Top Stories
ప్రధాన వార్తలు

సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
సుంకాల విదింపుపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) విదిస్తున్న సుంకాలపై ప్రపంచ దేశాలకు ఊరట లభించింది. చైనా మినహా మిగతా దేశాలకు అమెరికా సుంకాల నుంచి ఊరటనిచ్చింది.కానీ చైనాకు మాత్రం 125 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా. మొత్తంగా 75 దేశాలపై విదించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఉంటే అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది.

అమెరికాకు షాకిచ్చిన చైనా
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

సరైన న్యాయం!
పుష్కరకాలం క్రితం ఒక మునిమాపు వేళ హైదరాబాద్ నగరంలో 18 మంది అమాయకుల ప్రాణాలు తీసిన బాంబు పేలుళ్ల ఉదంతాల్లో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులకూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు మాత్రమే కాదు, ఉగ్రవాద ఘటనలను వ్యతిరేకించే వారందరికీ ఊరటనిస్తుంది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో రెండుచోట్ల జరిగిన ఈ పేలుళ్లలో మరో 131 మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలామంది ఈనాటికీ ఆ గాయాలు కలిగించిన శారీరక, మానసిక క్లేశాల నుంచి కోలుకోలేకపోతున్నారు. మరణశిక్ష పడిన వారిలో రియాజ్ భత్కల్ అనే ఉగ్రవాది ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఈ పేలుళ్లకు పథకం పన్నడంతోపాటు అందుకు కావల్సిన నిధుల సమీకరణ, పేలుడు పదార్థాలు, మనుషుల్ని సమకూర్చుకోవటం వగైరాలకు సూత్రధారి రియాజే. ఏవో కొన్ని ఉగ్రవాద ఘటనల ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించవచ్చని, దేశాన్ని బలహీనపరచవచ్చని ఈ బాపతు ఉగ్రవాదులు కలలుగంటారు. ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. అది ఎప్పుడు ఎక్కడ తన విషపుకోరలు చాస్తుందో... ఎవరిని కాటేస్తుందో అంచనా వేయటం కూడా అసాధ్యం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అక్కడి సైన్యం, దాని గూఢచార విభాగం ఐఎస్ఐ సహకారంతో శిక్షణ శిబిరాలు నిర్వహించటం, యువకులను తప్పుడు మార్గానికి మళ్లించటం, సాధారణ ప్రజానీకానికి హాని కలిగించగల చర్యలకు ప్రేరేపించటం దశాబ్దాలుగా సాగుతోంది. ఆ సంస్థల ప్రేరణతో సొంతంగా ఉగ్రవాద సంస్థలను నెలకొల్పి భయోత్పాతాన్ని సృష్టించటం భత్కల్ లాంటివారికి లాభసాటి వ్యాపారంగా కూడా మారిందని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఉదంతంపై చేసిన దర్యాప్తులో వెల్లడైంది. మంగళూరు సమీప ప్రాంతాల్లో రియాజ్ భత్కల్ భారీయెత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడని, జిహాద్ పేరుతో దేశంలోనూ, వెలుపలా లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడని కూడా బయటపడింది.తమను తాము మత సంరక్షకులుగా చిత్రించుకోవటం, జిహాద్ చేస్తున్నామని మభ్యపెట్టడం భత్కల్ లాంటివారికి రివాజు. వీరి వలలోపడి అనేకమంది యువకుల జీవితాలు నాశనమయ్యాయి. జనసమ్మర్దంగల ప్రాంతాల్లో బాంబులుంచి సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించటం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి. ఈ పన్నెండేళ్ల కాలంలోనూ వీరు తమ చర్యలకు పశ్చాత్తాపం ప్రకటించటంగానీ, ఇకపై సత్ప్రవర్తనతో మెలుగుతామని గానీ ఎక్కడా చెప్పలేదు. వీరిలో పరివర్తనకూ లేదా సంస్కరణకూ అవకాశమే లేదని నిర్ధారణ కొచ్చినట్టు ఉన్నత న్యాయస్థానం చెప్పిందంటే ఈ నేరగాళ్లు ఎంత కరుడు గట్టిపోయారో అర్థమవుతుంది. ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకోవచ్చుగానీ ఏ మతమూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఉగ్రవాదానికి అసలు మతం ఉండదు. ఇలాంటి నేరగాళ్ల చర్యల వల్ల మాత్రమే మతం సురక్షితంగా మనుగడ సాగించగలదని అందులోని వారెవరూ విశ్వసించరు కూడా! కానీ అమాయకులను నమ్మించటానికి వీరు మతాన్ని సాధనంగా వాడుకుంటారు. వారిని మభ్యపెట్టడం కోసం ఆధ్యాత్మి కతను ప్రబోధిస్తారు. క్రమేపీ తమ దురాలోచనను వారి మెదళ్లలోకి ఎక్కిస్తారు. అప్పటికల్లా ఆ యువకులు వీరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతారు. ఇలాంటివారికి చివరకు మిగిలేదేమిటో, వారి మానసిక, శారీరక స్థితిగతులు ఎలా దిగజారతాయో తెలియటానికి జాతీయ న్యాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు కొందరు వారితో మాట్లాడి రూపొందించిన నివేదికే సాక్ష్యం. భిన్న వర్గాల ప్రజల మధ్య చిచ్చురేపి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికీ, సమాజాన్ని భయభ్రాంతపరచటానికీ వీరు పాల్పడిన చర్యల వల్ల ఎక్కడెక్కడి నుంచో పొట్టకూటి కోసం ఈ మహానగరాని కొచ్చిన సాధారణ ప్రజానీకం బలయ్యారు. అందులో అన్ని మతాలవారూ ఉన్నారు. ఇంకా అమ్మ కడుపులోనే ఉన్న శిశువు మొదలుకొని స్త్రీలు, పిల్లలు కూడా వీరి మతిమాలిన చేష్టలకు బలైపోయారు. అనేకమంది జీవితాలు అనిశ్చితిలో పడ్డాయి. మనుషులైవుండి తోటి మనుషుల పట్ల ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా వ్యవహరించటం ఊహకందనిది. ఇలాంటి ఉదంతాల్లో ఆచూకీ దొరక్కుండా సులభంగా తప్పించుకోవచ్చని, నేర నిరూపణ అసాధ్యమని నేరగాళ్లు భావిస్తుంటారు. కానీ సాంకేతికత బాగా పెరిగిన ఈ కాలంలో అదేమంత కష్టం కాదని పకడ్బందీ దర్యాప్తు ద్వారా ఎన్ఐఏ నిరూపించింది. అయితే ఇలాంటి కేసుల్లో ఇమిడివుండే సంక్లిష్టతల వల్ల కావొచ్చు... మన న్యాయస్థానాలకు ఉండే పెండింగ్ కేసుల భారం వల్ల కావొచ్చు విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. ఈ ఉదంతం చోటుచేసుకున్ననాటినుంచీ చూస్తే ఇప్పటికి పన్నేండేళ్ల సమయం పట్టింది. త్వరితగతిన విచారించి శిక్షించే వ్యవస్థ ఉంటే అలాంటి బాటలో పోయేవారికి అదొక హెచ్చరికగా పనికొస్తుంది. ఈ తరహా భయోత్పాత చర్యలకు ఒక నిరోధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉదంతంలో అయిన వారిని కోల్పోయినవారికీ, ప్రాణాలతో బయటపడి భారంగా బతుకీడుస్తున్నవారికీ ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందలేదంటే మనసు చివుక్కుమంటుంది. కాళ్లూ చేతులూ కోల్పోయి, చూపు, వినికిడి దెబ్బతిని, కనీసం మందులు కొనే శక్తిలేక అనేకులు కష్టాలు పడుతుండటం కలచివేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.

ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
డోనాల్డ్ ట్రంప్, జె.డి. వాన్స్ కలిసి వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎలా వేధించారో ప్రపంచం అంతా చూసింది. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయన పట్ల పాశవికంగా ప్రవర్తించి గుడ్ బై సైతం చెప్పకుండా తరిమేశారు. ‘రష్యాను ధిక్కరించండి, మీకు మేము అండగా ఉన్నాం...’ అంటూ ఉక్రెయిన్ అధినేతకు బాసటగా నిలిచి ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహించిన యూరప్ ఈ ఘట్టాన్ని చేష్టలుడిగి చూసింది. యూరప్ ప్రభావం పలుచబడిపోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?తగ్గుతున్న జనాభాయూరోపియన్ యూనియన్ (ఈయూ)కు బలమైన నాయ కత్వం లేదు. ఎవరి దౌత్య విధానం వారిదే. ‘యూరప్‌తో మాట్లాడా లనుకుంటే, నేను ఎవరికి ఫోన్ చేయాలి?’ అంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ ఒక సందర్భంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. యూరప్ దేశాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ దేశాల్లో జననాల రేట్లు తగ్గుతున్నాయి.వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, యువకులు తగ్గిపోతున్నారు. 2050 నాటికి యూరప్ సగటు వయసు 48 ఏళ్లకు పెరుగుతుంది. 60 ఏళ్లు దాటినవారు జనాభాలో 40 శాతం ఉంటారు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభాలో 25 శాతం యూరప్ దేశాల ప్రజలే ఉండేవారు. 2050 నాటికి, వీరి వాటా కేవలం 7 శాతానికి పరిమితం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.యుద్ధరంగానికి దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారుతోంది. రష్యా ఇప్పటికే ఉత్తర కొరియా దళాలను రెగ్యులర్ ప్రాతిపదికన తన సైన్యంలో నియమించుకోవలసి వచ్చింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నా సరే... యూరప్ కాలం చెల్లిన తన పాత ఇమ్మిగ్రేషన్ విధానాలనే పట్టుకు వేలాడుతోంది. ఇది శ్రమశక్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఉక్రెయిన్ శ్వేతజాతి శరణార్థుల పుణ్యమా అని పనిచేసే వారి సంఖ్య పెరిగినా ఇది తాత్కాలికమే! ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థపరిపాలన సరిగా ఉండదు, ఆర్థికంగా పురోగమనం లేదు, వయసు మళ్లుతున్న జనం పెరుగుతున్నారు, వృత్తిపరమైన అవకా శాలూ అంతంత మాత్రమే. ఇలాంటి యూరప్ ఇండియాను ఎలా ఆకట్టుకుంటుంది? అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా, సత్తాను బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. ఆ మాదిరిగా మార్పు చెందటంలో యూరప్ సమాజం విఫలమైంది. నత్తనడకగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న సామాజిక భద్రతా వ్యయాలు, నడ్డి విరుస్తున్న రుణభారం... ఇవన్నీ ఆ ఖండం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అమెరికా పాత్రికేయుడు ఫరీద్ జకారియా చెప్పినట్లు, యూరప్ దుఃస్థితికి మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం. ఉదాహర ణకు ఇటలీ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా ఒక దశాబ్దంగా ఎలాంటి పెరుగుదల లేదు.ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాల్లోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలం పుంజుకుంటూ దూసుకు వస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్‌లో తమకు అధిక పాత్ర ఉండాలని ఈ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జీ–7, నాటో వంటి ప్రపంచ అధికార సంస్థలు ఇప్పటికీ యూరప్ చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. కానీ ఆర్థిక వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు యూరప్ దేశాలు (జర్మనీ, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ) ప్రపంచ టాప్–10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. 2050 నాటికి ఈ అయిదింటిలో కేవలం జర్మనీ, యూకే రెండే టాప్–10 జాబితాలో మిగిలి ఉంటాయి. ఆ పదిలో వాటికి దక్కే ర్యాంకులు చిట్టచివరి తొమ్మిది, పది! ఇందుకు భిన్నంగా, వాటి కంటే ముందుండే ఇండియా, బ్రెజిల్, ఇంకా ఇతర వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గణనీయ పాత్ర ఉండాలని ఒత్తిడి చేస్తాయి. ఇప్పటి ప్రపంచ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణను ఎంతో కాలం అడ్డుకోలేరు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం ఇప్పటికే కాలం చెల్లిపోయింది. దీన్ని ఎలా పునర్ వ్యవస్థీకరించాలనే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ప్రస్తుత సభ్యత్వాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నాయి.ఇండియా జీడీపీలో మూడోవంతు కంటే తక్కువ, జపాన్ జీడీపీలో దాదాపు సగం ఉండే యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు శాశ్వత సభ్యు లుగా ఉండటం... ఇండియా, జపాన్ వెలుపల ఉండటం ఎలా సమంజసమనీ, వాటి మీద ఈ రెండు యూరప్ దేశాలు ఎలా పెత్తనం చలా యిస్తాయనీ గట్టి వాదన వినబడుతోంది. భద్రతా మండలి, జీ–7 లను సభ్యత్వ పరంగా విస్తరించడం మీద చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచ పాలన సంస్థల పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నది కాదనలేని అంశం. తిరుగులేని అమెరికా?శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా మున్ముందు కూడా ప్రబలమైన ప్రపంచ శక్తిగా కొనసాగుతుంది. చైనా, ఇండియా వంటి దేశాలు దాన్ని వెన్నంటి ఉంటాయి. ఒకవేళ అధిగమించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పటి విజేతల్లో ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్–10 జాబితా నుంచి కను మరుగవుతాయి.అమెరికా లోలోపల పలు మార్పులు చెందుతోంది. జనాభా వర్గాల్లో పరివర్తన ఫలితంగా రాజకీయంగానూ మార్పులు సంభవి స్తున్నాయి. నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆఫ్రో–ఇండి యన్ మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టగలిగింది. భారతీయ అమెరికన్లు ప్రభుత్వంలో, విద్యా పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. గుజ్జూభాయి కశ్యప్ పటేల్ ఎఫ్‌బీఐ పగ్గాలు చేపడతాడని ఎప్పుడైనా అనుకున్నామా? వివిధ దేశాల సంతతులకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ, ఇతర రంగాల్లో ప్రముఖ స్థానాలు పొందడం వల్ల ఆ యా దేశాలు అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. విదేశీయులకు ప్రవేశం కల్పించడం వల్ల అమెరికా ప్రతిభ ఇనుమడించింది. యూరప్ ఈ విషయంలో విఫలమైంది. వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపు దిద్దబోతున్నందున... ప్రపంచ వ్యవహారాల్లో యూరప్ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. యూరప్ గనుక జనాభా సంబంధిత (డెమో గ్రాఫిక్) నూతన విధానాలు రూపొందించకపోతే, ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టకపోతే అది ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో గుర్తింపు లేని ఖండంగా మిగిలిపోతుంది.రానున్న రోజుల్లో ఆసియానే ప్రపంచ అధికార కేంద్రంగా ఆవి ర్భవిస్తుంది. 2020లో ఈ ఒక్క ఖండమే ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 60 శాతం వాటా కైవసం చేసుకుంది. ఇదే ట్రెండ్ ఇక మీదటా కొనసాగబోతోంది. చైనా, ఇండియా ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ పలుకుబడి పెంచుకుంటూ పోయి, ప్రపంచ పాలన (గ్లోబల్ గవర్నెన్స్)లో మార్పుల కోసం పట్టుబడతాయి. అయితే, అమెరికాతో విరోధం కారణంగా చైనా, యురోపియన్ యూనియన్ (ఈయూ)కు చేరువయ్యే అవకాశం ఉంది. ఇక చైనాతో సంబంధాలు బెడిసినందువల్ల ఇండియా, అమెరికాకు బహుశా మరింత దగ్గర అవుతుంది.మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com

