోషక విలువలపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ కే.సర్జన్‌రావు (99890 51549), పరిశోధనా సంచాలకులు, ఎస్వీవీయూ, తిరుపతి రైతులకు నిరంతర శిక్షణ తిరుపతిలో పందుల పరిశోధనా కేంద్రం ఏర్పాటై 50 ఏళ్లవుతోంది. తాజాగా విడుదల చేసిన ఎస్వీవీయూ టీ–17 రకం పంది జాతికి మంచి డిమాండ్ ఉంది. దేశవాళీ పందులతో పోల్చుకుంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. వీటి పెంపకంపై ఆసక్తి గల యువతకు, రైతులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తున్నాం. –డాక్టర్ ఎం.కళ్యాణ్ చక్రవర్తి (94405 28060), సీనియర్ శాస్త్రవేత్త, అఖిల భారత పందుల పరిశోధనా కేంద్రం, తిరుపతి -
ఇదీ ఆకాశహర్మ్యమే..కానీ మనుషుల కోసం కాదు..
పైన చెప్పుకున్నట్లు ఇదీ ఆకాశహర్మ్యమే.. ఉన్నది కూడా చైనాలోనే.. అయితే.. మన కోసం కాదు.. స్టార్ హోటల్‌ను తలపిస్తున్న ఈ 26 అంతస్తుల భవనాన్ని పందుల కోసం నిర్మిస్తున్నారు. షాక్ అవ్వాల్సిన పని లేదు. నిజమే.. పందుల పెంపకం కోసం ఇంత పెద్ద భవనం నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారి. చైనాలో ప్రధాన ఆహారమైన పోర్క్ ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలాంటి భవనాల్లో పందులను పెంచుతున్నారు. ఆఫ్రికాలో స్వైన్‌ఫ్లూ తరువాత.. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టిపెట్టిన చైనా, ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో ఫార్మింగ్‌కు అనుమతించింది. మొదట రెండు మూడు అంతస్తులతో మొదలైన ఈ ఫార్మింగ్ ఇప్పుడిలా 26 అంతస్తులకు చేరింది. అక్కడి పందులకు యంత్రాలే ఆహారాన్ని సరఫరాచేస్తాయి. గాలి శుద్ధీకరణ, ఇన్ఫెక్షన్స్ సోకకుండా పద్ధతులు, పందుల వ్యర్థాలతో బయోగ్యాస్ ప్లాంట్, దాన్నుంచే విద్యుత్ ఉత్పత్తి ఇలా అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం ప్రారంభమైతే నెలకు 54వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నులు పోర్క్ ఉత్పత్తి చేయనుంది. గతంలో యూరప్‌లోనూ ఇలాంటి నిర్మాణాలున్నా.. వివిధ కారణాలతో చాలా మూతపడ్డాయి. ఉన్న ఒకటి అరా మూడంతస్తులకు మించలేదు. చదవండి: మీ కోసం తెచ్చిన కేక్ పక్కోడు కట్ చేస్తే?.. అచ్చం ఇలాగే ఉంటుంది కదూ! -
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం
తిరువనంతపురం: కేరళలో వాయనాడ్ జిల్లాలోని మనంతవాడిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి సంబంధించిన రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ రెండు పందుల నుంచి తీసకున్న శాంపిల్స్ పరీక్షించగా ఈ వ్యాధి గుర్తించనట్లు తెలిపారు. పశుసంవర్థక శాఖకు చెందిన అధికారి ఒక పొలంలో పందులు ముకుమ్మడిగా చనిపోవడంతో...పందుల నుంచి సేకరించిన కొన్ని శాంపిల్స్‌ని పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. దీంతో ఆయా జిల్లాలోని దాదాపు 300 పందులను చంపేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. బీహార్‌తోపాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి సంబంధించిన కేసులు నమోదవ్వడంతో కేంద్ర జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై ఈ కఠిన చర్యలను అవలంభించారు. ఈ ఆఫ్రికన్ ఫీవర్ అనేది పెంపుడు పందులను ప్రభావితం చేసే ప్రాణాంతక అంటు వ్యాధి. (చదవండి: ఇండిగో రచ్చ: కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోర్టు షాక్) -
పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి
రాయచోటి: కోడి పుంజులకు కత్తులు కట్టి బరిలో వదలడం చూశాం. అలాగే పొట్టేళ్లు, మేక పోతులు ఢీకొనడమూ చూశాం.. అయితే ఇపుడు కొత్తగా పందుల పోటీ కూడా ఈ జాబితాలో చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సమీపం లోని దిగువ అబ్బవరంలో గురువారం పందుల పోటీ నిర్వహించారు. పొట్టేళ్ల మాదిరిగానే వీటిని రెచ్చగొట్టి వదిలారు. అవి ఒకదానిని ఒకటి బలంగా ఢీకొనడం, నోటితో కరవడం. కాళ్లతో రక్కడం.. ఇలా తమ శక్తిమేరకు పోరాడాయి. చివరకు కొన్ని పందులు పోటీ పడలేక పారిపోయాయి. విజేతలయిన వరాహాలకు రూ.2లక్షల బహుమతి ప్రకటించారు. ఈ పోటీలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఉత్సుకత ప్రదర్శించారు. -
చెత్తా చెదారం.. ఎలుకల సంచారం
వరంగల్‌లో పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక రోగిని ఇటీవల ఎలుకలు దారుణంగా కొరికి గాయపరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు ఐదేళ్ల క్రితం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచిన యువతి శవాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన ఘటన కూడా అప్పట్లో కలకలం రేపింది. మెదక్ ఆస్పత్రి మార్చురీలో కూడా మూడేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పందికొక్కులు పీక్కుతిన్నాయి. తాజాగా వరంగల్ ఘటనలో రోగి (కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇతను తర్వాత హైదరాబాద్ నిమ్స్‌లో చనిపోయాడు) కాళ్ల నుంచి రక్తస్రావం అయ్యేలా ఎలుకలు కొరికేయడం.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి, నిర్వహణపై చర్చకు తెరతీసింది. ఐసీయూలోనే ఇలా ఉంటే సాధారణ వార్డులు, గదులు ఎలా ఉంటాయోనన్న సందేహాలకు తావిచ్చింది. దీంతో ‘సాక్షి’.. రాజధాని హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రులతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోని సర్కారు దవాఖానాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించింది. సాక్షి, నెట్వర్క్/గాంధీ ఆస్పత్రి/నాంపల్లి /అఫ్జల్‌గంజ్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ కొరవడింది. అపరి శుభ్ర వాతావరణం రాజ్య మేలుతోంది. ఎటు చూసినా చెత్తాచెదా రం, ప్లాస్టిక్ కవర్లు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ అపరిశుభ్ర వాతావరణం ఎలుక లు, పంది కొక్కులు ఆస్పత్రులను తమ ఆవాసాలు గా చేసుకునేందుకు దోహదపడుతోంది. మరోవైపు రోగులు, వారి సహాయకులు.. తినగా మిగిలిన ఆహారాన్ని, ఇతర తినుబండారాలను పడవేస్తున్నారు. ఈ ఆహార వ్యర్థాల కోసం ఎలుకలు, పంది కొక్కులు ఆసుపత్రుల ఆవరణలో, వార్డుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆస్పత్రి ఆవరణను, వార్డులను శుభ్రంగా ఉంచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కుక్కలు, కోతులు, పాములు కూడా తిరుగుతున్నట్లు రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దుస్థితి. పాత ఐసీయూ వెనుక భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. పందులు, ఎలుకలకు ఆవాసంగా మారింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ నిలోఫర్ నగరంలోని ప్రముఖ నవజాత శిశువుల సంరక్షణా కేంద్రమైన నిలోఫర్ ఆసుపత్రి అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయింది. పాత, కొత్త, లోపల, బయట అనే తేడా లేకుండా ఆసుపత్రిలోని అన్నిచోట్లా అపరిశుభ్రత నెలకొంది. రోగులు, సహాయకులు పడేసే ఆహారం కోసం చుట్టుపక్కల ఉన్న బస్తీల నుంచి ఎలుకలు ఆసుపత్రి వైపు వస్తున్నాయి. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌లో ఉంటూ రాత్రివేళ ఆస్పత్రిలో సంచరిస్తున్నాయి. గాంధీ సెల్లార్లో ఫుల్లు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెల్లార్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అక్కడ మురుగునీరు చేరుతోంది. ప్రధాన భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గైనకాల జీ, లేబర్‌వార్డు, పీడియాట్రిక్, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ తదితర వార్డుల్లో ఎలుకల సంచా రం తరచూ కనిపిస్తోందని పలువురు రోగులు తెలిపారు. 2015లో నవజాత శిశువులకు వైద్యం అందించే ఎస్ఎన్సీయూ వార్డులో ఎలుకలు కనిపించడంతో అప్పట్లో చర్యలు చేపట్టారు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఘటనతో అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి అధికార యంత్రా ంగం ఎలుకల నివారణకు గుళి కల ప్రయోగం చేపట్టడంతో పాటు పలు వార్డుల్లో బోన్లు, ర్యాట్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. పందికొక్కులకు ‘చిరునామా’ జనగామ జిల్లా వందపడకల ఆస్పత్రి ఆవరణలో డ్రెయినేజీలను తోడేస్తున్నాయి. జనరేటర్ ఏర్పాటు చేసిన గది ఆవరణ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ముందు భాగం, జనరల్ వార్డు వెనకాల పెద్ద పెద్ద కన్నాలు ఏర్పడ్డాయి. ఎలుకల కోసం పాములు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం ముందు భాగాన్ని ఇటీవల అం దంగా తీర్చిదిద్దారు. కానీ లోపల వార్డులు, ఆసుపత్రి పరిసరాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. వెనుక భాగం చెత్తాచెదారం, చెట్ల పొదలతో నిండిపోయింది. గత ఏడాది డిసెంబర్ 21న రాత్రి సమయంలో పేషెంట్ కేర్‌టేకర్‌గా పనిచేసే వేముల సంపత్‌ను ఆసుపత్రి ప్రాంగణంలోనే పాము కాటేసింది. అంతకుముందు కూడా ఆసుపత్రిలో పనిచేసే మరొకరిని పాము కాటు వేసింది. వార్డుల్లో ఎలుకలు తిరుగుతుండడంతో వాటి కోసం పాములు వస్తున్నాయని చెబుతున్నారు. పాత భవనం కావడంతో వార్డుల్లో గోడలకు కన్నాలు ఉండడం, అం దులో ఎలుకలు, బొద్దింకలు చేరడంతో వాటి కోసం పాములు వస్తున్నాయి. వంద పడకల యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణ చుట్టూ పందికొక్కులు రంధ్రాలు చేశాయి. పగలు, రాత్రి తేడాలేకుండా సంచరిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆస్పత్రి మార్చురీలో 4 ఫ్రీజర్ బాక్స్‌లు ఉండగా అవి పనిచేయడం లేదు. దీంతో రెండు శవాలను కిందపడేశారు. వాటి ని పురుగులు, దోమలు, ఈగలు పీక్కు తింటుండటంతో గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. కాగా శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ‘సాక్షి’కి తెలిపారు. ఉస్మానియాలో కుక్కల వీరంగం పేదల పెద్దాసుపత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియాలో కుక్కలు, కోతులు, పిల్లుల బెడద ఎక్కువగా ఉంది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్కలు వీరంగం సృష్టిస్తుంటే, కోతులు రోగులు వారి సహాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆసుపత్రి నుండి రోగి కోలుకొని తిరిగి వెళ్లే సమయంలో కొబ్బరికాయలు కొడుతుండడంతో వాటి కోసం కోతులు ఎగబడుతున్నాయి. 2017లో ఆత్మహత్యకు పాల్పడిన అఫ్జల్‌సాగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు.. ముక్కు, పెదవుల్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన స్థితిలో ఉన్న యువతి శవాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. -
పందుల దొంగల ముఠా.. బొలేరోతో ఢీకొట్టి.. ఎంత పనిచేశారంటే..
ఆదోని రూరల్(కర్నూలు జిల్లా): ఆదోని పట్టణంలో పందులు, గొర్రెలను అపహరించేందుకు వచ్చిన కర్ణాటక గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. వారి వాహనాన్ని అడ్డగించేందుకు యత్నించిన యువకుడిని ఢీకొట్టి చంపేశారు. ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకు చెందిన కేఏ25 ఏఏ 4030 నంబర్ బొలేరో ట్రక్కు వాహనంలో టీజీఎల్ కాలనీ, బొబ్బలమ్మ గుడి ఏరియా ప్రాంతాల్లో పందులను అపహరించేందుకు ఓ దొంగల ముఠా చేరుకుంది. చదవండి: భర్త అదృశ్యం.. ఇంట్లో రక్తపు మరకలు.. భార్య వివాహేతర సంబంధమే కారణమా..? పందుల యజమానులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టణ శివారులోని శిరుగుప్పక్రాస్ రోడ్డు వద్ద వారి వాహనానికి టీజీఎల్ కాలనీకి చెందిన సురేష్(19) తన బైక్‌ను అడ్డుగా పెట్టి పక్కనే నిలిచాడు. దొంగలు వాహనాన్ని ఆపకుండా వేగంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో దొంగలకు చెందిన బొలేరో వాహనం బోల్తా పడటంతో.. వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఇస్వీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. కర్ణాటకకు చెందిన పందుల దొంగల ముఠా ఇటీవల ఆదోని మండలంలో మదిరె, హాన్వాల్, పెద్దతుంబళం, కోసిగి తదితర ప్రాంతాల్లో పట్టపగలు ఇళ్లలో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేగాకుండా ఆరు నెలల క్రితం గూడూరు వద్ద పందులను అపహరించి తరలిస్తున్న ముఠాపై స్థానికులు వెంబడించగా, మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామ సమీపంలో వాహనం టైరు పేలడంతో వాహనాన్ని వదిలి పరారయారు. పందుల దొంగలను అరెస్ట్ చేసి శిక్షించాలని పందుల యజమానులు కోరుతున్నారు. -
పందులను చూస్తూ తినాలా?.. గొంతులో ముద్ద దిగట్లేదు..!
సాక్షి,కోస్గి(మహబూబ్‌నగర్): మున్సిపల్ కేంద్రమైన కోస్గిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదుల సంఖ్యలో పందుల సంచారం మధ్యనే భోజనాలు వడ్డిస్తున్నారు. ఇది ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త... ఉపాధ్యాయులు చదువుతోపాటు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ చేసే ప్రకటనకు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇదే పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న అంజలీదేవి మండల విద్యాధికారిగా కొనసాగుతున్నారు. అయినా పందుల బెడద తప్పకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో ఘటనలో.. అందరికీ సాయం మక్తల్: రాష్ట్రంలో అన్నిమతాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ పండుగా సందర్బంగా పేదలకు ప్రభుత్వం నుంచి ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. పండుగను సోదరభావంతో జరుపుకోవాలని కేక్ కట్ చేశారు. కార్యక్రమంల్లో తహసీల్దార్ మదర్‌ఆలీ, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ వనజదత్తు, మార్కెట్ చైర్మన్ రాజేశ్‌గౌడ్, వైస్ చైర్మన్ అనిల్‌గాయిత్రి, ఆర్ఐ శ్రీశైలం, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఈశ్వ ర్, నేతాజీరెడ్డి, రాంలింగం, శేఖర్‌రెడ్డి, శంషోద్ది న్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకుని లైంగిక దాడి.. పదేళ్లు శిక్ష.. -
కోడి, గుర్రపు పందేలు తెలుసు కానీ.. ఈ పందుల పోటీలు ఏంట్రా?!
సాక్షి, మహబూబ్‌నగర్: మనకు కోడి పందేలు, ఎడ్లబండ్ల పోటీల గురించి తెలుసు. కానీ.. పందుల పోటీల గురించి ఎప్పుడైనా విన్నారా? చూశారా? అయితే ఇదిగో చూడండి మరి. నారాయణపేట జిల్లా మక్తల్ పరిధిలోని కాట్రపల్లి రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం పందుల పోటీలు నిర్వహించారు. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్ నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, కర్ణాటకలోని రాయచూర్ తదితర ప్రాంతాల నుంచి పలువురు వరాహాలతో వచ్చి పోటీల్లో పాల్గొన్నారు. రెండేసి వరాహాల మధ్య పోటీ నిర్వహించి గెలుపొందిన వరాహం యజమానికి నిర్వాహకులు రూ.లక్ష అందజేసినట్లు సమాచారం. పోటీల్లో పాల్గొన్న ఒక్కో పంది విలువ రూ.15 వేలనుంచి రూ.45 వేల ఉంటుం దని అంచనా. ఈ పోటీలను చూసేందుకు మక్తల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కోడి పందేలపై ఆంక్షలు ఉండడంతో రెండు, మూడేళ్లుగా పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో గద్వాల జిల్లా అయిజలో తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 1960 నుంచి ఏటా పందుల పోటీలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. చదవండి: హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలు.. ఒకరి ఆచూకీ లభ్యం -
ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?
పెదగంట్యాడ(గాజువాక): కోడి పందాలు చూశాం.. పొట్టేళ్ల పందాలు చూశాం. కానీ పందుల పోటీలు ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా.? ఇప్పుడు పందుల పోటీలకు వుడా కాలనీ వేదికైంది. మండలంలోని కొత్తకర్ణవానిపాలెం వుడా కాలనీలో వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బహిరంగంగా పెంపకందారులు గురువారం పందుల పందాలు నిర్వహించారు. రెండు పందుల మధ్య పోటీ పెట్టి వారంతా చుట్టూ చేరి కేరింతలు కొట్టారు. దీంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఒక పక్క జీవీఎంసీ అధికారులు పందులను ఏరివేస్తుంటే మరోపక్క పెంపకందారులు ఈ పోటీలను నిర్వహించి ఆశ్చర్యానికి గురి చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇవీ చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. యువతికి వేరొకరితో నిశ్చితార్థం.. వాట్సాప్‌లో అశ్లీల ఫొటో -
వాటి కథ ముగిసిందనుకున్నారు..కానీ..
దీస్పూర్ : పిగ్మీ హాగ్స్.. పెద్దగా పరిచయం లేని జంతువు పేరిది. 22 పౌండ్ల బరువుతో.. పరిమాణంలో 8-10 అంగుళాల పొడవుండే ఇవి పంది జాతికి చెందిన జీవులు. అందుకే వీటిని అత్యంత చిన్న పందులుగా పరిగణిస్తారు. నలుపు, గోధుమ రంగులు కలిసి ఉంటాయి. హిమాలయాల్లోని బురద పచ్చిక బయళ్లు వీటి జన్మస్థలం. 1857లో మొట్టమొదటి సారిగా వీటి ఉనికిని గుర్తించారు. ఆ తర్వాతి నుంచి వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఒకానొక దశలో అవి అంతరించిపోయాయనుకున్నారు. అయితే, 1970లో మరోసారి కనిపించాయి. వాటి సంఖ్యను పెంచటానికి 1990లో వన్యప్రాణి సంరక్షకులు బ్రీడింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం అస్సాంలో వీటి సంఖ్య బాగా పెరిగింది. అక్కడి అడవుల్లో 300-400 వరకు ఉన్నాయి. దీనిపై పిగ్మీ హాగ్ కన్సర్వేషన్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరక్టర్ పరాగ్ దెకా మాట్లాడుతూ..‘‘ రానున్న ఐదేళ్లలో మానస్ ప్రాంతంలో ఓ 60 పందుల్ని విడుదల చేయాలని భావిస్తున్నాము. అంతరించిపోతున్న ఈ జీవుల్ని రక్షించటం చాలా ముఖ్యం. మనమందరం మన జీవితాలకు అర్థం వెతుక్కోవాలి.. నా జీవితానికి ఓ అర్థం ఈ ప్రాజెక్టు’’ అని అన్నారు. -
వామ్మో మరో కొత్త రకం వ్యాధి.. ఈ సారి పందులపై..
ఐజ్వాల్: ఓ పక్క కరోనా మహమ్మారి వీర విహారం చేస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో మరో వ్యాధి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రూపంలో ఈశాన్య రాష్ట్రం మిజోరంను అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా మిజోరంలో పందులు వేల సంఖ్యల్లో మరణిస్తున్నాయి. గత మార్చి 21న ఈ వ్యాధి వల్ల తొలి మరణం నమోదు అయ్యింది. కాగా ఇప్పటి వరకు మొత్తం 1700 పైగా పందులు మృతిచెందినట్లు సమాచారం. ఈ వ్యాధి కరోనా లానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఇది మిజోరంలోని పలు ప్రాంతాలని భయపెడుతోంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా మిజోరంలో గత నెల రోజులకుపైగా వేల సంఖ్యలో పందుల మరణించాయి. దీని వల్ల రూ.6.91 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక, పశువైద్య విభాగం సంయుక్త డైరెక్టర్ డాక్టర్ లాల్మింగ్‌థంగా మాట్లాడుతూ.. భయంకరమైన ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు మరింత వ్యాప్తి చెందుతోంది, అయితే కేంద్రంలో రోజువారీ మరణాల సంఖ్య కొన్ని వారాలుగా తగ్గుతున్న ధోరణిని చూపించింది. చనిపోయిన పందుల నమూనాలను ఇప్పటికే పరీక్షల కోసం సేకరించాము. ఈ మరణాలకు గల కారణం స్పష్టంగా తెలియాల్సి ఉంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి దిగుమతి చేసుకున్న పందుల వల్ల ఏఎస్ఎఫ్ సంక్రమణ మూలాలు సంభవిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ( చదవండి: వైరల్: రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తించారు ) -
మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు
మెక్సికన్ సిటి: మనిషి.. మనిషిని తినడం అనేది చాలా అసాధారణ విషయం. ఇలాంటి వాటి గురించి చాలా అరుదుగా వింటాం. అయితే మనిషి జంతువుల్ని వదిలేసి.. మానవుడిని తిన్న ఘటన గురించి ఇంత వరకు ఎప్పుడు వినలేదు. తాజాగా ఇలాంటి భయానక విషాయన్ని మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. 1500 ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో ఓ స్పానిష్ విజేత.. తన సైన్యంతో కలిసి.. బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లల్ని దారుణంగా చంపి.. వారిని తిన్నాడని నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరు మనుషుల్ని తిని.. పందుల్ని వదిలేశారు. టెకోయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక సంఘటన గురించి తెలిసింది. ‘వారు.. వారిని తిన్న స్థలం ఇదే’ అని అజ్టెక్ నాహుఔట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది. (చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) 1520 లో టెకోయిక్ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనను ‘జుల్టెపెక్’ అని కూడా పిలుస్తారు. ఇలా బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 45 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని నివేదిక వెల్లడించింది. ఇక వీరిని బంధించిన విషయం గురించి విజేత హెర్నాన్ కోర్టెస్‌కు సమాచారం ఇవ్వగా.. అతడు వారిని చంపి.. పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. దాంతో అతడి సైన్యం నెలల వ్యవధిలో వీరందరిని చంపి.. 1521 ప్రారంభంలో పట్టణాన్ని నాశనం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎన్రిక్ మార్టినెజ్ వర్గాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుంది. ఇక ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన వారి ఎముకలను, ఇతర సాక్ష్యాలను నిస్సార బావుల్లోకి విసిరినట్లు త్రవ్వకాలు వెల్లడించాయి. ఇక ఇక్కడ ప్రజలు దాడిని ఆపడానికి ప్రయత్నించారు.. కానీ విఫలమయినట్లు తెలుస్తోంది’’ అన్నారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) ఆయన మాట్లాడుతూ.. "పట్టణంలో బస చేసిన కొంతమంది యోధులు పారిపోగలిగారు. కాని మహిళలు, పిల్లలు ఇక్కడే ఉన్నారు. దాంతో వారే ప్రధాన బాధితులు అయ్యారు. ఇక తవ్వకాల్లో చిన్న పిల్లల ఎముకలు యుక్త వయసు ఆడవారితో పాటు పడి ఉన్నట్లు గుర్తించాము. ఇక ఖననం చేసిన స్థలాన్ని పరిశీలిస్తే.. ఈ ప్రజలు పారిపోతున్నారని, వారిని దొరకపుచ్చుకుని ఊచకోత కోసినట్లు.. తొందరపాటులో ఖననం చేశారని తెలుస్తుంది" అన్నారు. అంతేకాక ‘‘అనేక దేవాలయాలు కాలిపోయాయి.. విగ్రహాలు తలలు ఖండించారు. పట్టుబడిన కొంతమంది మహిళల తలలు, పుర్రె రాక్‌లో వేలాడదీశారు. మరోక మహిళ గర్భవతి అని తెలిసింది. ఇలా బంధించిన ప్రజలను ఖైదీలుగా ఉంచి.. ఆరు నెలలకు పైగా ఆహారం ఇచ్చారు. ఆ తర్వాత గుర్రాలు, పురుషులు, స్త్రీలను చంపి.. తిన్నారు. అయితే స్పానిష్ ప్రజలు తమతో పాటు ఆహారం కోసం పందులను తీసుకువచ్చారు. కానీ వాటిని తినలేదని తవ్వకాల ద్వారా తెలిసింది’’ అన్నారు. -
అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విజృంభణ
గువహటి: దేశంలోఒకవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండగానే ప్రాణాంతక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) అసోంను వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ వ్యాధి విజృంభణను అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని 12 వేల పందులను చంపేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం బుధవారం (నిన్న) ఆదేశించారు. అంతేకాదు వాటి యజమానులకు తగిన విధంగా పరిహారం చెల్లించాలని అధికారులను కోరారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరాను నిలిపివేశారు. పశుసంవర్ధక, పశువైద్య శాఖ సీనియర్ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఇప్పటివరకు 14 జిల్లాల్లో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిపుణుల అభిప్రాయం మేరకు బాధిత జిల్లాల్లో వరాహాలను వధించాలనే నిర్ణయం తీసుకున్నారు. దసరా ఉత్సవాలకు ముందే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగు త్వరితగతిన శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పశుసంవర్ధక, పశువైద్య విభాగాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఫాంలలో సర్వే నిర్వహించాలని, ఆరోగ్యకరమైన జంతువులకు ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు సీఎం అదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో14 జిల్లాల్లోని 30 బాధిత కేంద్రాల్లో కిలోమీటర్ పరిధిలో వరాహాలను సంహరించేందుకు నిర్ణయించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. అలాగే సంబంధిత పరిహారాన్నిఆయా యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత నిధిని కేంద్రం విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా 2019 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో వీటి సంఖ్య 21 లక్షలుగా ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య సుమారు 30 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ వ్యాధి వ్యాపించింది. 2019 ఏప్రిల్‌లో చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో (అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు) ఏఎస్ఎఫ్ ను గుర్తించగా, 1921లో కెన్యా, ఇథియోపియాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉనికి తొలిసారి బైట పడింది. -
అడవి పందులను చంపాలి.. తినాలి
సాక్షి, జనగామ: గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపడంతో పాటు తినే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్ చేశారు. జనగామలో శనివారం ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను తెలంగాణలో కూడా అమలు చేయాలన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలను సాగు చేస్తున్న రైతులు.. అడవి పందులతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. -
చేపను కాపాడటం కోసం పందుల తాపత్రయం
-
చేపను కాపాడటం కోసం పందుల తాపత్రయం
న్యూఢిల్లీ: సాటి మనిషికి సాయం చేయాలంటే రెండు అడుగులు వెనకేస్తున్న రోజులివి. కాలం మారేకొద్దీ మనుషులు వారి స్వార్థాలకునుగుణంగా మారిపోతున్నారే తప్ప మూగ జీవాలు కావు. సహాయం, విశ్వాసం, ప్రేమ అనే పదాన్నే మర్చిపోతున్న యాంత్రిక మనిషికి ఎన్నో సందర్భాల్లో ఈ జంతువులు మనుషుల బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పందుల గుంపు నేలపై పడి ఉన్న చేప దగ్గర నిల్చుని ఉన్నాయి. ఆ చేపలో చలనం లేకపోవడంతో దాన్ని సమీపంలోని నీటిలోకి తీసుకెళ్లి బతికించే ప్రయత్నం చేశాయి. పదకొండు సెకండ్లు ఉన్న ఈ వీడియో క్లిప్‌ను అటవీశాఖ అధికారి సుశాంత్ నందా షేర్ చేశారు. 'చిన్న ప్రయత్నమే కానీ దాని వెనక పెద్ద ఉద్దేశమే ఉంది' అంటూ క్యాప్షన్ జోడించారు. (భర్త లేడు: కొడుకును పెళ్లాడిన తల్లి?) ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ "ఆ చేప బతికి ఉందా, చనిపోయిందా అనేది ముఖ్యం కాదు. పందుల చర్య వెనక ఉన్న ఉద్దేశం గొప్పది. అదే మనుషులైతే చావు బతుకుల మధ్య ఎవరైనా కొట్టుమిట్టాడుతున్నా దగ్గరకు కూడా వెళ్లరు" అని ఓ నెటిజన్ నగ్నసత్యాన్ని చెప్పుకొచ్చాడు. "గొప్ప పని. ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా జీవితంలో ఏదైనా మంచి పని చేయాలనిపిస్తోంది", "మనుషులకన్నా జంతువులే నయం. జీవితం విలువేంటో వాటికే బాగా తెలుసు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అతి కొద్ది మంది మాత్రం ఆ పందులు చేపను తినాలనుకుంటే నీళ్లలో పడిపోయిందని చెప్పుకొచ్చారు. కానీ ఈ వ్యాఖ్యలతో ఇతర నెటిజన్లు విబేధించారు. (పాము ముంగిసల ఫైట్ వీడియో వైరల్!) -
కోవిడ్-19 కేంద్రంలో పందుల విహారం
బెంగళూర్ : కోవిడ్-19 ఆస్పత్రుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కర్ణాటకలోని ఓ కోవిడ్-19 ఆస్పత్రిలో పందులు స్వేచ్ఛగా తిరుగుతున్నా అక్కడున్న సిబ్బంది పట్టించుకోకుండా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కలబురగిలోని కోవిడ్ ఆస్పత్రిలో ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి బుధవారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పటినుంచి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ కర్గే స్పందిస్తూ ఆస్పత్రుల నిర్వహణ సవ్యంగా లేకపోవడంతో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఆస్పత్రిలో పందుల విహారంపై వీడియో వైరల్ కావడంతో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కాగా దేశంలో తొలి కోవిడ్-19 మరణం కలబురగిలో చోటుచేసుకోవడం గమనార్హం. కరోనా కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో ఈ వ్యాధి నుంచి దేవుడే మనల్ని కాపాడాలని మంత్రి శ్రీరాములు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.. మనమంతా జాగ్రత్తగా ఉండాలి..మీరు పాలక పార్టీ సభ్యులైనా..విపక్ష సభ్యులైనా..సంపన్నులైనా..పేదలైనా..ఈ వైరస్‌కు ఎలాంటి వివక్ష ఉండద’ని శ్రీరాములు ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. శ్రీరాములు వ్యాఖ్యలపై విపక్ష కాంగ్రెస్ మండిపడింది. కోవిడ్-19ను ఎదుర్కోవడంలో యడ్యూరప్ప సర్కార్ సామర్ధ్యానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇక గతంలో గుల్బర్గాగా పేరొందిన కలబురగిలో ఇప్పటివరకూ 2674 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చదవండి : ఊరట : తగ్గిన మరణాల రేటు -
చైనాలో పందుల కొరత.. రష్యా విమానాలకు గిరాకీ
మాస్కో : కరోనా మహమ్మారితో విమానయాన రంగం కుదైలైంది. అయితే చైనాలో ఏర్పడిన పందుల కొరతతో రష్యాకు చెందిన విమానయాన సంస్థకు మంచి గీరాకీ వస్తోంది. ఓల్గా-డీఎన్‌ఈపీఆర్‌కు చెందిన వాణిజ్య విమానాల్లో ఈ ఏడాది ఫ్రాన్స్ నుంచి చైనాకు దాదాపు 3000 పందులు సరఫరా చేశారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టించడంతో చైనాలో పందుల కొరత విపరీతంగా పెరిగింది. దీంతో 10380 కిలోమీటర్ల దూరం నుంచి చెక్క డబ్బాల్లో ఉంచిన పందులను బోయింగ్ 747 కార్గో విమానాల్లో సరఫరా చేస్తున్నారు. (22 వేల మందిని తొలగించనున్న లుఫ్తాన్సా) అమెరికా నుండి ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనా మొత్తం 254,533 టన్నుల పంది మాంసాన్ని దిగుమతి చేసుకుంది. దీంతో యూరప్‌ను అధిగమించి చైనా అతిపెద్ద పంది మాంసం సరఫరాదారుగా అవతరించింది. ఇది ఇప్పటికే 2019 ఏడాది మొత్తానికి చైనా కొనుగోలు చేసిన 245,000 టన్నుల కంటే ఎక్కువ. ఇక పందుల సరఫరాకు వాడిన ఓల్గా-డీఎన్ఈపీఆర్ విమానయాన అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 32% పెరిగి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 630 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఎన్నడూ లేనన్ని సవాళ్లను ప్రపంచ విమానయానరంగం ఎదుర్కొంటుంది. కానీ కార్గో క్యారియర్లకు ఇదొక సువర్ణ అవకాశం అని ఓల్గా-డీఎన్ఈపీఆర్ గ్రూప్ ప్రెసిడెంట్ ఇసైకిన్ అన్నారు. ‘ఇంతకుముందు, అన్ని ప్రయాణికుల విమానాల్లో సగానికి పైగా కంపార్ట్మెంట్లలో సమానులు తీసుకువెళ్లేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సరఫరా తగ్గడంతో, కార్గో విమానయాన సంస్థలకు డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. కొన్ని ఆదాయ మార్గాలు తగ్గిపోతున్నప్పటికీ మొత్తం అమ్మకాలు పెరిగాయి. అలాగే సరఫరా విషయంలో భౌగోళికంగా మా సంస్థ పరిధి విస్తరిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి తరువాత, మేము చైనా వైద్య పరికరాలను ఆఫ్రికాకు పంపించడం ప్రారంభించాము. లాటిన్ అమెరికా నుండి కూడా మా సేవల కోసం విచారిస్తున్నారు. తదుపరి స్థానంలో భారత్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని ఇసైకిన్ పేర్కొన్నారు. -
అస్సాంలో ఆఫ్రికన్ ఫ్లూ కలకలం
గువహటి : భారత్‌లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టిస్తోంది. ఫిబ్రవరిలో అస్సాంలో తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదైంది. ప్రస్తుతం అది తీవ్రరూపం దాల్చి 15,600 పందులు మరణించాయని ఆ రాష్ర్ట పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. వ్యాధి నివారణకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అతుల్ అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని నిర్ణయించింది. (ఒకపక్క కరోనా, మరోపక్క వరదలు ) ఇక వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే 15,600 పందులు చనిపోయాయని, వీటి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. పంది పెంపకం దారులకు ఉపశమనం కలిగించే దిశగా పంది మాంసం అమ్మకం, వినియోగం విషయంలో కొన్ని నిబంధనలపై సడలింపు ఇచ్చామని అతుల్ బోరా చెప్పారు. (టాపర్‌గా కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు ) -
దేశంలో మరో వైరస్.. ఇది కూడా చైనా నుంచే!
గువహటి : అసలే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజాగా మరో వైరస్ వెలుగుచూసింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా పిలిచే ఈ వైరస్ మొట్టమొదటిసారిగా అస్సాంలో బయటపడిందని ప్రభుత్వం వెల్లడించింది. భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఎడి) ఈ వైరస్‌ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఎఎస్ఎఫ్) అని ధృవీకరించినట్లు తెలిపింది. అయితే దీనివల్ల మనుషులకు పెద్దగా ప్రమాదం లేదని, దీనికి కోవిడ్‌తో ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. అస్సాంలో ఇప్పటివరకు 306 గ్రామాల్లో ఈ వైరస్ ప్రబలి 2,500 పందులు మరణించాయి. (ఆపత్కాలంలో అస్సాం కీలక నిర్ణయం!) పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే తాము ఆ పనిని చేయమని, ప్రత్యామ్నాయ పద్దతుల్లో అడ్డుకట్ట వేస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా వైరస్ ప్రబలిన జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు పందుల రవాణా ఆపేశామని తెలిపింది. పొరుగు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అస్సాం పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా అన్నారు. ఈ వైరస్ ఇంకా పెద్దగా వ్యాప్తిచెందలేదని, ఇప్పటికే నమూనాలు సేకరించి మూడు ప్రత్యేక ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2019 ఏప్రిల్‌లో ఈ వైరస్ చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్ గ్రామంలో బయటపడిందని, అక్కడినుంచి అరుణాచల్ మీదుగా అస్సాంలో వ్యాధి ప్రబలడానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే వైరస్ పెద్దగా ప్రమాదం కాదని, వ్యాధి ప్రబలని ప్రాంతాల్లో పంది మాంసం తినొచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నారు. (కరోనా కలకలం: అసోం ఎమ్మెల్యే అరెస్టు ) -
కారు సీట్లకు పందులను కట్టేసి...
న్యూఢిల్లీ : చైనాలోని కార్ల కంపెనీలు సజీవ పందులను నిజంగా ‘గినీ పిగ్స్’గా ఉపయోగిస్తున్నాయి. పిల్లల సీటు బెల్టుల పటిష్టతను పరీక్షించేందుకు జరిపే ప్రయాగాలలో వీటిని వాడుతున్నాయి. కార్ల సీట్లలో పందులను సజీవంగా బెల్ట్‌లతో కట్టేసి గంటకు 30, 40 కిలోమీటర్ల వేగంతో గోడలకు ఢీ కొట్టిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పందుల ఎముకలు విరగడమే కాకుండా వాటి లోపల అంతర్గతంగా గాయాలవుతున్నాయని, వాటి నుంచి రక్తస్రావం అవుతోందని, ఆ బాధను భరించలేక అవి వాంతులు చేసుకుంటున్నాయని, కొన్ని చనిపోతున్నాయని జంతు కారుణ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇలా చైనాలో ఓ కార్ల కంపెనీ 15 పందులపై ఈ ప్రయోగాలు నిర్వహించగా, వాటిలో ఏడు పందులు చనిపోయాయని జంతు కారుణ్య కార్యకర్తల అధికార ప్రతినిధి అన్నే మైనర్ట్ తెలిపినట్లు ‘బిల్డ్’ జర్మనీ వార్తా పత్రిక వెల్లడించింది. ప్రయోగాలకు ముందు కొన్ని గంటల నుంచి ఆ పందులకు తిండి, నీళ్లు కూడా ఇవ్వకుండా కూడా వేధిస్తున్నారని అన్నే మైనర్ట్ తెలిపారు. పందులు, చిన్న పిల్లల శరీర నిర్మాణం ఒకేలాగా ఉంటుంది కనుక కార్ల కంపెనీలు ఎక్కువగా పందులపై ప్రయోగాలు జరపుతున్నాయని తెల్సింది. అమెరికాలో జనరల్ మోటార్స్ కంపెనీ 1990 దశకం వరకు పందులతో ఇలాంటి ప్రయోగాలే నిర్వహించేది. జంతు కారుణ్య కార్యకర్తల ఆందోళనతో మానేసింది. -
రక్తం చిందే ఆ ఆటపై ఎంతో ఆసక్తి!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆడు బగాంగ్’ అన్నది ఒక ఆటవిక ఆట. అందులో గాయాలవుతాయి. వాటిలో నుంచి రక్తం చిమ్ముతుంది. గాయానికో లెక్క. ఎన్ని గాయాలయితే చూసే వారికి, బెట్ కాసేవారికి అంత ఆనందం. ఇది మనుషులు ఆడే ఆట కాదు. మనుషులు ఆడించే ఆట. తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పందేల లాంటిదేగానీ కొంత తేడా. తమిళనాడులో గేదెల మధ్య, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల మధ్య ఆటలు సాగితే అక్కడ కుక్క, అడవి పంది మధ్య హింసాత్మక పోటీలు జరుగుతాయి. ‘ఆడు బగాంగ్’ అన్నది ఇండోనేసియాలో కనిపించే గ్రామీణ క్రీడ. ఇది ఇప్పుడు ఎక్కువగా జావా రాష్ట్రంలో కనిపిస్తోంది. చిత్తడి చిత్తడిగా ఉన్న ఓ ప్రదేశం చుట్టూ గుండ్రంగా తడికెలతో ఓ దడి కడతారు. అందులోకి శిక్షణ ఇచ్చిన కుక్క పిల్లలను, అడవి పందులను బరిలోకి దింపుతారు. అవి వీరావేశంతో కొట్లాడుకుంటుంటే దడి చుట్టూ నిలబడి వందలాది మంది ప్రజలు చూస్తుంటారు. ఆ సందర్భంగా ఆనందంగా తాగే వారు తాగుతుంటే బెట్ కాసే వారు భారతీయ కరెన్సీలో వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కాస్తారు. ఈ క్రీడను మగవారితోపాటు మహిళలు, పిల్లలే కాకుండా పోలీసులు, సైనికులు కూడా ఆసక్తిగా తిలకిస్తారు. ఇందులో బెట్టింగ్ ఒక సైడే ఉంటుంది. పందెంలో పాల్గొంటున్న ఓ కుక్క, తన ప్రత్యర్థి అడవి పందికి ఎన్ని గాయాలు చేస్తుందన్నదే లెక్క. పంది ప్రాణాలపై కూడా పందెం కాస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో అడవి పంది పోరాడే శక్తిని కోల్పోయినప్పుడు ఆ పందిని బరి నుంచి తప్పించి మరో పందిని ప్రవేశపెడతారు. పందిని తెచ్చి బరిలో ప్రవేశ పెట్టే వారికి కూడా పందెం నిర్వాహకులు కొంత డబ్బు చెల్లిస్తారు. వారి పందికి ఎన్ని గాయాలైతే అంత డబ్బు లెక్కగట్టి ఇవ్వడంతోపాటు వాటికి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా చెల్లిస్తారు. ఈ గ్రామీణ క్రీడను రక్తి కట్టించేందుకు కుక్కలను బలిష్టంగా మేపడమే కాకుండా వాటికి తగిన శిక్షణ ఇస్తారు. కేవలం ఈ పోటీల కోసమే బలమైన కుక్క జాతుల మధ్య క్రాస్ బ్రీడింగ్ ద్వారా కుక్క పిల్లలను పుట్టిస్తారు. బెట్టింగ్ రాయుళ్లకు, పందిని తీసుకొచ్చే వారికి ఏ మాత్రం డబ్బు గిట్టుబాటు అవుతుందో తెలియదుగానీ కుక్కల యజమానులు మాత్రం లక్షల కొద్దీ రూపాయలు సంపాదిస్తున్నారు. జీవకారుణ్య కార్యకర్తల డిమాండ్ మేరకు ఇండోనేసియా ప్రభుత్వం 2017లో ఈ క్రీడను రద్దు చేసింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను నగర మేయర్లకు అప్పగించడంతో వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందాల్లాగా ఆ దేశంలో ఈ పోటీలు యధేశ్చగా కొనసాగుతున్నాయి. ‘కప్’ల పేరిట కూడా ఈ పోటీలను నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మద్యం తాగడాన్ని అక్కడి షరియా చట్టం నిషేధించినప్పటికీ ఈ పోటీలప్పుడు ప్రజలు మాత్రం జాతి, మత భేదాల్లేకుండా ఆనందంగా తాగడం కనిపిస్తోంది. 1960 నుంచి ఈ పోటీలు అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట రైతులు అడవి పందుల నుంచి తమ పంట పొలాలను కాపాడుకునేందుకు కుక్కలను పెంచేవారు. అవి వాటిని తరిమి తరిమి కొట్టేవి. ఈ వేటను ఆనందించిన రైతుల నుంచే ఈ పోటీలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. -
వీరింతే.... మారని అధికారులు
సాక్షి, తుని: ప్రభుత్వం మారినా అధికారుల్లో ఉదాసీనత కొనసాగుతోంది. ప్రజలకు మంచి పాలన అందించాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలను పరిగెత్తుస్తున్నారు. ఇందులో భాగంగానే 10 రోజల క్రితం తుని శాసనసభ్యుడు, విప్ దాడిశెట్టి రాజా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యం బాగుండాలని, పందులు కనిపించకూడదని అధికారులకు సూచనలు చేశారు. రెండు రోజల పాటు అధికారులు హడావుడి చేశారు. పందులను పట్టి తరలించారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు షరా మామూలే. పట్టణంలో ఎక్కడ చూసినా పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వ్యర్థాలు గుట్టలుగా ఉన్నాయి. మార్కండ్రాజుపేటలో ఇళ్ల మధ్యలో చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాలు ఉండడంతో పందులు వాటిలో సంచరిస్తున్నాయి. సొంత ఇల్లు ఉన్నా వాసన భరించలేక పోతున్నామని పలువురు ‘సాక్షి’ దృష్టికి తీసుకు వచ్చారు. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా పారిశుద్ధ్యం నిర్వహణ బాగానే ఉందని, పరిశీలించి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన పాలన అందించాలన్న లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వలన నెరవేరడం లేదు. -
‘పందుల కన్నా అధ్వాన్నంగా ఉన్నారు’
మన ఇంట్లో మనం ఎలా ఉన్న పర్వాలేదు.. కానీ వేరే వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడో.. లేదా వేరే ప్రాంతానికో, దేశానికో వెళ్లినప్పుడు మర్యాదగా ప్రవర్తించడం చాలా అవసరం. అలా కాకుండా చిల్లర వేషాలు వేస్తే ఎలా ఉంటుందో ఈ బ్రిటన్ ఫ్యామిలీని చూస్తే అర్థం అవుతుంది. ఈ సంఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. బ్రిటన్‌కు చెందిన ఓ ఫ్యామిలీ పర్యటన నిమిత్తం న్యూజిలాండ్ వెళ్లారు. ఆక్లాండ్, హామిల్టన్ చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యటించిన వీరు తినడం, తాగడం మాత్రమే కాక దొంగతనాలకు పాల్పడటం, అడిగిన వారి మీద దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయం గురించి తెలిసిన ఆక్లాండ్ మేయర్ ఈ కుటుంబం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. వీరి విపరీత చేష్టల గురించి ఓ రెస్టారెంట్ సిబ్బంది మాట్లాడుతూ.. ఆహారంలో వెంట్రుకలు, చీమలు వచ్చాయంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడమే కాక.. బిల్లు కట్టకుండా గలాట చేశారని తెలిపారు. వీరి కుటుంబ సభ్యుల్లో కొందరు పెట్రోల్ బంక్‌లో దొంగతనం కూడా చేశారని తెలిపారు. అంతేకాక తాగేసిన బీర్ బాటిళ్లను బీచ్‌లో పడేశారు. ఈ విషయం గురించి ఓ జర్నలిస్ట్ అడగ్గా అతని మీద చెప్పుతో దాడి చేశారు. ఈ విషయాల గురించి న్యూజిలాండ్ అధికారులు మాట్లాడుతూ.. ‘వీరు పందుల కన్నా అధ్వాన్నంగా ప్రవర్తించారు. ఇలాంటి వారిని ఎక్కువ రోజులు మా దేశంలో ఉంచుకోలేం. సాధ్యమైనంత త్వరగా వీరిని ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నిస్తున్నామ’ని తెలిపారు. -
పంట పందుల పాలు
తలమడుగు(బోథ్): జిల్లాలోని అటవీ ప్రాంతా ల్లో పంటలకు రక్షణ కరువైంది. అడవి పందులు పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకున్నా పరిహారం అందకపోవడంతో అప్పుల్లో కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరుంది. చుట్టూ అడవులు ఉండడంతో పందులు పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా పత్తి, కంది, జొన్న పంటలు సాగు చేస్తుంటారు. రబీలో వేరుశనగ, శనగ, మొక్కజొన్న పంటలు సాగు చేసే రైతులు పందుల బెడదతో జంకుతున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన తలమడుగు, తాంసి, బేల, బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో, అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ మండలాల్లో పంటలకు పందుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి, కంది పంటలు లక్షా 39 వేల హెక్టార్లలో సాగు చేశారు. 1200 ఎకరాల్లో పత్తి, జొన్న, కంది పంటలపై అడవి పందులు దాడి చేసి నష్టపర్చాయి. తలమడుగు మండలం పల్లి, బరంపూర్, దేవపూర్, కుచుపూర్, కజ్జర్ల, ఉమ్రీ, తాంసి మండలం వడ్డాడి, గోట్కుర్, జామిడి, కప్పర్ల, గిరిగామ్, అంబుగామ్, అట్నమ్గూడ, లింబుగుడ, భీంపూర్ మండలం పిప్పల్‌కోఠి, తాంసి(కే), అందర్‌బంద్, టెక్టిరాంపుర్, దన్నోర, కరంజి గ్రామాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. అటవీశాఖ నుంచి పరిహారం ఇప్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది 980 ఎకరాల్లో, ఈ ఏడాది సుమారు 1200 ఎకరాల్లో పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. వ్యవసాయ, అటవీ శాఖ అధికారులు పంటలను సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. రైతులు ఫొటోలతో సహా దరఖాస్తులు తీసుకున్నారు. అయినా పరిహారం అందలేదు. అడవిపందులు పంటలపై దాడులు చేస్తుండడంతో రాత్రింబవళ్లు రైతులు పొలాల వద్ద గుడిసెలు వేసుకుని కాపలా ఉంటున్నారు. పందులు వస్తే టపాసులు పేల్చుతూ బెదరగొడుతున్నారు. పంట చుట్టూ ఫెన్సింగ్, చీరలు కట్టి రక్షించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు పందుల దాడిలో గాయపడిన సంఘటనలు ఉన్నాయి. చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.