పందెం ఓడాడు.. పేద్ద పేరొచ్చింది | man adopts 99-character name after losing drunken bet | Sakshi
Sakshi News home page

పందెం ఓడాడు.. పేద్ద పేరొచ్చింది

Published Tue, Mar 11 2014 5:18 PM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

man adopts 99-character name after losing drunken bet

మెల్బోర్న్: పందేలు కాయడానికి డబ్బులు, వస్తువులే కాదు వ్యక్తిగత అంశాలూ ఫణంగా పెడుతుంటారు. ఓడిపోతే పేరు మార్చుకుంటానని శపథం చేస్తుంటారు. న్యూజిలాండ్కు చెందిన ఓ పేకాట రాయుడు ఇలాంటి పందెమే కాశాడు. పోకర్ గేమ్ (పేకాట)లో ఓడిపోతే తన పేరు మార్చుకుంటాని మద్యం మత్తులో స్నేహితులతో సవాల్ చేశాడు. అన్నంత పనీ అయింది. జూదంలో ఓడిపోవడంతో అతనికి ఓ పేద్ద పేరు పెట్టారు. మొత్తం 99 అక్షరాలతో చాంతాడంత ఉంది. ఫ్రస్నోవా కాస్తా  'Full Metal Havok More Sexy N Intelligent Than Spock And All The Superheroes Combined With Frostnova'గా మారిపోయాడు. వినడానికి తమాషాగా ఉన్నా పాపం.. అతనికి తప్పలేదు. ఇప్పుడు ఇదే పేరు సార్థకమైపోయింది(!).

ఐదేళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది. న్యూజిలాండ్లో వంద అక్షరాల వరకు పేరు పెట్టుకోవచ్చు. ఈ కొత్త పేరులో ఓ అక్షరం మాత్రమే తక్కువ. అప్పట్లో ఫీజు చెల్లించి ఈ పేరును రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. కాగా ఫ్రస్నోవా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులు గడువు ముగిసింది. కొత్త పేరుతో రెన్యువల్ చేయించాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement