నగరంలోని పందులను తరలించాల్సిందేనని నగర మేయర్ రవీందర్‌సింగ్ పందుల పెంపకందారులకు సూచించారు. తన కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ పందులను రోడ్లపై వదలడం సరికాదని, గొర్రెలు, ఆవులు, కోళ్లకు ఏర్పాటు చేసినట్లే ఫాంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
-
స్మార్ట్‌సిటీకి అవరోధం కలిగించొద్దు
-
పందుల పెంపకందార్లతో మేయర్
కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలోని పందులను తరలించాల్సిందేనని నగర మేయర్ రవీందర్‌సింగ్ పందుల పెంపకందారులకు సూచించారు. తన కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ పందులను రోడ్లపై వదలడం సరికాదని, గొర్రెలు, ఆవులు, కోళ్లకు ఏర్పాటు చేసినట్లే ఫాంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకోవాలంటే పందుల తరిలింపు ఒక్కటే మార్గమన్నారు. పందులు సంరక్షణకు ఇతర మార్గాలను ఆలోచించుకోవాలని తెలిపారు. ఊరిబయటకు పందులను తరలించాలని సూచించారు. పందులను తీసివేయాలంటే తమకు ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఊరు బయట స్థలాలు చూపించి షెడ్లు వేసివ్వాలని పందుల పెంపకందారులు కోరారు. స్థలం కోసం ఎమ్మెల్యే, కలెక్టర్‌తో మాట్లాడతామని మేయర్ వెల్లడించారు. కార్పొరేటర్లు ఆరిఫ్, పిట్టల శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, వై.సునీల్‌రావు, నాయకులు కట్ల సతీష్, ఎడ్ల అశోక్, సాదవేని శ్రీనివాస్, అదనపు కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు పరిశీలన
5వ డివిజన్‌లో పారిశుధ్య పనులను శుక్రవారం మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. పనులను గ్యాంగ్‌లుగా విడిపోయి చేయాలని సిబ్బందికి సూచించారు. ఒక్కో ఏరియాను శుభ్రం చేసి మళ్లీ అక్కడ పని ఉండకుండా చూసుకోవాలన్నారు.