IPL 2025: సాయి సుదర్శన్ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుక్ ఖాన్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ తెవాతియా (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. రషీద్ ఖాన్ 4 బంతుల్లో ఫోర్, సిక్స్ సాయంతో 12 పరుగులు, రూథర్‌ఫోర్డ్ 3 బంతుల్లో సిక్స్ సాయంతో 7 పరుగులు, శుభ్‌మన్ గిల్ 3 బంతుల్లో 2 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ప్రసిద్ద్ కృష్ణ 3, రషీద్ ఖాన్, సాయి కిషోర్ చెరో 2, సిరాజ్, అర్షద్ ఖాన్, కేజ్రోలియా తలో వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సంజూ శాంసన్ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.యశస్వి జైస్వాల్ (7 బంతుల్లో 6; ఫోర్), నితీశ్ రాణా (3 బంతుల్లో 1), ధృవ్ జురెల్ (4 బంతుల్లో 5; ఫోర్), శుభమ్ దూబే (3 బంతుల్లో 1), తుషార్ దేశ్‌పాండే (3 బంతుల్లో 3), జోఫ్రా ఆర్చర్ (4 బంతుల్లో 4), తీక్షణ (13 బంతుల్లో 5) విఫలమయ్యారు.

జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు.1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా?. లేదా మీ ఇంటిలిజెన్స్ బలహీనంగా ఉందా..?. డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా?’’ అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోం మంత్రి వెళ్లిపోయారు.కాగా, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి.పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్ భద్రత విషయంలో చూపకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాదిమంది హెలిప్యాడ్ వద్దకు పోటెత్తారు. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.హెలికాప్టర్ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్‌లెస్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్కీమ్ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్ వెహికిల్స్ యాక్ట్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ సొమ్మును రీయింబర్స్మెంట్ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్ వెహికిల్స్ యాక్ట్(సవరణ చట్టం)లోని సెక్షన్ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది.

కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
పాట్నా: కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) మనవరాలు సుష్మాదేవి (Sushma Devi) దారుణ హత్య కలకలం రేపుతోంది. సుష్మాదేవిని ఆమె భర్త రమేష్ సింగ్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు.గయా ఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం,గయా జిల్లా అటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటువా గ్రామానికి చెందిన జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32),రమేష్ సింగ్ దంపతులు. 13ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మాదేవీ వికాస్ మిత్రగా పనిచేస్తుండగా.. ఆమె భర్త రమేష్ సింగ్ ఓ వాహన యజమానిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్ గన్నుతో కాల్చి చంపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్, సుష్మా పిల్లలు పరిగెత్తుకొని రాగా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. కాల్పులమోతతో ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.మృతురాలి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ..తన అక్కను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్ తన వద్ద ఉన్న గన్నుతో కాల్చి చంపినట్లు చెప్పారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూఈ ఘటనపై గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడారు. సుష్మాను ఆమె భర్త రమేష్ సింగ్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం’అని తెలిపారు. జితన్ రామ్ మాంఝీ ఎవరు?మనవరాలి హత్యపై గయ లోక్‌సభ ఎంపీ, సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించలేదు. జితన్ రామ్ మాంఝీ బీహార్ సీఎంగా పనిచేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ వ్యవస్థాపకుడు.

మందులపైనా టారిఫ్‌లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
ఫార్మాస్యూటికల్స్‌పై త్వరలోనే భారీ సుంకాన్ని ప్రకటించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హౌస్ రిపబ్లికన్ల కోసం ఫండ్ రైజింగ్ గాలాలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేవీ ఆయన బయటపెట్టలేదు.‘ఒకసారి మనం అలా చేస్తే (సుంకాలు విధిస్తే) వారు (ఔషధ కంపెనీలు) తిరిగి మన దేశంలోకి వస్తారు. ఎందుకంటే మనమే వాళ్లకు పెద్ద మార్కెట్" అని ట్రంప్ అన్నారు. "మనది పెద్ద మార్కెట్ కావడమే అందరి కంటే మనకు ఉన్న అవకాశం" పేర్కొన్నారు.బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం.. దేశీయ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి సుంకాలు విధిస్తామని ఆయన పదేపదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ఉంటాయని మార్చిలోనే ట్రంప్ సంకేతాలిచ్చారు.పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేయడం అమెరికా, ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఒకవేళ ఫార్మాస్యూటికల్ ఔషధాలపై సుంకాలు ప్రకటిస్తే అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అమెరికాకు భారత ఫార్మా ఎగుమతుల్లో ఎక్కువగా జనరిక్స్ లేదా పాపులర్ ఔషధాల చౌక వెర్షన్లు ఉన్నాయి. అక్కడ వీటిపై ప్రస్తుతం దాదాపు ఎలాంటి సుంకాలు లేవు. కానీ భారత ప్రభుత్వం యూఎస్ ఫార్మా దిగుమతులపై 10% పన్నును విధిస్తోందని పరిశ్రమ నిపుణులను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.ఈ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావంరాయిటర్స్ ప్రకారం, భారతదేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మూడింట ఒక వంతు అమెరికాకే ఉంటున్నాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బెంగళూరుకు చెందిన బయోకాన్, ముంబైకి చెందిన లుపిన్ సంస్థలు తమ ఆదాయంలో 44 శాతం, 37 శాతం అమెరికా నుంచే ఆర్జించాయి.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత బహుళజాతి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ లారస్ ల్యాబ్స్ కూడా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 17 శాతం వాటాను ఆర్జించింది. రాయిటర్స్ ప్రకారం, భారతదేశపు అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 32% యూఎస్ అమ్మకాల ద్వారానే సంపాదించింది. వీటితో పాటు డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు అమెరికాకు గణనీయంగా ఎగుమతులు చేస్తున్నాయి.

Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో (air india) అమానుష ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (Air India ‘Pee-gate’) చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణించిన ఎయిరిండియా విమానంలో (AI 2336) ఓ ప్రయాణికుడు మధ్యం సేవించాడు. అయితే మద్యం మత్తులో ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టగా పనిచేస్తున్న ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటన చేసింది.ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించామని,బ్యాంకాక్‌లో బాధితుడికి అవసరమైన సహాయం అందించేందుకు ఎయిరిండియా సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే బాధితుడు ఆ సహాయం తీసుకోవడానికి నిరాకరించినట్టు సంస్థ వెల్లడించింది.ప్రయాణికుడిపై మూత్ర విసర్జన ఘటనపై విచారణ కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ కమిటీ ఘటనపై సమగ్రంగా సమీక్షించి, అవసరమైతే సంబంధిత ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటుందని సంస్థ స్పష్టం చేసింది. డీజీసీఏ రూపొందించిన ప్రామాణిక కార్యకలాపాల ప్రకారమే వ్యవహరిస్తామని పేర్కొంది. An Air India spokesperson says, “Air India confirms that an incident of unruly passenger behaviour was reported to the cabin crew operating flight AI2336, from Delhi to Bangkok, on 9 April 2025. The crew followed all laid down procedures, and the matter has been reported to the… pic.twitter.com/QwMB1pWr2E— ANI (@ANI) April 9, 2025 గత రెండేళ్లుగా మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 2023 మార్చిలో అమెరికాలోని ఓ యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి ఆర్య వోహ్రా, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో సహయాత్రికుడిపై మూత్రవిసర్జన చేశాడని ఆరోపణల నేపథ్యంలో విమాన సంస్థ అతనిపై నిషేధం విధించింది. గతేడాది నవంబర్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ఓ వృద్ధ మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
IPL 2025: సాయి సుదర్శన్ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్‌కు మతి పోయింది..!
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
బీహార్‌లో పిడుగుల వాన.. 13 మంది మృతి
Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
మేం ఉద్యోగం చేయలేం
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
‘కేకేఆర్‌ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
అమెరికాకు షాకిచ్చిన చైనా
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
నంబర్ వన్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
పాపికొండల్లో అలుగుల సందడి
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
మందులపైనా టారిఫ్‌లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
చాహల్‌తో ఆర్జే మహ్వశ్ డేటింగ్.. కన్ఫార్మ్ చేసేసింది!
17 ఏళ్లుగా పరారీలోనే!
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
మియాపూర్‌లో షెల్టర్!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
వెస్టిండీస్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
GT VS RR: ఆర్చర్ దెబ్బకు స్పీడ్ గన్‌కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్ డెలివరీ
ఒకరి వెంట మరొకరు
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
ముందే జాగ్రత్త పడాల్సింది
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడికి బెయిల్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
‘అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే’
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
కొనసాగుతున్న అల్పపీడనం
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
యాడ్స్‌లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
కొనేది.. తినేది విషమే!
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్ ఇదే..
హైదరాబాద్ నగరంలో మరో సమగ్ర సర్వే
ప్రాణాలు తీస్తున్న సరదా
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్‌కు మతి పోయింది..!
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
కానిస్టేబుల్ యశోద అనుమానాస్పద మృతి.. జైలులో ఏం జరిగింది?
నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
సినిమాకు అతను చాలా ముఖ్యం.. లేకపోతే కాళ్లు, చేతులు ఆడవు: సిద్ధు జొన్నలగడ్డ
అహ్మదాబాద్ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
IPL 2025: సాయి సుదర్శన్ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్‌కు మతి పోయింది..!
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
బీహార్‌లో పిడుగుల వాన.. 13 మంది మృతి
Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
మేం ఉద్యోగం చేయలేం
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
‘కేకేఆర్‌ను వదిలెయ్ రింకూ.. వాళ్లకు ఆ అర్హత లేదు’!
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
అమెరికాకు షాకిచ్చిన చైనా
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
నంబర్ వన్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
పాపికొండల్లో అలుగుల సందడి
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
మందులపైనా టారిఫ్‌లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
చాహల్‌తో ఆర్జే మహ్వశ్ డేటింగ్.. కన్ఫార్మ్ చేసేసింది!
17 ఏళ్లుగా పరారీలోనే!
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
మియాపూర్‌లో షెల్టర్!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
వెస్టిండీస్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
పెళ్లి సంబంధాలు : శాలరీ స్లిప్ అడగాలా వద్దా? అడిగితే తప్పేంటి?
GT VS RR: ఆర్చర్ దెబ్బకు స్పీడ్ గన్‌కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్ డెలివరీ
ఒకరి వెంట మరొకరు
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
ముందే జాగ్రత్త పడాల్సింది
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడికి బెయిల్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
‘అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే’
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
కొనసాగుతున్న అల్పపీడనం
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
యాడ్స్‌లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట
బంగారంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. చెరకు రసం అమ్ముతున్న ఆదా శర్మ!
కొనేది.. తినేది విషమే!
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్ ఇదే..
హైదరాబాద్ నగరంలో మరో సమగ్ర సర్వే
ప్రాణాలు తీస్తున్న సరదా
GT VS RR: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జైస్వాల్.. రషీద్ ఖాన్‌కు మతి పోయింది..!
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
కానిస్టేబుల్ యశోద అనుమానాస్పద మృతి.. జైలులో ఏం జరిగింది?
నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
సినిమాకు అతను చాలా ముఖ్యం.. లేకపోతే కాళ్లు, చేతులు ఆడవు: సిద్ధు జొన్నలగడ్డ
అహ్మదాబాద్ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?
సినిమా

సినిమాకు అతను చాలా ముఖ్యం.. లేకపోతే కాళ్లు, చేతులు ఆడవు: సిద్ధు జొన్నలగడ్డ
టిల్లు స్క్వేర్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్. ఈ మూవీకి బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినీ ఇండస్ట్రీలో ఎడిటర్ గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. టిల్లు స్క్వేర్, తండేల్, మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యాయంటే ఎడిటర్ నవీన్ నూలి మాత్రమే కారణమన్నారు. కానీ సినిమాకు ఎడిటర్ అనేవారు చాలా ముఖ్యం.. ఆయన లేకపోతే దర్శకుడికి కాళ్లు, చేతులు ఆడవని సిద్ధు అన్నారు. మనం చాలా తక్కువగా ఎడిటర్ గురించి మట్లాడతాం.. కానీ వారే సినిమాకు చాలా ప్రధానమని ఆయన తెలిపారు. మా జాక్ సినిమాకు నవీన్ నూలినే ఎడిటర్.. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.అలాగే రానా ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాకపోవడంపై కూడా సిద్ధు స్పందించారు. రానా ప్రస్తుతం ముంబయిలో ఉన్నారని తెలిపారు. రానా నాయుడు సీజన్-2 డబ్బింగ్‌తో బిజీగా ఉన్నారని సిద్ధు వెల్లడించారు. సాయంత్రం ఐదున్నరకు రావాల్సిన విమానం మిస్ కావడంతోనే రానా రాలేకపోయారని సిద్ధు క్లారిటీ ఇచ్చారు.

ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఈ ఏడాది డాకు మహారాజ్‌తో టాలీవుడ్ ప్రియులను అలరించింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఈ సినిమాలో దబిడి దిబిడి సాంగ్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించింది. అయితే ఈ పాటపై పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సాంగ్ కొరియోగ్రఫీపై పలువురు విమర్శలు చేశారు.ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బాలీవుడ్ భామను ఓ అవార్డ్ వరించింది. ఫ్యాన్స్ ఫేవరేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్-2025కు ఎంపికైంది ముద్దుగుమ్మ. డాకు మహారాజ్ చిత్రంలో ప్రదర్శనకు గానూ గోల్డెన్ క్వీన్ అవార్డ్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అవార్డ్ చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా తనకు సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

షారూఖ్ తర్వాత నేనే.. మీరు ఒప్పుకుని తీరాల్సిందే!: ఊర్వశి రౌతేలా
వరుస ఐటం సాంగ్స్‌తో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఇటీవల డాకు మహారాజ్ మూవీలో దబిడి దిబిడి పాటతో ఓ ఊపు ఊపేయడంతో పాటు ఆ సినిమాలో చిన్న పాత్రలోనూ యాక్ట్ చేసింది. జాట్ సినిమాలోనూ టచ్ కియా అనే ఐటం సాంగ్‌తో అల్లాడించేసింది. తాజాగా ఊర్వశి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఈసారి పాట వల్లో, పాత్ర వల్లో కాదు.. తన సెల్ఫ్ డబ్బా వల్ల! బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తర్వాత ఆ రేంజ్లో ప్రమోషన్స్ చేసేది తానేనని చెప్తోంది. షారూఖ్ తర్వాత నేనే..ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాటట్లాడుతూ.. నేను ఎప్పుడూ నా పనిగురించే ఆలోచిస్తాను. ఉదాహరణకు సినిమాలు ప్రమోట్ చేసే విషయానికి వస్తే షారూఖ్ ఖాన్ తర్వాత ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేసేది నేనేనని మీరు ఒప్పుకుని తీరాల్సిందే! హాలీవుడ్ మేకర్స్ కూడా రేచర్ మూడో సీజన్ కోసం నన్ను ప్రమోషన్స్ చేయమని అడిగారు. కాబట్టి మీరే అర్థం చేసుకోండి.. వీలైతే పొగడండి.. ఇది గర్వపడాల్సిన విషయం. అయినా ఆర్టిస్టులుగా మన సినిమాను మనం ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అని ప్రశ్నించింది.కావాలనే ఇదంతా..ఆమె వ్యాఖ్యలు విన్న పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఊర్వశి కావాలనే ఇదంతా చేస్తోంది. తనను ట్రోల్ చేస్తే కొంతకారం ఆమె గురించి మాట్లాడుకుంటామని, అలాగైనా వార్తల్లో ఉంటామన్నది ఆమె ప్లాన్.. జనం అంతా తన గురించి ఏదో ఒకరకంగా మాట్లాడుకోవాలని ఇలా ప్లాన్ చేసింది. ఈమె వ్యాఖ్యలు కాస్త పిచ్చిగా ఉంటాయి కానీ అందులో కూడా ఆత్మస్థైర్యం కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. ఈమె మళ్లీ మొదలెట్టిందిరా బాబూ అని తలపట్టుకుంటున్నారు.సినిమా..ఊర్వశి విషయానికి వస్తే.. సింగ్ సాబ్ ద గ్రేట్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సనమ్ రే, పాగల్పంటి, హేట్ స్టోరీ 4, వర్జిన్ భానుప్రియ, జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రాల్లో నటించింది. హిందీలో పలు ఐటం సాంగ్స్ కూడా చేసింది. తెలుగులో బాసూ వేర్ ఈజ్ ద పార్టీ (వాల్తేర వీరయ్య), కల్ట్ మామా (స్కంద), మై డియర్ మార్కండేయ (బ్రో), వైల్డ్ సాలా.. (ఏజెంట్) సాంగ్స్‌లో చిందేసింది.చదవండి: అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవు.. బోరున ఏడ్చేసిన నటి

పవన్ టైటిల్.. మాపై బాధ్యత పెంచింది: యాంకర్ ప్రదీప్
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మాటతీరుతో ఏ షోనైనా సరే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీగా అందిస్తాడు. ఆయన వేసే పంచ్‌లు, జోకులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాక, మనసు నిండా ఆనందాన్ని పంచుతాయి. అందుకే యాంకర్లలో ప్రదీప్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ టాలెంటెడ్ యాంకర్ వెండి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు. నాలుగేళ్ల కిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోగా మారారు. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సరైన సమయంలో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి సపోర్టు లభించింది. ఆర్జేగా, టెలివిజన్ యాంకర్ గా యాక్టర్ గా ఇన్నోవేటివ్ గా వర్క్ చేసే అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మంచి కథ చెప్పే చాన్స్ కుదిరింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభించే అవకాశంగా భావిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారట కదా..కారణం ఏంటి?నా స్నేహితులకు నాలాగే సినిమా అంటే పిచ్చి. అందరికి మంచి చాన్స్‌లు వస్తున్నాయి. కానీ మేమంతా కలిసి ఓ సినిమా చేయలాని ఎప్పుటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది. మంచి కథ ఉంది. అందరం కలిసి చేస్తే బాగుంటందని అనుకొని.. సినిమాను స్టార్ట్ చేశాం.ఈ కథకి ఫౌండేషన్ నుంచి వర్క్ చేసాం. అందుకే కొంచెం టైం పట్టింది. ఫ్యామిలీ అంతా కూర్చుని సమ్మర్లో హ్యాపీగా చూసే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ మా నుంచి ఎలాంటి కంటెంట్ ని ఆశిస్తారో అలాంటి కంటెంట్ ఇందులో ఉంది. ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఎలాంటి కథ అంటే..?మా సినిమాలో కథే మంచి ఎంటర్టైన్మెంట్. దీన్ని ఒక చందమామ కథల చూడొచ్చు. అనగనగా ఒక ఊరు. అక్కడ ఓ అమ్మాయి. ఆ ఊరికి వెళ్ళిన ఒక సివిల్ ఇంజనీర్. ఆ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ రూల్స్ మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేయడం జరిగింది.పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ని హైప్ కోసమే పెట్టారా?లేదండి. మా కథ అనుకున్నప్పుడే లక్కీగా ఈ టైటిల్ ని అనుకున్నాం . పవన్ కళ్యాణ్ గారి డెబ్యు సినిమా టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నామంటే మాపై బాధ్యత పెరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. టైటిల్ కు తగ్గట్టు చాలా చక్కని అచ్చ తెలుగు సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తో ఒక సినిమా చేయడం మా అదృష్టం. చిన్న సినిమా కదా.. ఆ టైటిల్ పెడితే జనాల్లోకి ఈజీ వెళ్లొచ్చు అనిపించింది. కానీ కేవలం పబ్లిసిటీ కోసం అయితే ఈ టైటిల్ పెట్టలేదు.ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?-ఇందులో కృష్ణ అనే పాత్రలో కనిపిస్తాను. చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఈ సినిమాలో నేను ఎంత చిరాకు పడతానో ఆడియన్స్ అంత ఎంటర్టైన్ అవుతారు. ఆ క్యారెక్టర్ పడే కష్టాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. డైరెక్టర్స్ నితిన్ భరత్ భరత్ కు నాతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నారు. నా టైమింగ్ వాళ్ళకి తెలుసు. దానికి తగ్గట్టుగా ఈ కథని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు.దీపికా పిల్లి ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చింది?ఈ సినిమా హీరోయిన్ పాత్రకు ఒక తెలుగు అమ్మాయి కావాలి. ఆడిషన్స్, లుక్ టెస్ట్, వర్క్ షాప్ అన్నీ చేసిన తర్వాతే దీపికని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. తను చాలా అద్భుతంగా పెర్ఫర్మ చేసింది. ఆడియన్స్ డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతారు.మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గురించి ?ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా మంచి స్కోప్ ఉంది. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ జోనర్ లో చేయడం జరిగింది. రదన్ బ్యూటీఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ ఆడియన్స్ కి చాలా అలరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమాని చాలా క్వాలిటీ గా తీసాం. బాల్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. క్వాలిటీ పరంగా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్స్ నితిన్ భరత్ గురించి ?నితిన్ భరత్ నన్ను సర్ప్రైజ్ చేశారు.డెబ్యూ డైరెక్టర్స్ లాగా అనిపించలేదు. డేఫినెట్ గా చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి నితిన్ భరత్ ఇన్స్పిరేషన్ అవుతారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఎక్కడ కూడా కొత్తవారితో పని చేసిన ఫీలింగ్ రాలేదు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.కామెడీ సినిమా కదా.. సెన్సార్ యూ/ఏ ఇచ్చారేంటి?ఈ సినిమా సెన్సార్ సభ్యులు చూసిన తర్వాత చాలా కాలం తర్వాత హాయిగా నవ్వుకునే సినిమా తీశారని చెప్పారు. అది మాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ ఇచ్చారు. రెండున్నర గంటల పాటు ఆడియన్స్ హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ సినిమా చూశారు. సినిమా పూర్తవ్వగానే డీల్ క్లోజ్ చేశారు. ఇది సమ్మర్ కి ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా అని రిలీజ్ డేట్ ని వారే లాక్ చేశారు. ఇది మాకు మరింత కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది.
న్యూస్ పాడ్‌కాస్ట్

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు
క్రీడలు

IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన రాయల్స్ 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ఆరో వికెట్ కోల్పోయిన రాయల్స్13.2వ ఓవర్- 119 పరుగుల వద్ద రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శుభమ్ దూబే (1) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన రాయల్స్12.2వ ఓవర్- 116 పరుగుల వద్ద రాయల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సాయి కిషోర్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (41) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో రాయల్స్7.4వ ఓవర్- 218 పరుగుల భారీ ఛేదనలో రాయల్స్ 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి దృవ్ జురెల్ (5) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్.. రియాన్ ఔట్6.4వ ఓవర్- 60 పరుగుల వద్ద రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ కేజ్రోలియా బౌలింగ్‌లో వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (26) ఔటయ్యాడు. 6 ఓవర్లలో 57 పరుగులు.. ధాటిగా ఆడుతున్న శాంసన్, రియాన్11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా రాయల్స్ ఏమాత్రం తగ్గడం లేదు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 57/2గా ఉంది. శాంసన్ (21), రియాన్ (25) ధాటిగా ఆడుతున్నారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోలోయిన రాయల్స్2.2వ ఓవర్- భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో తొలుత జైస్వాల్ ఔట్ కాగా.. తాజాగా సిరాజ్ బౌలింగ్‌లో నితీశ్ రాణా (1) ఔటయ్యాడు. టార్గెట్ 218.. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్218 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగుల వద్దనే తొలి వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (6) ఔటయ్యాడు. సంజూ శాంసన్‌కు జతగా నితీశ్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు.చెలరేగిన సాయి సుదర్శన్.. గుజరాత్ భారీ స్కోర్రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్, షారుక్ ఖాన్ తలో 36 పరుగులు చేయగా.. రాహుత్ తెవాతియా 24 (నాటౌట్), రషీద్ ఖాన్ 12, రూథర్‌ఫోర్డ్ 7, గిల్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.82 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔట్82 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 18.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 187/5గా ఉంది. తెవాతియా (10), రషీద్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్16.1వ ఓవర్- 163 పరుగుల వద్ద సందీప్ శర్మ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి రూథర్‌ఫోర్డ్ (7) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్15.4వ ఓవర్- 156 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో షారుక్ ఖాన్ (36) స్టంపౌట్ అయ్యాడు. సాయి సుదర్శన్‌కు (69) జతగా రూథర్‌ఫోర్డ్ క్రీజ్‌లోకి వచ్చాడు. రూథర్‌ఫోర్డ్ వచ్చీ రాగానే సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 163/3గా ఉంది.భారీ స్కోర్ దిశగా గుజరాత్ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 124/2గా ఉంది. సాయి సుదర్శన్ 59, షారుక్ ఖాన్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. బట్లర్ ఔట్9.6వ బంతి- 94 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో జోస్ బట్లర్ (36) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. సాయి సుదర్శన్ (50) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షారుక్ ఖాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చిన బట్లర్.. 8 బంతుల్లో 4 బౌండరీలుఆరంభంలో నిదానంగా ఆడిన బట్లర్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో లైన్లోకి వచ్చాడు. ఆ ఓవర్ ఆఖరి రెండు బంతులను బౌండరీలకు తరలించిన బట్లర్, ఆతర్వాతి ఓవర్లో కూడా మరో రెండు బౌండరీలు బాదాడు. సాయి సుదర్శన్‌తో (26 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పాటు బట్లర్ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు) కూడా టచ్‌లోకి రావడంతో గుజరాత్ స్కోర్ 8 ఓవర్లలోనే 81 పరుగులకే చేరింది. ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్శుభ్మన్ గిల్ త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ధాటిగా ఆడుతున్నాడు. సాయి 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. సాయికి జతగా బట్లర్ (11) ఉన్నాడు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 56/1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. కెప్టెన్ ఔట్2.1వ ఓవర్- 14 పరుగులకే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాయి సుదర్శన్‌కు (11) జతగా జోస్ బట్లర్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 9) గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రాయల్స్ స్టార్ బౌలర్ వనిందు హసరంగ దూరమయ్యాడు (వ్యక్తిగత కారణాల చేత). అతని స్థానంలో ఫజల్హక్ ఫారూకీ తుది జట్టులోకి వచ్చాడు. గుజరాత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది.ఈ సీజన్లో గుజరాత్ తొలి మ్యాచ్‌లో ఓడి (పంజాబ్), ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు (ముంబై, ఆర్సీబీ, సన్‌రైజర్స్) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. రాయల్స్ విషయానికొస్తే.. ఈ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో (సన్‌రైజర్స్, కేకేఆర్) ఓడి, ఆతర్వాత వరుసగా సీఎస్కే, పంజాబ్లపై గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.తుది జట్లు..గుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్‌కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

GT VS RR: నేటి మ్యాచ్‌లో గెలుపెవరిది.. ఆ స్టార్ బౌలర్ ఆందుబాటులో ఉంటాడా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 9) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టాటాన్స్ తమ సొంత మైదానంలో (నరేంద్ర మోదీ స్టేడియం) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌కు గుజరాత్ స్టార్ పేసర్ కగిసో రబాడ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అస్పష్టంగా ఉంది. రబాడ గత మ్యాచ్‌కు ముందు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిపోయాడు. రబాడ ఎప్పుడు తిరిగొస్తాడనే దానిపై టైటాన్స్ యాజమాన్యం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. దీన్ని బట్టి చూస్తే అతను నేటి మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తుంది. రబాడ ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడి 10.38 ఎకానమీతో కేవలం రెండే వికెట్లు తీశాడు. వాస్తవానికి ఇది అతని స్థాయి కాదు. ఈ సీజన్లో రబాడతో పాటు మరో స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. రషీద్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. అయినా గుజరాత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. రబాడ, రషీద్ ఖాన్ విఫలమవుతున్న వేల సిరాజ్, సాయి సుదర్శన్ చెలరేగిపోతున్నారు. రబాడ, రషీద్ వైఫల్యాలను ఈ ఇద్దరూ భర్తీ చేస్తున్నారు. గుజరాత్ గెలిచిన మూడు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు కీలకపాత్రలు పోషించారు. సిరాజ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తున్నాడు. మరో పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ప్రసిద్ద్ కూడా ఓ మ్యాచ్‌లో తన జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రసిద్ద్, సిరాజ్ చెలరేగడంతో గుజరాత్ వరుసగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, సన్‌రైజర్స్‌పై అద్భుత విజయాలు సాధించింది. మరోవైపు బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్, జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ కూడా సత్తా చాటుతున్నారు. సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాట్‌కు పని చెప్పాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో ఓటమి (పంజాబ్) తర్వాత గుజరాత్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడుతున్నారు. బౌలర్లు, బ్యాటర్లు సమాంతరంగా రాణిస్తూ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయారు. రాజస్థాన్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో కూడా విన్నింగ్ రన్‌ను కొనసాగించాలని గుజరాత్ భావిస్తుంది. ఈ జట్టుకు హోం గ్రౌండ్లో ఆడటం కూడా అడ్వాంటేజ్ అవుతుంది. మరోవైపు రాజస్థాన్ ఈ సీజన్లో రెండు వరుస ఓటముల తర్వాత రెండు వరుస విజయాలు సాధించి గెలుపు ట్రాక్ ఎక్కింది. గత మ్యాచ్‌లో ఈ జట్టు పటిష్టమైన పంజాబ్‌కు ఊహించని షాకిచ్చింది. రాయల్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్, కేకేఆర్ చేతుల్లో ఓడి, ఆతర్వాత సీఎస్కే, పంజాబ్‌పై విజయాలు సాధించింది. తొలి మూడు మ్యాచ్‌లో ఫామ్ ప్రదర్శించలేకపోయిన యశస్వి జైస్వాల్ చివరి మ్యాచ్‌లో టచ్‌లోకి రావడం రాయల్స్‌కు శుభపరిమాణం. కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ ఇప్పటికే పలు మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. నితీశ్ రాణా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హెట్‌మైర్, ధృవ్ జురెల్ బ్యాట్లకు పని చెప్పాల్సి ఉంది. బౌలింగ్‌లో హసరంగ, సందీప్ శర్మ, తీక్షణ పర్వాలేదనిపిస్తుండగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన జోఫ్రా ఆర్చర్ చివరి రెండు మ్యాచ్‌ల్లో అద్బుతంగా రాణించాడు. ఆర్చర్ గత మ్యాచ్‌లో పంజాబ్‌ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.తుది జట్లు (అంచనా)..గుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, R. సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, షెర్ఫే రూథర్‌ఫోర్డ్.రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్‌కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే/కుమార్ కార్తికేయ

వెస్టిండీస్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్.. కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025 పోటీలు ఇవాళ (ఏప్రిల్ 9) మొదలయ్యాయి. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగగా.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్తాన్, వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ విజయాలు సాధించాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 44 ఓవర్లలో 179 పరుగలకే కుప్పకూలింది. ఫలితంగా పాక్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.రెండో మ్యాచ్‌లో పటిష్టమైన వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ శతకంతో (114) వీరోచితంగా పోరాడినప్పటికీ విండీస్ గెలవలేకపోయింది. అంతకుముందు మాథ్యూస్ బౌలింగ్‌లోనూ రాణించింది. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. ఈ ప్రదర్శనకు గానూ మ్యాచ్ ఓడిపోయినా మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గత వరల్డ్‌కప్‌లో (2022) సెమీస్ వరకు చేరిన విండీస్ ఈసారి వరల్డ్‌కప్‌కు (2025) నేరుగా అర్హత సాధించలేకపోగా, క్వాలిఫయర్స్‌లోనూ పరాభవాన్ని ఎదుర్కొంది.కాగా, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ పోటీపడుతున్నాయి.ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.

భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు
భారత స్టార్ క్రికెటర్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మకు చురక తగిలేలా కేకేఆర్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ ఆటగాళ్లు వ్యక్తిగత లక్ష్యాల కోసం కెరీర్లను పొడిగించుకోకూడదని అలీ అన్నాడు. వయసు పైబడినా, జట్టు ప్రయోజనాలకు ఉపయోగపడకపోయినా స్వార్థపూరితంగా జట్టులో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు.సీనియారిటీ, పదవీ విరమణపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. వ్యక్తిగత లక్ష్యాల కోసం ఏ ఆటగాడూ కెరీర్‌ను పొడిగించుకోకూడదు. ఆటగాళ్లు సీనియారిటీ లేదా స్టార్డమ్తో సంబంధం లేకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యం అనుకోవాలి. వెటరన్లు సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువకులు, ప్రతిభావంతులకు మార్గం చూపాలి. పేరున్న ఆటగాడనో లేక భారీ సంఖ్యలో అభిమానులున్నారనో జట్టును పట్టుకుని వేలాడకూడదు. వాస్తవికంగా ఆలోచించాలి. జట్టుకు ఏమైనా ఉపయోగపడుతున్నామా లేదా అన్నది పరీక్షించుకోవాలి. జట్టుకు భారమైనప్పుడు హుందాగా తప్పుకోవాలని అన్నాడు. మొయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత స్టార్ క్రికెటర్లు, ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్న ధోని, రోహిత్‌లకు చురక తగిలేలా ఉన్నాయి. ఈ ఇద్దరు వెటరన్ క్రికెటర్లు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో పేలవంగా ఆడుతూ జట్టుకు భారమైపోయారు. చాలామంది వీరు తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నప్పటికీ వారిలో ఏ మాత్రం చలనం లేదు. మాలో ఇంకా ఆడే సత్తా ఉందన్నట్లు ఊదరగొడుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోని అయినా కాస్త పర్వాలేదనిపించాడు కానీ రోహిత్ అయితే దారుణంగా విఫలమవుతున్నాడు. ధోని రోహిత్ కంటే దాదాపు ఐదేళ్లు పెద్ద వాడైనప్పటికీ తనకు చేతనైన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ధోని, రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎస్కే, ముంబై జట్లు కూడా పేలవంగా ఆడతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తలో నాలుగింట ఓడి చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సీఎస్కే, ముంబై ఐపీఎల్లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో తలో ఐదు టైటిళ్లు నెగ్గాయి.మొయిన్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లిష్ క్రికెటర్ కూడా వెటరన్ ఆటగాడే. ఇతని వయసు 37 ఏళ్లు. అయితే మొయిన్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు జాతీయ జట్టు నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్లో కేకేఆర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో మొయిన్ తనకు అవకాశం వచ్చిన రెండు మ్యాచ్‌ల్లో ఐదు పరుగులు చేసి, రెండు వికెట్లు తీశాడు. మొయిన్‌కు ఇంగ్లండ్ తరఫున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అనుభవం ఉంది.
బిజినెస్

గ్లోబల్ కంపెనీల కోసం వేదాంతా అన్వేషణ
విస్తరణ ప్రాజెక్టులకు దన్నునిచ్చేందుకు వీలుగా మైనింగ్ దిగ్గజం వేదాంతా గ్లోబల్ భాగస్వామికోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. వివిధ విభాగాలలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మద్దతిచ్చే దిగ్గజంతో జత కట్టే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇది కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు ఎంతో తోడ్పడుతుందని చెప్పింది.రానున్న మూడేళ్లలో భారీ విస్తరణ ప్రణాళికలు అమలు చేయనున్న కంపెనీ ఇందుకు ప్రపంచస్థాయిలో అనుభవమున్న ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్(ఈపీసీఎం) దిగ్గజం కోసం చూస్తున్నట్లు వెల్లడించింది. గ్రూప్ బిజినెస్‌లను వేదాంతా అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఐరన్ అండ్ స్టీల్ పేరుతో నాలుగు విభాగాలుగా విడదీయనుంది.ఇదీ చదవండి: వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..రానున్న మూడేళ్లలో మెటల్స్, మైనింగ్, హైడ్రోకార్బన్స్పై 20 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇందుకు ఆసక్తిగల కంపెనీల నుంచి ఈ ఏప్రిల్ 30లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఇంతక్రితం ప్రకటించిన విడదీత ప్రణాళికలను జూన్–జులైకు వాయిదా వేసింది.

క్యూఆర్ స్కాన్ చేస్తే ఆధార్ వివరాలు.. కేంద్రం కొత్త యాప్
క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ యాప్‌ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ఇన్స్టంట్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ కోసం రియల్ టైమ్ ఫేస్ ఐడీతో కొత్త యాప్ పని చేస్తుందని చెప్పారు. ఈ యాప్‌తో సులభంగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపారు. భారత పౌరులు తమ ఆధార్ కార్డును కొన్ని సందర్భాల్లో భౌతికంగా చూపించడానికి బదులుగా వారి గుర్తింపును ధ్రువీకరించడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.‘కేవలం ఒక ట్యాప్‌తో వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే ఇతరులతో పంచుకునేలా ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఇది వారికి తమ వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను అందిస్తుంది. న్యూ ఆధార్ యాప్ (బీటా టెస్టింగ్ దశలో ఉంది) ద్వారా వెరిఫికేషన్ యూపీఐ పేమెంట్ చేసినంత సులభంగా ఉంటుంది. యూజర్లు తమ వివరాలు నిర్ధారించేటప్పుడు వారి ఆధార్‌ను డిజిటల్‌గా ధ్రువీకరించవచ్చు. యూపీఐ లావాదేవీల మాదిరిగా కేవలం క్యూఆర్‌ను స్కాన్ చేయడం ద్వారా ఇదంతా సులువుగా చేయవచ్చు’ అని మంత్రి తెలిపారు.ఆధార్ ఫేస్ అథెంటికేషన్దేశంలో యూపీఐ చెల్లింపులకు విస్తృతంగా వినియోగించే క్యూఆర్ కోడ్ల మాదిరిగానే ఆధార్ ధ్రువీకరణకు ‘పాయింట్స్ ఆఫ్ అథెంటికేషన్(వెరిఫికేషన్ భాగస్వాములు)’ వద్ద అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. యూపీఐ యాప్‌ల మాదిరిగానే కొత్త ఆధార్ యాప్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే వారి ఫేస్ వెరిఫై ఆప్షన్ వస్తుంది. ఇది ఆధార్ హోల్డర్లకు వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను కలిగిస్తుంది. ఈ యాప్ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ వెరిఫికేషన్, సమాచార మార్పిడికి అనుమతి లభిస్తుంది. ఇది భౌతిక ఫోటోకాపీల అవసరాన్ని తొలగిస్తుంది. ఇకపై హోటల్ రిసెప్షన్లు, షాపులు, ప్రయాణాల సమయంలో ఆధార్ ఫొటోకాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.ఇదీ చదవండి: వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..బీటా వెర్షన్ఈ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉందని మంత్రి అన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఇది విస్తృతంగా అమలైతే, పౌరులు ఇకపై వారి భౌతికంగా తమ ఆధార్ లేదా ఫోటోకాపీని ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యాప్‌కు సంబంధించి నిర్దిష్ట యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా యూఐడీఏఐ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దాంతో ప్రస్తుతం 6.25 శాతంగా ఉన్న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి చేర్చారు. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.రెపో ఆధారిత రుణాలపై ప్రభావంఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఇలా..ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్ఆర్లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.ఇదీ చదవండి: త్వరలో ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలుడిపాజిట్లకు సవాల్..వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు.

ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలు?
ఔషధాల దిగుమతులపై అమెరికా త్వరలోనే భారీ సుంకం విధించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లను పరస్పర టారిఫ్ పాలసీ నుంచి మినహాయించింది. కానీ తాజాగా ప్రకటనతో తిరిగి ఈ విభాగాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.‘మేము త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాన్ని ప్రకటించబోతున్నాం. వివిధ దేశాల్లో తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తిరిగి అమెరికా వచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతాయి. ఈ విభాగంలో యూఎస్ అతిపెద్ద మార్కెట్’ అని ట్రంప్ అన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలను ఉదహరిస్తూ అమెరికా ఇటీవల భారతీయ వస్తువులపై 26 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది.దేశంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సమయంలో ఫార్మా రంగాన్ని అందులో నుంచి మినహాయించారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ప్రకటిస్తామని ట్రంప్ మార్చి 24న చెప్పారు. యుద్ధాలు, మరేదైనా అనిశ్చితులు తలెత్తినప్పుడు ఉక్కు, ఫార్మాస్యూటికల్స్ అవసరం ఉందన్నారు. స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై ఇప్పటికే 25 శాతం సెక్టోరల్ టారిఫ్‌లను వర్తింపజేసిన ట్రంప్ రాగిపై కూడా వీటిని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫార్మాస్యూటికల్ ఔషధాలతో పాటు కలప, సెమీకండక్టర్ చిప్‌లతో సహా అదనపు సెక్టోరల్ లెవీలను ఆయన ప్రభుత్వం విడిగా పరిశీలించనుంది. అయితే వీటి అమలుకు ఎంత సమయం పడుతుందో మాత్రం స్పష్టతనివ్వలేదు.భారత్‌పై ప్రభావంఫార్మా దిగుమతులపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటిస్తే అమెరికాకు అత్యధికంగా ఔషధాలను సరఫరా చేసే దేశాల్లో ఒకటైన భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో దేశం ఔషధ ఎగుమతుల విలువ 12.72 బిలియన్ డాలర్లు. ఇది దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతి రంగంగా మారింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022లో కొన్ని సర్వేల ప్రకారం యూఎస్‌లోని వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌తో దాదాపు 40 శాతం మందులు ఇండియాకు చెందినవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..ఇదిలావుండగా, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) అమెరికాలో ప్లాంట్లను నిర్మించకపోతే 100% వరకు పన్ను విధిస్తామని ట్రంప్ బెదిరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తప్పుబట్టిన ట్రంప్ అరిజోనాలోని ఫీనిక్స్‌లో ఉన్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం టీఎస్ఎంసీ యూఎస్ యూనిట్‌కు 6.6 బిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వడాన్ని ఖండించారు.
ఫ్యామిలీ

అందాల పోటీలో 'సీపీఆర్' స్కిల్ టెస్ట్..!
అందాల పోటీలు అనగానే ఏముంటాయి. వారి ఫిట్నెస్, విలక్షణమైన ఫ్యాషన్ వంటి పోటీలు నిర్వహిస్తారు. చివరగా వారిలో దాతృత్వం గుణాలు కొద్దిమొత్తంలోనైనా ఉన్నాయా..?. వారి దృష్టిలో అందం అంటే భౌతికమైనదే అనే తరహాలో ముఖాముఖి పరీక్షలు ఉంటాయి. కానీ అందానికి కూడా ఓ పర్పస్ ఉండాలంటూ వినూత్నంగా నిర్వహించేలా సరికొత్త పోటీకి తెరతీసింది ప్రపంచ సుందరీగా టైటిల్‌ని గెలుచుకున్నా మిల్లా మాగీ. ప్రతిసారిలా ఓ మూసధోరణిలో పోటీలు కాకుండా గొప్ప స్కిల్‌తో కూడిన పోటీ ఉండాలంటోంది. అందానికి కూడా ఓ అర్థం, పరమార్థం ఉండాలంటోంది. కేవలం కళ్లప్పగించి చూస్తుండిపోయేలా.. వావ్! అని ఆశ్యర్యచకితులని చేసేది అందం కానే కాదంటోదామె. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..మిస్‌వరల్డ్ ఇంగ్లాండ్ పోటీలో ఈ సరికొత్త రౌండ్ కాంపిటీషన్‌ని కండక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇది మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ టైటిల్ హోల్డర్ మిల్లా మాగీ ఆలోచన నుంచి వచ్చిందట. పోటీలను అధునికరించేలా ప్రభావవంతమైన నైపుణ్యాలు కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సీపీఆర్ స్కిల్‌ని ప్రవేశ పెట్టారు. అందాల పోటీల్లో సాధారణంగా ఉండే అన్ని రౌండ్ల పోటీలు ఉంటాయి. అయితే చివరి రౌండ్లో పోటీదారులకు మాత్రం సీపీఆర్ స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు. అంతేగాదు మిస్ ఇంగ్లాండ్ పోటీలో సెమీ ఫైనల్‌కు చేరుకున్న పోటీదారులంతా ఇంగ్లాండ్ అంతటా నగరాల్లో సిపిఆర్ ఎలా చేయాలో పిల్లలకు బోంధించే కార్యక్రమాల్లో పాల్గొన్సాల్సి ఉంటుంది. ఫైనల్‌కి చేరుకున్న సుందరీమణులకు స్విమ్ రౌండ్లో ఈ సీపీఆర్ టెస్ట్‌ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన భారత్‌లోని హైదరాబాద్‌లో జరగనున్న 72వ మిస్ వరల్డ్‌పోటీల్లో కూడా ఈ రౌండ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు మిల్లా మాగీ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది. మాగీ దీన్ని తన బ్యూటీ విత్ పర్పస్ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ ఎందుకంటే..మిల్లా మాగీ తన తాతలు, తండ్రులను ఈ సీపీఆర్ స్కిల్ తెలియకే కాపాడుకోలేకపోయారట. తమ కుటుంబంలో ఎవ్వరికీ దీనిపై అంత అవగాహన గానీ నిర్వహించడం గానీ తెలియకపోవడంతో అంతటి విషాదాన్ని చవిచూడాల్సి రావడంతో ఇలా ప్రాజెక్టు చేపట్టి మరీ అవగాహన కల్పిస్తోందామె. ఒక రకంగా పోటీదారులంతా ఈ కాంపిటీషన్ కోసం అయినా..సీపీఆర్ స్కిల్ గురించి తెలుసుకుంటారు. ఎలా చేయాలో ఆన్లైన్ సెషన్లు లేదా వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి నేర్చుకునే యత్నం చేస్తారంటోందిఈ బ్యూటీ క్వీన్.ఇక మాగీ ఇంగ్లాండ్‌లోని పాఠశాలల్లో సిపిఆర్ శిక్షణను తప్పనిసరి చేయాలంటూ పోరాటం చేస్తోంది. "గో విత్ సిపిఆర్" అనే నినాదంతో ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తుల రక్షించడం ఎలా అనేదానిపై విద్యార్థులకు అవగామన కల్పిస్తోంది. ఈ నినాదం ఓ రేంజ్లో ఊపందుకుంది. ఎంతలా అంటే.. ప్రిన్స్ విలియం సైతం ఆమెకు మద్దతు తెలిపారు. తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఇన్ ఇండియా పోటీ డైరెక్టర్ ఎంజీ బిస్లీ కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఓ లేఖను కూడా పంపారు. పైగా ఆమె వల్లే తాను ఈ సీపీఆర్ చేయడం నేర్చుకున్నాని అన్నారు. ఆమె ప్రాజెక్టు వైవిధ్యాన్ని తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులకు తెలియజేస్తానన్నారు. ప్రాణాలను రక్షించే ఈ నైపుణ్యం ఎంత గొప్పదో తెలియజేసే.. స్విమ్‌పోటీకి వారంతా ముందుకొచ్చేలా చేస్తానన్నారు. అంతేగాదు ఈ ఏడాది అందాల పోటీల్లో ఇదే హైలెట్‌గా ఉంటుందని అన్నారు బీస్లీ. చివరగా మాగీ మాట్లాడుతూ.. అందానికి ఒక ప్రయోజనం ఉండాలని చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంతలా అందర్నీ హత్తుకునేలా ఊపందుకోవడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని అంటోందామె. View this post on Instagram A post shared by Milla Magee (@milla.magee__) (చదవండి: Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..)

నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్
ఏదైనా సక్సెస్ సాధించిన తరువాత స్నేహితులకు, సన్నిహితులు పార్టీ ఇవ్వడం చాలా కామన్. ఒక్కోసారి చిన్న చిన్న గిఫ్ట్‌లు కూడా ఇస్తుంటారు. మరి అలాంటిది ఊహించని విజయం వచ్చి వరిస్తే ఆసంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. ఈ సంతోషాన్ని తన కరియర్లో సక్సెస్‌కు తొడుగా నిలిచిన తన భార్యకు ఖరీదై గిఫ్ట్ ఇవ్వడం విశేషంగా నిలిచింది. స్టోరీ ఏంటంటే..నటుడు, కంటెంట్ సృష్టికర్త అవినాష్ ద్వివేది 'దుపాహియా' వెబ్ సిరీస్ ద్వారా అద్భుత విజయం సాధించాడు. దీంతో అతని బార్య సంభావన సేథ్‌కు తన కలల కారును బహుమతిగా ఇచ్చాడు. సంభావన కూడా నటి, యూట్యూబర్. ఇది తమ ప్రేమ, పట్టుదలతోపాటు పాటు, తమ ఉమ్మడి కలలకు ప్రతిరూపమని చెప్పాడు. భార్యకు రూ. 1.81కోట్ల విలువైన విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చాడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. దీని ప్రకారొం ఈ కారు వారి 7 సిరీస్ BMW 750e లాగా కనిపిస్తోంది. దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.అవినాష్ ద్వివేది, సంభావన సేథ్ప్రారంభం నుండి కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా అన్నివిధాల సంభావన, అండగా నిలిచి, ప్రతి పోరాటంలో తనకు వెన్నెముకగా నిలిచింది అంటూ భార్యకు కృతజ్ఞతలు తెలిపాడు. కష్టాల్లో, నష్టాల్లో తొడుగా నిలిచింది. నిజంగా ఆమె తనకు లభించిన గొప్ప వరమని పేర్కొన్నాడు. మరిన్ని కలలతో, తమ ప్రయాణం, ఇలాగే కలకాలం సాగిపోవాలని కోరుకున్నాడు. ఇది కేవలం మన విజయం మాత్రమే కాదు. మన తల్లిదండ్రులు ఆశీర్వాద బలం కూడా అంటూ View this post on Instagram A post shared by Avinash Dwivedi (@imavinashdwivedi)మీ(సంభావన) తల్లిదండ్రులు ఇప్పుడు వారితో లేకపోయినా, పై నుంచి వారు ఆశీర్వదిస్తారంటూ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా తాను ఈ స్థాయికి రావడానికి ముంబైలో తను పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి ముంబైకి వచ్చినప్పుడు, ఒకే ఒక్క లక్ష్యం. నటుడిగా మారాలి. సక్సెస్సాధించాలి. ఇదే పట్టుదల. ఇందుకోసం గత ఐదేళ్లుగా నా సర్వస్వం అర్పించాను అని చెప్పాడు. అలాగే దుపాహియాపై ప్రేక్షకుల అపారమైన ప్రేమ కురిపించారు అంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. మార్చి 2025 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ విడుదలైంది. ఇది విమర్శకులు, వీక్షకులు ప్రశంసలు దక్కించుకుంది. సంభావన సేథ్ , అవినాష్ ద్వివేది 2016, జూలై 14న వివాహం చేసుకున్నారు.

ఊడల మర్రికి వేలాడిన వీరుడు రాంజీ గోండ్
పాలకుల అకృత్యాలను ఎదిరించడంలో మొదటి నుంచీ గిరిజనులు ముందే ఉన్నారు. భారత దేశాన్ని మొదటగా ఏకం చేసిన మొఘల్ కాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్వాళ్లపైనా ఆదివాసీలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అయితే వీళ్ల తిరుగుబాటుల గురించి అంతగా ప్రచారం జరగకపోవడం శోచనీయం. ముఖ్యంగా మన తెలంగాణలో రాంజీ గోండ్ చేసిన తిరుగుబాటు నిజాం నవాబుకు, ఆయన పాలనకు రక్షణగా నిలిచిన బ్రిటిష్ వాళ్లకూ పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. గోండ్వానా ప్రాంతాన్ని పాలించిన గోండు రాజులను మరాఠాలు జయించిన తర్వాత... ఆ ప్రాంతం నిజాంకు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లకు వశమయ్యింది. వారి నిరంకుశత్వం గోండులను తిరుగుబాటుకు పురిగొల్పింది. ఆదిలాబాద్ జిల్లాలోని గోండుల్లో ధైర్యశాలిగా పేరున్న మార్సికోల్లరాంజీగోండ్ 1838–1880 మధ్యకాలంలో నాటి జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు. తెలంగాణలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి, తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న రోహిల్లాల పోరాటం రాంజీ గోండ్ నాయకత్వంలో తీవ్రరూపం దాల్చింది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనులుండే ప్రాంతం. 1880 మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా తుదిపోరాటం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం గోండుల తిరుగుబాటును అణచివేసే బాధ్యతను కల్నల్ రాబర్ట్‌కు అప్పజెప్పింది. తెల్లదొరల నిర్బంధాన్ని వ్యతిరేకించడం, వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట, ఉట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీప కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు. వారిపై నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు దాడులు చేశాయి.అడవంతా తుపాకుల మోతతో మారుమోగింది. సాంప్రదాయిక ఆయుధాలతో పోరాటానికి దిగిన ఆదివాసులు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేక పోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీ గోండు సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ‘ఊడల మర్రి’ చెట్టుకు 1880 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రిచెట్టు ఇప్పుడు ‘వెయ్యి ఉరిల మర్రిచెట్టు’గా ప్రసిద్ధి! – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక(నేడు రాంజీ గోండ్ వర్ధంతి)

మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు..!
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, రాయగడ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. జంఝావతి నది జలాలు అమ్మవారి చైత్రోత్సవాల ప్రారంభానికి ఒక రోజు ముందు సమీపంలో గల జంఝావతి నది నుంచి జలాలను తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో ఉంచి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. నది వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన పురోహితులు పూజా కార్యక్రమాల అనంతరం జలాలను కలశాలతో తీసుకువచ్చి అమ్మవారిని అదేవిధంగా అమ్మవారి గర్భగుడిని శుద్ధి చేస్తారు. అదేరోజు రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆలయ ప్రధాన పూజారి చంద్రశేఖర్ బెరుకొ, బాబుల బెరుకొలు అమ్మవారిని సింధూరంతో అలంకరిస్తారు. సునా భెషొలో అమ్మవారు అమ్మవారి చైత్రోత్సవాల సందర్భంగా ఉత్సవాల ఐదు రోజుల పాటుగా అమ్మవారిని బంగారు నగలతో అలంకరిస్తారు. సునా భెషొను తిలకించి భక్తులు మురిసిపోతారు. ఆంధ్ర భక్తుల తాకిడి ఉత్కళాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన మజ్జిగౌరి అమ్మవారిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా పార్వతీపురం, విశాఖపట్నంతో పాటు తెలంగాణ, అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ప్రతీ ఆది, మంగళ ,బుధవారాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సెపె్టంబరు నెల వరకు పొరుగు రాష్ట్రాల భక్తులతో మందిరం కిటకిటలాడుతుంది. భక్తుల తాకిడిని ఉద్దేశించి వారికి సౌకర్యం కల్పించే విధంగా ప్రత్యేక దర్శనాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. అందుకు 300 రూపాయల టిక్కెట్లను విక్రయిస్తుంది. స్థల చరిత్ర క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దంలో నందపూర్ రాజ వం«శస్తులకు చెందిన విశ్వనాథ్ దేవ్ గజపతి అనే రాజు రాజ్యాలను విస్తరించే దిశలో రాయగడలోనికి అడుగుపెట్టారు. రాయగడలో రాజ్యాన్ని స్థాపించిన ఆయన మజ్జిగౌరి దేవిని ఇష్టాదేవిగా పూజిస్తుండేవారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని కోట మధ్యలో స్థాపించి పూజించేవారు. కోట మధ్యలో కొలువుదీరడంతొ అమ్మవారిని మొఝిఘోరియాణిగా పిలుస్తారు. తెలుగులో మజ్జిగౌరిగా ఒడియాలొ మోఝిఘొరియాణిగా ప్రతీతి. 108 మంది రాణుల సతీసహగమనం రాయగడ రాజ్యాన్ని పాలిస్తుండే విశ్వనాథ్ దేవ్ మహారాజుకు 108 మంది రాణులు ఉండేవారు. గోల్కొండను పాలించే ఇబ్రహిం కుతుబ్‌షా సేనతో రాయగడపై దండెత్తారు. ఈ పోరాటంలో విశ్వనాథ్ దేవ్ హతమవుతారు. దీంతో ఆయన 108 మంది రాణులు అగ్నిలొకి దూకి ఆత్మార్పణం చేసుకుంటారు. ఈ స్థలాన్ని సతీకుండంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్మవారి మందిరానికి పక్కనే ఈ సతీకుండం ఉంది. మందిర కమిటీ దీని ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధి చేసింది. అయితే కోట కూలిపొవడం అంతా శిథిలమవ్వడంతొ అమ్మవారి మందిరం కూడా శిథిలమవుతోంది. బ్రిటీష్ వారి ఆగమనంతో.. 1936 వ సంవత్సరంలొ బ్రిటీష్ వారు విజయనగరం నుంచి రాయిపూర్ వరకు రైల్వే పనులు ప్రారంభించించే సమయంలో జంఝావతి నదిపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభిచారు. ఈ క్రమంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ వంతెన పనులను ప్రారంభిస్తారు. వంతెన నిర్మాణం జరగడం అదేవిధంగా కూలిపోవడం క్రమేపీ చోటు చేసుకుంటాయి. దీంతో ఒక రోజు కాంట్రాక్టరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అమ్మవారు కాంట్రాక్టర్ కలలో కనిపించి తాను ఇక్కడే ఉన్నానని, తనకు చిన్న గుడి ఏర్పాటు చేసి నిత్యపూజా కార్యక్రమాలు జరిపిస్తే జంఝావతి నదిపై తలపెట్టిన వంతెన పనులు పూర్తవుతాయని చెబుతుంది. దీంతో కలలో కనిపించిన అమ్మవారి మాటలు ప్రకారం వెతిక చూడగా ఒక శిథిలమైన మందిరంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అయితే అప్పటికి అమ్మవారి తల భాగమే కనిపిస్తుంది. దీంతో కాంట్రాక్టరు మందిరాన్ని నిర్మించి అమ్మవారి ముఖభాగమే ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేపడతాడు. అనంతరం వంతెన పనులు చకచక పూర్తవుతాయి. ఇప్పటికీ ఈ వంతెన అమ్మవారి మందిరానికి సమీపంలో ఉంది. అప్పటి నుంచి అమ్మవారి ముఖభాగమే భక్తులకు దర్శనం ఇస్తుండటం ఇక్కడి విశేషం. ఇదిలాఉండగా అమ్మవారికి సమీపంలో అమ్మవారి పాదాల గుడి కూడా ఉంది. అదేవిధంగా నడుం భాగం మందిరానికి కొద్ది దూరంలో ఉంది. దీనినే జెన్నా బౌలిగా కొలుస్తుంటారు. రూ.15లక్షలతో ఉత్సవాలు అమ్మవారి చైత్రోత్సవాలకు ఈ ఏడాది రూ.15 లక్షలు వెచ్చించనున్నారు. ఏటా లాగానే గంజాం జిల్లా కవిసూర్యనగర్కు చెందిన జ్యొతిష్య పండితులు నీలమాధవ త్రిపాఠి శర్మ బృందంతో పూజా కార్యక్రమాలను నిర్వహించనుంది. చండీ హోమం, సూర్యపూజ, నిత్య ఆరాధన వంటి పూజలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రూ.30 కోట్లతో అభివృద్ధి అమ్మవారి మందిరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలి్పంచేందుకు ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులను కేటాయించింది. అందుకు పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే టెండర్లను ఆహా్వనించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయితే అమ్మవారి మందిరం రూపురేఖలే మారనున్నాయి.
ఫొటోలు


రామ్ చరణ్ తో పెళ్లి బంధం సీక్రెట్ రివీల్ చేసిన ఉపాసన.. వారంలో ఒక రోజు తప్పనిసరి! (ఫోటోలు)


కాబోయే భర్తతో కలిసి అభినయ బ్యాచ్‌లరేట్ పార్టీ (ఫోటోలు)


పట్టుచీర, నగలతో స్నేహ లుక్ అదిరిందిగా (ఫోటోలు)


చీర కట్టు.. చిరునవ్వుతో మదిని దోచేస్తున్న పూనమ్ బజ్వా (ఫోటోలు)


విజయ్ దేవరకొండ నాన్న వర్ధన్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన టీమ్ (ఫోటోలు)


చీరకట్టులో కుందనపు బొమ్మలా కవ్విస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోస్


చీరలో మెరిసిపోతున్న నాగిని భామ మౌనీ రాయ్ (ఫోటోలు)


అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఇలా..(ఫొటోలు)


కొప్పున గులాబీలు, నుదుటిపై బొట్టుతో తమన్నా భాటియా (ఫోటోలు)


గోల్డెన్ ఏంజెల్ లా మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
వాషింగ్టన్: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్‌తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్‌చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్‌కు చేరుకున్నాక ‘ఎక్స్’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్‌చేశారు.పవర్ బ్యాంక్‌పై అనుమానంతో.. ‘‘ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు నా హ్యాండ్‌బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్ పవర్‌బ్యాంక్ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్‌కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు. నా ఖరీదైన లగేజీ బ్యాగ్‌ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్‌కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పోస్ట్‌ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. ‘ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్‌పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025

కనీస వేతనాలను పెంచిన కెనడా
టొరంటో: కెనడాలో జీవనవ్యయం విపరీతంగా పెరిగిన వేళ ప్రజలకు కాస్తంత ఊరటనిచ్చే నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం తీసుకుంది. ప్రైవేట్ రంగంలో కనీస వేతనాలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో ఉన్నత విద్య కోసం కెనడాకు వచ్చి తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే భారతీయ విద్యార్థులకు లబి్ధచేకూరనుంది. ప్రస్తుతం ప్రతి గంటకు 17.30 కెనడియన్ డాలర్ల చొప్పన కనీస వేతనం చెల్లిస్తుండగా ఇకపై 17.75 కెనడియన్ డాలర్లను చెల్లించనున్నారు. కొత్త వేతనాలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చదువుకుంటూనే చిరుద్యోగాలు చేస్తూ సంపాదించే భారతీయ విద్యార్థుల ఆర్థిక కష్టాలు కొంతమేర తగ్గనున్నాయి.‘‘ఆదాయ అసమానతలను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఫెడరల్ కనీస వేతనాలను పెంచుతున్నాం. దీంతో వ్యాపారాలు, పరిశ్రమల్లో కార్మికులకు స్థిరాదాయం కొంతైనా పెరుగుతుంది. మరింత పారదర్శకమైన ఆర్థికవ్యవస్థను నిర్మించే క్రమంలో మేం మరో అడుగు ముందుకేశాం’’అని కెనడా ఉపాధి, కార్మికాభివృద్ధి, శ్రామికుల మంత్రిత్వ శాఖ మంత్రి స్టీవెన్ మ్యాకినన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సంస్థలన్నీ తమ ఉద్యోగుల జీతభత్యాల జాబితాలను పెంచిన కనీస వేతనాలకు అనుగుణంగా వెంటనే సవరించాలని ఆదేశించాం. ఇంటర్మ్లు సహా ఉద్యోగులు, కార్మికులందరికీ సవరించిన కనీస వేతనాలు అందేలా చూస్తాం’’అని ఆయన అన్నారు. కెనడాలో గత ఏడాది వినియోగదారుల ధరల సూచీ వార్షిక సగటును ఆధారంగా చేసుకుని ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన కనీస వేతనాల సవరణ విధానాన్ని అమలుచేస్తారు. తగ్గనున్న స్థానికుల కష్టాలు పెరిగిన జీవన వ్యయంతో కెనడాలోని మధ్యతరగతి స్థానికులకు ఆహార కష్టాలు పెరిగాయి. ఇన్నాళ్లూ వీళ్లలో చాలామంది స్థానికంగా ఉచితంగా ఆహారం అందించే ఫుడ్‌బ్యాంక్‌ల మీదనే ఆధారపడ్డారు. ఉన్నత విద్య కోసం వచ్చిన విదేశీ విద్యార్థులు సైతం కాస్త డబ్బును ఆదా చేసుకునేందుకు ఈ ఉచిత ఫుడ్బ్యాంక్లనే ఆశ్రయిస్తారు. అయితే గత ఏడాది విదేశీ విద్యార్థులు వెల్లువలా పోటెత్తడంతో లక్షలాది మందికి ఉచితంగా ఆహారం అందించడం తమ వల్లకాదని ఫుడ్‌బ్యాంక్‌లు చేతులెత్తేశాయి. దీంతో ఎంతో మంది విదేశీ విద్యార్థులు ఖాళీ కడుపులతో ఫుడ్‌బ్యాంక్‌ల నుంచి వెనుతిరిగారు.ఇప్పుడు కనీస వేతనాలు పెరిగిన నేపథ్యంలో స్థానిక కెనడియన్ల నిత్యావసరాల కొనుగోలు శక్తి కాస్తంత పెరిగింది. దీంతో ఇప్పుడు వీళ్లంతా మునపటిస్థాయిలో ఫుడ్బ్యాంక్లను ఆశ్రయించకపోవచ్చు. దాంతో విదేశీ విద్యార్థులకు మళ్లీ ఫుడ్బ్యాంక్లలో ఉచిత ఆహారం లభించే అవకాశాలు మెరుగుపడనున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం అనేది జస్టిన్ ట్రూడో ప్ర భుత్వానికి పెద్ద సమస్యగా తయారవడం తెల్సిందే. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ధరల అంశమే ప్రధానంకానుంది. కనీస వేత నం 2.4 శాతం పెరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయులకూ లబ్ధి చేకూరనుంది.కెనడా జనాభాలో 3.7 శాతం భారతీయులేకెనడా జనాభాలో 3.7 శాతం భారతీయులే ఉన్నారు. గత ఏడాది కెనడావ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగాలు చేసిన వారిలో 22 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇలా తాత్కాలిక(గిగ్) ఆర్థికరంగంలో భారతీయులు కీలకంగా ఉన్నారు. కెనడాలో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న వారిలో అత్యధిక మంది వలసదారులే. 2005 ఏడాది నుంచి 2020 ఏడాదిదాకా గమనిస్తే కెనడా కార్మికుల్లో తాత్కాలిక కార్మికుల వాటా 5 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. వీళ్లుగాక కెనడాలో ఉన్న దాదాపు 13.5 లక్షల మంది తాము భారతీయ మూలాలున్న వ్యక్తులమని వెల్లడించడం విశేషం.ముఖ్యంగా భారతీయులు రిటైల్, హెల్త్‌కేర్, నిర్మాణం, ఇతర రంగాల్లో పనిచేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు మాత్రమేకాదు ఇంటర్మ్లుగా పనులు చేసుకుంటున్న భారతీయ విద్యార్థులకు సైతం ఈ కనీస వేతన లబ్ధి ప్రయోజనాలు దక్కనున్నాయి. భారత్ నుంచి ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, వ్యాపారాలు, ఇంజనీరింగ్, హెల్త్‌సైన్సెస్, ఐటీ రంగాల్లో విద్యనభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు కెనడాకు వస్తున్నారు. చదువు పూర్తయ్యాక ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, వాణిజ్య, వ్యాపార రంగాల్లో ఉద్యోగులుగా కెనడాలోనే స్థిరపడుతున్నారు. భారతీయ విద్యార్థులు విద్య రూపంలో, తాత్కాలిక ఉపాధి, వస్తూత్పత్తుల వినియోగం ఇలా అన్నింటిలో కలిపి 2021 ఏడాదిలో కెనడా ఆర్థికవ్యవస్థకు 4.9 బిలియన్ కెనడియన్ డాలర్లమేర లబి్ధచేకూర్చారు. కెనడాకు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ.

ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
వాషింగ్టన్: దేశం నుంచి బలవంతంగానైనా పంపేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నాక ఆపడం ఎవరితరం కాదనే వాస్తవం ఇప్పుడు అమెరికాలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. విదేశీ విద్యార్థులు ఏ చిన్న పొరపాటు అనుకోకుండా చేసినా ప్రభుత్వం వారిపై ‘వీసా రద్దు’ కత్తి దింపుతోంది. వెంటనే వీసా గడువును ముగించేసి స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలిస్తోంది. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాన్ని సైతం వీసా రద్దుకు సాకుగా చూపుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏ నిమిషంలో వీసా రద్దు ఈ–మెయిల్ వస్తుందోనన్న భయంతో అక్కడి విదేశీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పారిపోయిన, జాడ దొరకని ఉగ్రవాదిని అత్యవసరంగా వెతికిన చందంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తోంది. దీనిపై ఎంతటి విమర్శలు వెల్లువెత్తుతున్నా విదేశీ విద్యార్థుల బహిష్కరణ పర్వానికి ప్రభుత్వం తెరదించట్లేదు. దీంతో ఇప్పటికే గాజా అనుకూల ర్యాలీలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు, ఆ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేసినా, షేర్ చేసిన, అనుకూలంగా స్పందించిన విదేశీ విద్యార్థుల కంటిపై కనుకులేకుండా పోయింది. ఏ నిమిషంలో వీసా రద్దవుతుందోనన్న ఆందోళన సంబంధిత విదేశీ విద్యార్థుల్లో ఎక్కువైంది. సంబంధిత వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ ఒక నివేదిక వెల్లడించింది. మా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి తమ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చాలా మంది వీసాలు హఠాత్తుగా రద్దయ్యాయని అమెరికాలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు తాజాగా వెల్లడించాయి. ఇలా వీసా రద్దును ఎదుర్కొన్న వారిలో భారతీయ విద్యార్థులూ ఉన్నారు. అయితే పాలస్తీనా అనుకూల ఘటనలతో ఎలాంటి సంబంధం లేని విద్యార్థులకు సైతం వీసా రద్దు ఈ–మెయిల్స్ రావడం గమనార్హం. ఇలాంటి విద్యార్థులను అమెరికాలో గతంలో చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాలను సాకుగా చూపి దేశ బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇంకొంత మంది విద్యార్థులకు వీసా ఎందుకు రద్దు చేస్తున్నామని కనీస కారణాన్ని కూడా ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొనకపోవడం దారుణమని కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. డేటాబేస్ చూశాకే మాకూ తెలిసొచి్చంది అసలు ఎవరెవరి వీసాలు రద్దయ్యాయని వివరాలు సైతం ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టంగా పేర్కొనట్లేరు. దీనిపై హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, మిషిగన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలెస్, ఒహాయో స్టేట్ వర్సిటీల అధికారులు స్పందించారు. ‘‘ మా కాలేజీల్లోని కొందరు విద్యార్థుల వీసాలు సైతం రద్దయ్యాయి. అమెరికావ్యాప్తంగా స్టూడెంట్ వీసాల గడువును అకస్మాత్తుగా కుదిస్తున్న నేపథ్యంలో ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్‌ను యథాలాపంగా చెక్‌చేశాం. అందులో మా కాలేజీల విద్యార్థుల పేర్లు కూడా కనిపించడంతో ఆశ్చర్యపోయాం.ఎందుకు రద్దుచేశారని తెల్సుకునేందుకు ప్రయత్నిస్తే ఇమిగ్రేషన్ విభాగం నుంచి సరైన స్పందన కరువైంది’’ అని ప్రముఖ వర్సిటీల అధికారులు వెల్లడించారు. భారతీయ విద్యార్థులు ఎలాంటి గాజా, పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొనకపోయినా కొందరి వీసాల గడువును ప్రభుత్వం పూర్తిగా ముగించేసి స్వదేశానికి వెళ్లిపోవాలని సందేశాలు పంపించింది. అమెరికా వ్యతిరేక భావజాలమున్న విద్యార్థులను ఏరివేసేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ఖాతాలను జల్లెడ పడుతోందని యాక్సికోస్ అనే సంస్థ వెల్లడించింది. హమాస్ అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులు పెట్టినా, అలాంటి పోస్ట్‌లను లైక్చేసినా, షేర్ చేసినా అలాంటి వారిని గుర్తించే పనిలో ప్రభుత్వం మునిగిపోయిందని యాక్సికోస్ నివేదించింది.

చైనాపై మరో 50%
బీజింగ్/వాషింగ్టన్: ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం. మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు. కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. ఈయూ ప్రతీకార సుంకాలు 25 శాతం బెల్జియం: అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు యూరోపియన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. కొన్ని వస్తువులపై మే 16 నుంచి, మరికొన్నింటిపై డిసెంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.భారత్‌పైనా నేటినుంచే!ప్రపంచ దేశాలపై ట్రంప్ ఇటీవల విధించిన టారిఫ్‌ల అమలులో ఆలస్యం, డెడ్‌లైన్ పొడిగింపు వంటివేమీ ఉండబోవని లెవిట్ కుండబద్దలు కొట్టారు. భారత్‌తో పాటు 70పై చిలుకు దేశాలపై ఏప్రిల్ 2న ట్రంప్ ఎడాపెడా అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దాంతో భారత్‌పై 26 శాతం సుంకాలతో పాటు ఆయా దేశాలపై విధించిన టారిఫ్‌లు కూడా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచే అమల్లోకి రానున్నాయి. ‘‘ట్రంప్ టారిఫ్‌లు పని చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాతో చర్చల కోసం 70కి పైగా దేశాలు ఇప్పటికే ముందుకొచ్చాయి’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాకు లాభదాయకంగా ఉంటేనే ఏ చర్చలైనా ఫలిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
జాతీయం

ట్రంప్ టారిఫ్.. భారత ప్రతీకార సుంకాలు అనుమానమే!
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో.. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి కేబినెట్ భేటీని కీలకంగా భావిస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో.. అమెరికా , భారతీయ ఉత్పత్తులపై విధించిన సుంకాల పై కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు, ఆటోపార్ట్స్‌పై సుంకాల ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే.. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం.. WTO వద్ద సమస్యను లేవనెత్తే దిశగా ఆలోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే.. ప్రతిస్పందనగా భారత్ తరఫున కొంతమేర కౌంటర్ టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందా? అనే దానిపై విస్తృతంగా చర్చించనుందని సమాచారం. అయితే, అవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోందని భోగట్టా. అలాగే.. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక అమెరికా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు కల్పించేలా ఆదాయ పరంగా వెసులుబాట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రభుత్వంతో ఉన్న చర్చలను వేగవంతం చేసే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమ దేశంపై ట్రంప్ 104 శాతం సుంకాల విధింపును అన్యాయంగా పేర్కొంటున్న చైనా.. అగ్రరాజ్య ప్రాధాన్యతను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామంటూ భారత్‌కు ప్రతిపాదన చేసింది. అయితే కేబినెట్ భేటీలో చైనా ప్రతిపాదన అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. తాజాగా మరో 16 శాతం నేటినుంచి అమలవుతోంది. తనకు భారత ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని టారిఫ్‌ల విధింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. తాము అందులో సగమే విధిస్తున్నామని ఆయన చెప్పారు.

108 దేశాల్లో ‘నవకార్ మహామంత్ర పఠనం.. పాల్గొన్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నవకార్ మహామంత్రం పరమ పవిత్రమైనదని, దీనిని సామూహికంగా పఠించడం వలన ప్రపంచ శాంతి, సామరస్యాలు సమకూరుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈరోజు(బుధవారం) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ‘నవకార్ మహామంత్ర దివస్’(Navkar Mahamantra Day)లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.Come, let’s all chant the Navkar Mahamantra together at 8:27 AM! णमो अरिहंताणं...णमो सिद्धाणं...णमो आयरियाणं...णमो उवज्झायाणं...णमो लोए सव्वसाहूणं...Let every voice bring peace, strength and harmony. Let us all come together to enhance the spirit of brotherhood and…— Narendra Modi (@narendramodi) April 9, 2025ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(Prime Minister Modi) నవకార్ మహామంత్రానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇది జైనమతంలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణిస్తారని, ఇది ప్రపంచ శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనమంతా శాంతి, మానసిక శక్తి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ‘నవకార్ మహామంత్ర దివస్’ మహావీర జయంతికి ఒక రోజు ముందు నిర్వహిస్తుంటారు. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన పౌరులు నవకార్ మహామంత్రాన్ని సామూహికంగా జపించారు. ఇది ప్రపంచ ఐక్యత, ఆధ్యాత్మిక జాగృతిని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిలిచింది. ఈ మంత్రం జైనమతం(Jainism)లోని ఐదు ప్రధాన ఆరాధనా విభాగాలైన అరిహంతులు (మోక్షం పొందిన ఆత్మలు), సిద్ధులు (పరిపూర్ణ జ్ఞానం పొందినవారు), ఆచార్యులు (ఆధ్యాత్మిక గురువులు), ఉపాధ్యాయులు (ఉపదేశకులు),సాధువులు (సన్యాసులు)కు మనమిచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలలో ఏకకాలంలో జరిగింది. భారతదేశంలో 6,000 ప్రదేశాలలో ఈ ఉత్సవం నిర్వహించారు. దీనిని జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) ఆధ్వర్యంలో నిర్వహించారు.ఇది కూడా చదవండి: పాక్‌లో వైశాఖీ ఉత్సవం.. 6,500 భారతీయులకు వీసాలు జారీ

మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట
బెంగళూరు: ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్పూర్ తాలుకా జాలిబెంచి(Jalibenchi village) అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలే అందుకు కారణం.విద్యుత్ సరఫరాలో కలిగిన అంతరాయం.. ఏకంగా ఒక ఊరినే వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో కరెంట్ వైర్లు ఒకదానికొకటి రాజుకుని.. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలిపోయాయి. సెల్ఫోన్లు పేలిపోయాయి. కరెంట్ స్తంభాల నుంచి వైర్లు ఇళ్ల పైకప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలతో భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు.సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో విద్యుత్ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.సుమారు వంద ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గులబర్గ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానిక చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లను పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.Shocking, terrible video!!A tragic incident unfolded in Jalibenchi village of Surpur taluk on Tuesday around 6 PM, as powerful winds caused an electricity-related accident, plunging the area into chaos and fear.Cc @OfficialGescom pic.twitter.com/VCQXLqQymW— Nishkama_Karma (@Nishkama_Karma1) April 8, 2025

26/11 మాస్టర్‌మైండ్ తహవ్వూర్ రానా రాక.. ఢిల్లీ, ముంబై జైళ్లలో ఏర్పాట్లు?
న్యూఢిల్లీ: మహానగరం ముంబైలో 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన మాస్టర్‌మైండ్ తహవ్వూర్ రానా(Mastermind Tahavvoor Rana) నేడు (ఏప్రిల్ 9) భారత్‌కు చేరుకోనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలోని జైళ్లలో రహస్యంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో పేర్కొన్న వివరాల ప్రకారం అమెరికా న్యాయ వ్యవస్థ సిఫారసులకు అనుగుణంగా ఢిల్లీ, ముంబైలోని జైళ్లలో ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారని సమాచారం. తహవ్వూర్ రానా తొలుత కొన్ని వారాలపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency) (ఎన్ఐఏ) అదుపులో ఉండే అవకాశం ఉంది. ఈ ఏజెన్సీ కార్యకలాపాలను జాతీయ భద్రతా సలహాదారు ఎ.కె. దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. తహవ్వూర్ రానా పాకిస్తానీ-కెనడియన్ వ్యక్తి. లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ) సంస్థలో చురుకైన సభ్యుడు.తహవ్వూర్ రానా తన సహచర ఉగ్రవాది, పాకిస్తానీ-అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ (అలియాస్ దావూద్ గిలానీ)కి పాస్‌పోర్ట్‌లు సమకూర్చాడు. హెడ్లీ భారత్‌లో తమ లక్ష్యాలను ఎంచుకునేందుకు ఈ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి దేశంలోకి ప్రవేశించాడు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఈ దాడులపై రానా సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు కారకులైన ఉగ్రవాదులకు వారి మరణానంతరం పాకిస్తాన్ అత్యున్నత సైనిక గౌరవాన్ని ఇవ్వాలని పేర్కొన్నాడు.26/11 దాడుల్లో పాల్గొన్న లష్కర్ ఉగ్రవాది అజ్మల్ కసబ్(Ajmal Kasab)ను విచారణ అనంతరం 2012లో ఉరిశిక్ష అమలు చేశారు. గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉగ్రవాది తహవ్వూర్ రానా భారత్‌కు అప్పగింతను ధృవీకరించారు. ఈ అప్పగింత 2019 నుండి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా జరిగింది. 2019 డిసెంబర్లో భారత్.. అమెరికాను తహవ్వూర్ రానా అప్పగింత కోరింది. దీనితో అతని అప్పగింతకు మార్గం సుగమం అయింది. తహవ్వూర్ రానా భారత్‌కు చేరుకున్న తర్వాత అతనిని తీహార్ జైలులో ఉంచే అవకాశం ఉందని, అక్కడ ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ట్రంప్ సుంకాలపై భారత్- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు
ఎన్ఆర్ఐ

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
కాకినాడ రూరల్: నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను.. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.. నావల్ల ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. పెళ్లిచేసి టార్చర్ పెట్టారు. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడది, వంద జన్మలెత్తినా అలాంటి దానికి పుట్టకూడదని కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయికి అన్యాయం చేశాను. నన్ను, నా భార్యను మానసికంగా వేధించారు. నిజంగా నేను వారికి పుట్టానో లేదో తెలీదు. ఇవీ.. కాకినాడ శశికాంత్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దాకారపు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్ (39) సెల్ఫీ వీడియోలోని మాటలు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య పాప, పోలీసుల వివరాల ప్రకారం.. వాటా లేదంటూ ఇంట్లోంచి పొమ్మన్నారు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్‌కు తామరాడకు చెందిన యువతి పాపతో 2021 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. పాప టీసీఎస్‌కు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో ఉద్యోగం చేస్తూ కాకినాడలో తన తండ్రి ఇంట్లో ఉంటున్నారు. ప్రసాద్‌కు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో భార్య సంపాదనతో ఇద్దరు అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వాటాలేదని, జగ్గంపేట మండలం మల్లిసాలలో ఉన్న స్కూల్లోనూ వాటాలేదని చెప్పడమే కాక తన ఇంట్లో ఉండవద్దని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీరామమూర్తి చెప్పడంతో పాటు ప్రసాద్, పాపలను ఇంటి నుంచి పొమ్మన్నారు. దీంతో పాప తండ్రి ఇంట్లో అద్దె చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. ఈనెల 3న చనిపోతానని పాపతో పాటు ఆమె అన్నయ్యకు ప్రసాద్ వీడియో పెట్టడంతో వారు కంగారుపడి అదేరోజు తామరాడ తీసుకొచ్చారు. మరుసటి రోజు బయటకెళ్లి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడంలేదని భార్యకు ఫోన్లో చెప్పి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనారోగ్యంతో రిసెప్షనిస్టు మౌనిక ఆత్మహత్య
చౌటుప్పల్(నల్గొండ): అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఫుడ్ పాయిజన్‌తో తల్లీకొడుకుల మృతి
రుద్రంగి (వేములవాడ): ఫుడ్ పాయిజన్‌తో గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహాల్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదుకాగా పుష్పలత, నిహాల్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పుష్పలత అన్న పాలెపు శ్రీనివాస్ రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫి ర్యాదు చేశాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని.. వాటిని మనసులో పెట్టుకొని పుష్ప లత అత్తగారి కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని పాలెపు శ్రీనివాస్ కోరారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రుద్రంగి ఎస్సై అశోక్ తెలిపారు.

యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్‌లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్‌మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్‌లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్‌కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్‌లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీడియోలు


జగన్ భద్రతపై కుట్ర క్లియర్ కట్


జగన్ భద్రతపై అనిత వ్యాఖ్యలకు అంబటి దిమ్మదిరిగే కౌంటర్


అసలు నువ్వు నిజంగా చదువుకున్నావా..? పవన్ పై నిప్పులు చెరిగిన వలంటీర్


YS జగన్ భద్రత వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలకు నీళ్లునమిలిన అనిత


ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం


పవన్ కుమారుడి ఆరోగ్య పరిస్థితి ఇది


Gadikota Srikanth Reddy: లింగయ్యని కిరాతకంగా చంపుతుంటే ఏం చేశారు


తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్ కు కేబినెట్ ఆమోదం


Amaravathi: రైతుల భూముల్లో నారా ప్యాలెస్


రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది: హరీశ్