
ఆడశిశువును పీక్కుతిన్న పందులు
హన్మకొండ: వరంగల్ జిల్లాలో హన్మకొండలోని పద్మాక్షి కాలనీలో గురువారం ఓ ఘోరం వెలుగుచూసింది. ఆడపిల్ల తమకు భారమనుకున్నారో లేక అధిక కట్నాలిచ్చి పెళ్లి చేయలేమని భావించారో తెలియదు కానీ ముక్కుపచ్చలారని ఓ పసికందును వీధిపాలుచేశారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఆ పసిగొడ్డును వీధిలోని చెత్తకుండిలో విసిరేయడంతో పందులు పీక్కుని తిన్నాయి. రోడ్డుపక్కన నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన పసిగుడ్డును పందులు పీక్కుతింటుండగా స్థానికులు చూశారు. పందులను అక్కడినుంచి తరిమేసి చూడగా అప్పటికే శిశువు చనిపోయి ఉంది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.