
సాక్షి,కోస్గి(మహబూబ్‌నగర్): మున్సిపల్ కేంద్రమైన కోస్గిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదుల సంఖ్యలో పందుల సంచారం మధ్యనే భోజనాలు వడ్డిస్తున్నారు. ఇది ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త... ఉపాధ్యాయులు చదువుతోపాటు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ చేసే ప్రకటనకు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇదే పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న అంజలీదేవి మండల విద్యాధికారిగా కొనసాగుతున్నారు. అయినా పందుల బెడద తప్పకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరో ఘటనలో..
అందరికీ సాయం
మక్తల్: రాష్ట్రంలో అన్నిమతాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని జెడ్పీ చైర్‌పర్సన్ వనజమ్మ, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ పండుగా సందర్బంగా పేదలకు ప్రభుత్వం నుంచి ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. పండుగను సోదరభావంతో జరుపుకోవాలని కేక్ కట్ చేశారు. కార్యక్రమంల్లో తహసీల్దార్ మదర్‌ఆలీ, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ వనజదత్తు, మార్కెట్ చైర్మన్ రాజేశ్‌గౌడ్, వైస్ చైర్మన్ అనిల్‌గాయిత్రి, ఆర్‌ఐ శ్రీశైలం, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఈశ్వ ర్, నేతాజీరెడ్డి, రాంలింగం, శేఖర్‌రెడ్డి, శంషోద్ది న్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకుని లైంగిక దాడి.. పదేళ్లు శిక్ష..
Comments
Please login to add a commentAdd a comment