'పనిచేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేయండి'
Published Mon, Jan 4 2016 2:31 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కొరతపై హైకోర్టు లో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో సౌకర్యాల కొరతపై అమికస్ క్యూరీ ( కోర్టు సహాయకారి) హైకోర్టు కు నివేదిక సమర్పించారు. జిల్లాలోని ఐజ, గట్టు మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, రెండున్నర సంవత్సరాలుగా ఇంగ్లీష్, హిందీ టీచర్లు లేరని నివేదికలో వెల్లడైంది. దీంతో ఈ అంశాన్నీ సీరియస్ గా పరిగణించిన హైకోర్టు టీచర్లకు జీతాలు ఇస్తూ విద్యార్థులకు ఎందుకు సౌకర్యాలు కల్పించలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అయితే రిమోటెడ్ ప్రాంతాల్లో పనిచేయడానికి టీచర్స్ వెళ్లడం లేదని ప్రభుత్వ ఏజీ ఈ సందర్భంగా న్యాయస్థానానికి తెలిపారు. దీంతో స్పందించిన హైకోర్టు.. రూరల్ ప్రాంతాల్లో పనిచేయని వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనిచేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేయాలని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Advertisement
Advertisement