thiruvanthapuram
-
ఎంపీగా శశి థరూర్ పోటీ ఇదే చివరిదా!
తిరువనంతపురు: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్, ఎంపీ శశి థరూర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం లోక్ సభ స్థానంలో యువత అవకాశం కల్పిస్తానని అన్నారు. దీంతో ఆయన రాబోయే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలే చివరివి కానున్నాయా అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. తిరువనంతపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా ఉండలేరని అన్నారు. ఒకానొక సమయం వస్తుందని అప్పుడు తప్పకుండా వైదొలగి యువతకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలన్నారు. ఇదే తన ఆలోచనని తెలిపారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్లో 2024 పార్లమెంట్ ఎన్నికలు తన చివరి ఎన్నికలని శశి థరూర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని గురువారం మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికలు నా చివరి ఎన్నికలని అనలేదు’ అని 67 ఏళ్ల శశి థరూర్ స్పష్టం చేశారు. ఆయిన మళ్లీ తిరువనంతపురం లోక్‌సభ సెగ్మెంట్ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. శశి థరూర్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తిరువనంతపురంలో ఎంపీగా గెలుపొందారు. సమీప అభ్యర్థి రామచంద్ర నాయర్(సీపీఐ)పై 95వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదే విధంగా 2014, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి శశి థరూర్ గెలుపొందారు. చదవండి: హఫీజ్ సయీద్‌ను అప్పగించండి -
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం
తిరువనంతపురం: కేరళలో వాయనాడ్ జిల్లాలోని మనంతవాడిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి సంబంధించిన రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ రెండు పందుల నుంచి తీసకున్న శాంపిల్స్ పరీక్షించగా ఈ వ్యాధి గుర్తించనట్లు తెలిపారు. పశుసంవర్థక శాఖకు చెందిన అధికారి ఒక పొలంలో పందులు ముకుమ్మడిగా చనిపోవడంతో...పందుల నుంచి సేకరించిన కొన్ని శాంపిల్స్‌ని పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. దీంతో ఆయా జిల్లాలోని దాదాపు 300 పందులను చంపేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. బీహార్‌తోపాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి సంబంధించిన కేసులు నమోదవ్వడంతో కేంద్ర జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై ఈ కఠిన చర్యలను అవలంభించారు. ఈ ఆఫ్రికన్ ఫీవర్ అనేది పెంపుడు పందులను ప్రభావితం చేసే ప్రాణాంతక అంటు వ్యాధి. (చదవండి: ఇండిగో రచ్చ: కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోర్టు షాక్) -
Sainthood: దేవసహాయం పిళ్లైకు సెయింట్‌హుడ్ హోదా!
తిరువనంతపురం: హిందూ కుటుంబంలో జన్మించి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన దేవసహాయం పిళ్లైకు సెయింట్ హుడ్ హోదా లభించనుంది. మతపరమైన కార్యకలాపాల్లో లేని ఒక సామాన్య భారతీయ క్యాథలిక్కు సెయింట్ హోదా దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేవసహాయంతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన మరో ఐదుగురికి సెయింట్ హుడ్ హోదా ఇవ్వనున్నట్లు ఇక్కడి చర్చి వర్గాలు బుధవారం వెల్లడించాయి. వచ్చే ఏడాది మే 15వ తేదీన వాటికన్లోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ ఆరుగురికి సెయింట్ హుడ్ హోదాను అధికారికంగా ప్రకటిస్తారు. హోదా ఇవ్వాలని మంగళవారం వాటికన్లో మతాధికారుల సమ్మేళనంలో నిర్ణయించారు. అప్పటి ట్రావన్‌కోర్ సంస్థానం పాలనలోని తమిళనాడు ప్రాంతంలో 1712, ఏప్రిల్ 23న నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. 1745లో క్రైస్తవ మతాన్ని స్వీకరించాక తన పేరును లాజరస్‌గా మార్చుకున్నారు. ధనిక పేద తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరికీ సమాన హోదా దక్కాలని ఆయన అభిలషించారు. ఇది ఆనాటి సమాజంలోని అగ్రవర్గాలకు నచ్చేది కాదు. దీంతో 1749లో పాలకులు ఆయనను నిర్బంధించారు. 1752 జనవరి 14న ఆయనను చంపేశారు. -
పాములకు పాలు పోసి పెంచాడు.. చివరకు కోబ్రా కాటుకే బలయ్యాడు
తిరువనంతపురం: ఈ రోజుల్లో మూగ జీవులు పై ప్రేమ చూపించే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వాటిని రక్షించే వృత్తిలో మాత్రం తక్కువ మంది ఎంచుకుంటారు. ఇటువంటి వృత్తిని ఎంచుకోనే జాబితాలో జంతుప్రదర్శనశాలలో పనిచేసే వారు ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి. నిత్యం వాళ్ల ప్రాణాలకు తెగించి జంతువుల మధ్య పనిచేస్తారు. కొన్ని సార్లు అదే జంతువులకు బలైపోతారు. నిత్యం పాములకు పాలు పోసిన వ్యక్తే.. చివరకు అదే పాము కాటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన కేరళలోని తిరువనంతపురం జంతుప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కట్టకడ తాలుకాలోని అంబూరి పంచాయతీకి చెందిన హర్షద్ గత నాలుగేళ్లుగా తిరువనంతపురం జూలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి పాముల సంరక్షణ బాధ్యతను అప్పగించారు. యథావిధిగా గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కోబ్రాలు ఉండే ప్రదేశం ఎన్క్లోజర్ను శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. హర్షద్ మూడు కోబ్రాలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రపరిచాడని.. ఈ క్రమంలో ఒక పాము హర్షద్ చేతిపై కాటు వేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత కొంతసేపటికే హర్షద్ సృహతప్పి పడిపోయాడని.. వెంటనే తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు జూ అధికారి తెలిపారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు. -
బీజేపీలోకి మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియా
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కేంద్రంలోని అధికార బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. కమ్యూనిస్ట్ పాలనను అంతంచేసి.. దైవభూమిలో కాషాయ జెండాపాతాలని భావిస్తోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములకు చెరమగీతం పాడి కేరళలో పాగావేయాలని ఊవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగానే ప్రణాళికలు వేస్తోంది. దీనిలో భాగంగానే ప్రముఖ వ్యక్తులను, ఆర్థికంగా బలంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పార్టీలోకి అహ్వానిస్తోంది. ఈ క్రమంలో మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన శ్రీధరన్‌ను బీజేపీకి చేర్చుకునేందుకు కమళనాథులు సిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న విజయ యాత్రలో భాగంగా శ్రీధరన్ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేందరన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఫ్రిబవరి 21న నుంచి కేరళలో విజయ యాత్ర ప్రాంభవుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలన్న కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు ఆయన్ని ఆహ్వానించామని తెలిపారు. సురేందరన్ ప్రకటనపై స్పందించిన 89 ఏళ్ల మెట్రోమ్యాన్ శ్రీధరన్.. తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాలన చేస్తున్న యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటమికి విధానాలకు వ్యతిరేకంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రెండు పార్టీలూ సొంత లాభాల కోసమే అధికారంలోకి వస్తున్నాయని, ప్రజలను ఉద్దరించే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడంలేదని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కేరళ అభివృద్ధిపథంలో దూసుపోతుందనే నమ్మకం తనకుందన్నారు. కాగా 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలలో మరో ఐదునెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే చోట విజయం సాధించింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో పార్టీ గణనీయమైన స్థానాల్లో విజయం సాధించి తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది. ఇక 2011 డిసెంబర్ 21న ఢిల్లీ మెట్రో చీఫ్‌గా శ్రీధరన్ పదవీ విరమణ చేశారు. కొంకణ్ రైల్వే, ఢిల్లీ మెట్రోల నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమైంది. భారతదేశంలో ప్రజా రవాణా ముఖాన్ని మార్చిన ఘనత శ్రీధరన్‌కే దక్కుతుంది. దేశంలో తొలి మెట్రో ప్రాజెక్ట్ అయిన కోల్‌కతా మెట్రో రైల్ రూపశిల్పి ఆయనే కావడంతో మెట్రోమ్యాన్‌గా గుర్తింపబడ్డారు. అంతేకాకుండా భారీప్రాజెక్టులు నత్తనడక నడిచే ఈ రోజుల్లో ఆయన తన క్రమశిక్షణతో మెట్రో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి ఢిల్లీ నుంచి హర్యానా, యూపీ వరకూ దాదాపు అన్ని మార్గాల్లో మెట్రోను విస్తరించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా? -
21 ఏళ్లకే విజయం: దేశంలో తొలి మేయర్
తిరువనంతపురం\: వయసు కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం. దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ అనే విద్యార్థిని పేరు ఖరారైంది. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం తిరువనంతపురంలోని అల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సెకండియర్ చదువుతున్నారు. సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీపీఎం చిన్నారుల విభాగమైన బాలసంఘం కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్‌ముగళ్ వార్డు కౌన్సిలర్‌గా సీపీఎం టికెట్‌పై పోటీ చేశారు. కేరళలో స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. తిరువనంతపురం ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. అయితే, మేయర్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోయారు. ఆర్య రాజేంద్రన్ పేరును సీపీఎం జిల్లా నేతలు తెరపైకి తీసుకు రాగా అగ్ర నాయకత్వం అంగీకరించింది. దీంతో ఆర్య రాజేంద్రన్ మేయర్ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తానని ఆమె చెప్పారు. ప్రజలకు సేవ చేయడంతోపాటు తన చదువును కొనసాగిస్తానని తెలిపారు. ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్, తల్లి ఎల్ఐసీ ఏజెంట్. ఇప్పటిదాకా రికార్డు తెలుగమ్మాయి పేరిటే.. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య పేరిట ఉంది. ఆమె 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్టిక్కెట్పై పోటీ చేశారు. 26 ఏళ్ల వయసులోనే మేయర్‌గా ఎన్నికయ్యారు. -
‘కేరళ బంగారం’ కేసు ఎన్ఐఏకు
న్యూఢిల్లీ: తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం కేసు విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హోం శాఖ పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకుని, మరింత మెరుగైన దర్యాప్తు జరపాలంటూ కేరళ సీఎం విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన మరుసటి రోజే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం గల్ఫ్ నుంచి తిరువనంతపురం వచ్చిన ఓ విమానంలో దౌత్యపరమైన సామగ్రి పేరుతో ఉన్న బ్యాగులో సుమారు 30 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. -
భయానకం: మెడను చుట్టేసిన కొండచిలువ!
తిరువనంతపురం : పొదల్లో చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తున్న కూలీలకు కొండచిలువ భయానక అనుభవాన్ని మిగిల్చింది. అమాంతం ఓ కూలీ మెడను చుట్టేసి అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఘటన తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాలు.. నెయ్యార్ డ్యామ్ పరిసరాల్లో చెత్తను శుభ్రం చేయడానికి కొంతమంది కూలీలు మంగళవారం అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో భువనచంద్రన్ నాయర్ అనే వృద్ధుడికి అక్కడ కొండచిలువ కనిపించింది. దీంతో నెమ్మదిగా దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. అది ఒక్కసారిగా అతడి మెడను చుట్టేసింది. అంతకంతకు పట్టు బిగిస్తూ అతడి ప్రాణం తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్కడికి సమీపంలో పనిచేస్తున్న మరికొంత మంది కూలీలు నాయర్ పరిస్థితి చూసి బెంబేలెత్తిపోయారు. అనంతరం ధైర్యం కూడదీసుకుని కొండచిలువ మూతి బిగించి ఎలాగోలా దానిని నాయర్ మెడపై నుంచి లాగి పడేశారు. అనంతరం దానిని అటవీ అధికారులకు అప్పగించగా.. వారు అడవిలో వదిలేశారు. కాగా ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. #WATCH Kerala: A man was rescued from a python by locals after the snake constricted itself around his neck in Thiruvananthapuram, today. The snake was later handed over to forest officials and released in the forest. pic.twitter.com/uqWm4B6VOT — ANI (@ANI) October 16, 2019 -
మద్యంసేవించి ఐఏఎస్ డ్రైవింగ్.. జర్నలిస్ట్ మృతి
తిరువనంతపురం: మద్యం సేవించే కారు ప్రమాదం చేసిన ఐఏఎస్ అధికారి ఓ జర్నలిస్ట్ మృతికి కారణమయ్యాడు. మితిమీరిన వేగంతో కారును నడిపి ఓ జర్నలిస్ట్ ప్రాణాన్ని బలిగొన్నాడు. కేరళకు చెందిన శ్రీరామ్ వెంకటరామన్ అనే ఐఏఎస్ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్’ బ్యూరో ఛీఫ్ మహమ్మద్ బషీర్(35) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో అఫ్జా అనే మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్‌పై ఉన్న బషీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటరామన్ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అయితే తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడున్న స్థానికలు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు ఆ మహిళ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బషీర్ మృతిపై సరైన విధంగా విచారణలో జరపాలని కేరళ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బషీర్ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. -
చిచ్చరపిడుగు మోగ్లీ.. విన్యాసాలు
తిరువనంతపురం : వేసవి కాలం వస్తోందంటే అందరూ హడలెత్తిపోతారు.. కానీ చిన్న పిల్లలు మాత్రం పండగ చేసుకుంటారు. ఎందుకంటే అపుడే కదా వారికి సెలవులు వచ్చేది. అప్పటివరకూ బడిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు వేసవి సెలవుల్లో తమ చేష్టలతో తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. అటువంటి చిచ్చర పిడుగుల అల్లరికి అంతే ఉండదు. ‘నోస్టాలిగా’ అనే ఫేస్బుక్ పేజీలో కేరళకు చెందిన ఓ చిన్నారి భయం లేకుండా కొమ్మను పట్టుకుని కొబ్బరి చెట్టెక్కేందుకు ప్రయత్నిస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘రానున్న రెండు నెలల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో దేవుడా’ అంటూ చేసిన కామెంట్ లైక్‌లు, షేర్లతో దూసుకుపోతోంది. అయితే ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరి నవ్వు తెప్పిచ్చినా.. జాగ్రత్త వహించకపోతే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచడం మర్చిపోకండి సుమా. -
మోగ్లీ చేసిన విన్యాసాలు..వైరల్!
-
పట్టణపాలనలో నెంబర్‌వన్ ఆ రాష్ట్రానిదే
తిరువనంతరపురం: పట్టణ పరిపాలనలో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ప్రథమ స్ధానాన్ని సంపాదించింది. దేశంలోని 21 నగరాలు పట్టణ పరిపాలనలో చేపడుతున్న కార్యక్రమాల ఆధారంగా జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమొక్రసీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో తిరువనంతపురానికి మొదటి స్ధానం దక్కగా.. ఆ తర్వాతి స్ధానాల్లో పుణె, కోల్‌కతా, ముంబైలు ఉన్నాయి. కాగా, పట్టణపరిపాలనలో ఢిల్లీ తొమ్మిదో స్ధానంలో నిలవగా, చండీఘడ్ ఆఖరి స్ధానంతో సరిపెట్టుకుంది.