
తిరువనంతపురం: కేరళలో వాయనాడ్ జిల్లాలోని మనంతవాడిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి సంబంధించిన రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ రెండు పందుల నుంచి తీసకున్న శాంపిల్స్ పరీక్షించగా ఈ వ్యాధి గుర్తించనట్లు తెలిపారు. పశుసంవర్థక శాఖకు చెందిన అధికారి ఒక పొలంలో పందులు ముకుమ్మడిగా చనిపోవడంతో...పందుల నుంచి సేకరించిన కొన్ని శాంపిల్స్‌ని పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు.
దీంతో ఆయా జిల్లాలోని దాదాపు 300 పందులను చంపేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. బీహార్‌తోపాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి సంబంధించిన కేసులు నమోదవ్వడంతో కేంద్ర జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై ఈ కఠిన చర్యలను అవలంభించారు. ఈ ఆఫ్రికన్ ఫీవర్ అనేది పెంపుడు పందులను ప్రభావితం చేసే ప్రాణాంతక అంటు వ్యాధి.
(చదవండి: ఇండిగో రచ్చ: కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోర్టు షాక్)
Comments
Please login to add a commentAdd a comment