
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్‌లో చనిపోయిన మహిళ మృతదేహం వారం రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు మృతదేహంకి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ ఇంట్లో మహిళ (40) చనిపోయి వారం రోజులు అయింది. కుళ్లిపోయి పురుగులు పట్టినా.. అదే ఇంట్లో కుటుంబీకులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment