
పోటీల్లో తలపడుతున్న పందులు
తాడిపత్రి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోళ్ల పందేలు... కానీ ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల పందేలపై నిషేధం విధించడంతో తాడిపత్రిలో వినూత్నంగా పందుల మధ్య పందెం నిర్వహించారు. ఈ పందెం చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. పోటీల్లో పాలు పంచుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పందుల పెంపకం దారులు తరలివచ్చారు.
ఆదివారం ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు పందుల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. పోటీల సందర్భంగా రూ. లక్షల్లో బెట్టింగ్ సాగింది. ఇదే విషయంపై డీఎస్పీ మాట్లాడుతూ.. ‘కోడి పందేలను నిషేధించారు... పందుల పోటీ నిర్వహించుకోవడంపై ఉన్నతాధికారులతో మాట్లాడం.. పందుల పందేలపై ఎలాంటి ఇబ్బంది లేదు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment