బాలుడి మృతదేహం కలకలం
నంద్యాల: నంద్యాల పట్టణంలో రెండేళ్ల బాలుడి మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లలో పడేయడంతో పలు అనుమానాలకు తావ్విస్తోంది. బాలాజీ కాంప్లెక్స్‌లోని మారుతి టౌన్‌షిప్ వద్ద ఆదివారం ముళ్ల పొదల్లో స్థానికులు బాలుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి మృతదేహాన్ని శనివారం రాత్రి కంపచెట్లలో విసిరేసినట్లు తెలుస్తోంది. బాలుడి కాళ్లు, తొడలు భాగాలను పందులు పీక్కుతిన్నాయి. సీఐ ప్రతాపరెడ్డి, ఎస్‌ఐ నవీన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ పసివాడు సంఘటనా స్థలాన్ని చుట్టు పక్కల ఉన్న ఫరూక్‌నగర్, బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతాలకు చెందిన వాడు కాదని విచారణలో తేలిందన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.