
దీస్పూర్ : పిగ్మీ హాగ్స్.. పెద్దగా పరిచయం లేని జంతువు పేరిది. 22 పౌండ్ల బరువుతో.. పరిమాణంలో 8-10 అంగుళాల పొడవుండే ఇవి పంది జాతికి చెందిన జీవులు. అందుకే వీటిని అత్యంత చిన్న పందులుగా పరిగణిస్తారు. నలుపు, గోధుమ రంగులు కలిసి ఉంటాయి. హిమాలయాల్లోని బురద పచ్చిక బయళ్లు వీటి జన్మస్థలం. 1857లో మొట్టమొదటి సారిగా వీటి ఉనికిని గుర్తించారు. ఆ తర్వాతి నుంచి వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఒకానొక దశలో అవి అంతరించిపోయాయనుకున్నారు. అయితే, 1970లో మరోసారి కనిపించాయి. వాటి సంఖ్యను పెంచటానికి 1990లో వన్యప్రాణి సంరక్షకులు బ్రీడింగ్ మొదలుపెట్టారు.
ప్రస్తుతం అస్సాంలో వీటి సంఖ్య బాగా పెరిగింది. అక్కడి అడవుల్లో 300-400 వరకు ఉన్నాయి. దీనిపై పిగ్మీ హాగ్ కన్సర్వేషన్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరక్టర్ పరాగ్ దెకా మాట్లాడుతూ..‘‘ రానున్న ఐదేళ్లలో మానస్ ప్రాంతంలో ఓ 60 పందుల్ని విడుదల చేయాలని భావిస్తున్నాము. అంతరించిపోతున్న ఈ జీవుల్ని రక్షించటం చాలా ముఖ్యం. మనమందరం మన జీవితాలకు అర్థం వెతుక్కోవాలి.. నా జీవితానికి ఓ అర్థం ఈ ప్రాజెక్టు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment