సవాల్ చేయగలరా...?
సెల్ఫ్ చెక్
సవాల్‌కు ప్రతిసవాల్ విసిరితేనే థ్రిల్‌గా ఉంటుంది. ‘‘నేను తలచుకుంటే రేపటికల్లా ఆ పని పూర్తిచేయగలను... పందెం ఎంత?... నువ్వు ఈ పనిచేయగలవా?’’ ఇలాంటి డైలాగులు చాలెంజ్ చేసినప్పుడే వస్తాయి. జీవితాన్ని సవాలుగా తీసుకొనేవారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. సవాల్ చేయటం తెలియనివారు ప్రశాంతంగా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉంటారు. అలాగని మూర్ఖమైన పనుల కోసం చాలెంజ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. మంచిపనుల కోసమే సవాలు చేయాలి. చాలెంజింగ్‌గా బతకటం మీకిష్టమేనా?
1. మీలో ఆవేశం ఎక్కువగా ఉన్నా దాన్ని నియంత్రించుకోగలరు. ప్రశాంతంగానే మీరనుకున్నది సాధిస్తారు.
ఎ. అవును బి. కాదు
2. ఆటలంటే చాలా ఇష్టం. ఆటలపోటీలు ఎక్కడ జరిగినా పాల్గొంటారు.
ఎ. అవును బి. కాదు
3. ‘‘ఈ పనెందుకు చేయాలి, దీనివల్ల లాభం ఏమిటి’’ అని ఎవరైనా అంటే కోప్పడతారు. ఆ పనిని ఎందుకు చేయాలనుకుంటున్నారో వివరిస్తారు.
ఎ. అవును బి. కాదు
4. ఎవరైనా మీతో చాలెంజ్ చేస్తే మీరూ దానికి సిద్ధపడతారు. లైఫ్‌లో థ్రిల్‌గా ఉండటమంటే మీకిష్టం.
ఎ. అవును బి. కాదు
5. ఉత్సాహంగా ఉంటారు. జీవితాన్ని కష్టంగా భావించరు. ఆశావహదృక్పథంతో ఉంటారు. లోపాలను చూసి కుంగిపోరు.
ఎ. కాదు బి. అవును
6. పోటీతత్వంతో ఉంటారు. ఓటమిని తేలికగా ఒప్పుకోరు. గెలిచే దాకా ప్రయత్నిస్తూనే ఉంటారు.
ఎ. అవును బి. కాదు
7. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. సవాలు లేని జీవితం నిస్సారమైనదని భావిస్తారు.
ఎ. అవును బి. కాదు
8. ఖాళీగా ఉండటమంటే మీకు నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటారు. ప్రతి పనిలో ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తారు.
ఎ. అవును బి. కాదు
9. ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటారు. మీ పనికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే అసలు క్షమించరు. ఇలా విజయావకాశాలను సులువు చేసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
10. స్పోర్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత విమర్శలకు దిగరు. మొదలు పెట్టిన పనిని ఎప్పుడూ సగంలో వదలరు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఎనిమిది వస్తే చాలెంజ్ చేయటమంటే మీకు ఇష్టం. అందరిలో అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. దీనివల్ల మీ మనసు ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. వివిధ రకాల కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. ప్రతి పనిలో చాలెంజింVŠ గా ఉండాలనుకోకుండా, అవసర విషయాల్లోనే బెట్ కట్టండి. పాజిటివ్ విషయాల్లోనే చాలెంజ్ చేయండి. రీచ్ యువర్ యాంబిషన్స్ విత్ సేమ్ స్పిరిట్, ఆల్ ద బెస్ట్. ‘బి’ లు ఎక్కువగా వస్తే జీవితంలో పెద్దగా రిస్క్ తీసుకోరు. ఉన్నది చాలనుకుంటూ, నవ్యతకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటారు.