సాక్షి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా: రానున్న ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనుంది. గత ఏడాది వరంగల్‌లో నిర్వహించిన సభలో రాహుల్‌గాంధీ ‘రైతు డిక్లరేషన్’ప్రకటించిన విధంగానే.. సోమవారం సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ‘యువ సంఘర్షణ సభ’లో ప్రియాంకా గాంధీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించనున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4వేల చొప్పున భృతి ఇస్తామని ప్రకటించనున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య నిరుద్యోగులు 60 లక్షల మంది ఉంటారని.. అందులో 25 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారనే అంచనా మేరకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రకటనలు చేయాలని నిర్ణయించామని వెల్లడించాయి. విద్య–ఉత్పాదకత సృష్టి ద్వారా చదువుకున్న అందరికీ వారి విద్యార్హతల మేరకు ఉపాధి కల్పింస్తామనే హామీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నా యి. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ పనితీరును తీర్చిదిద్దుతామని, ఏటా జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని భరోసా కల్పించనున్నట్టు తెలిపాయి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు టెలి కమ్యూనికేషన్స్ మాజీ ఇంజనీర్ శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘నాలెడ్జ్ సొసైటీ’అధ్యయన నివేదిక మేరకు.. విద్య, ఉపాధి రంగాల్లో రాష్ట్ర యువతకు పలు వరాలు ప్రకటిస్తామని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
విద్యా రంగంలోనూ ‘భరోసా’
ఉపాధి కల్పనతోపాటు విద్యా రంగంలో భరో సా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీ, ఈబీసీలకు పూర్తిస్థాయి లో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని.. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఐఐటీ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించనుంది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో సర్వేల్ గురుకులాన్ని ఏర్పాటు చేసి.. రెసిడెన్షియల్ విద్యకు శ్రీకారం చుట్టినది కాంగ్రెస్ పారీ్టనేనని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థను మెరుగైన సౌకర్యాలతో నడిపిస్తామని హామీ ఇవ్వనున్నట్టు తెలిపాయి. మొత్తమ్మీద యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకునే దిశలో ప్రియాంకా గాంధీ ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనున్నట్టు వెల్లడించాయి.
అమరవీరుల కుటుంబాలకు పింఛన్లు
తెలంగాణ కోసం తనువు చాలించిన అమరవీరుల కుటుంబాలకు ప్రియాంకా గాంధీ సభలో భరోసా కలి్పంచనున్నట్టు టీపీసీసీ నేతలు చెప్తు న్నారు. తొలి, మలిదశ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి నెలవారీ పింఛన్ ఇస్తామని హామీనివ్వనున్నట్టు చెబుతున్నారు.
సాయంత్రం 4 గంటలకు రానున్న ప్రియాంక
కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4కి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకుంటారు. 5:45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. 6.30 సమయంలో ఢిల్లీ బయలుదేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
సభకు ఏర్పాట్లు పూర్తి..
సభ కోసం టీపీసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువ నాయకులు మానవతారాయ్, చరణ్ కౌశిక్, మహ్మద్ రియాజ్, చెనగోని దయాకర్, బాలలక్ష్మి, చారగొండ వెంకటేశ్ రెండురోజులు గా సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరు లు సభ ఏర్పాట్లను పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి దేప భాస్కర్‌రెడ్డి సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 50మంది కూర్చొనేలా విశాల వేదికను ఏర్పాటు చేశారు. స్టేజీ ముందు భాగంలో వీఐపీలకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
‘నిరుద్యోగ ర్యాలీ’.. ట్రాఫిక్ మళ్లింపులు
వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు కాంగ్రెస్ ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ర్యాలీ నిర్వహించనుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ ర్యాలీలో, సరూర్‌నగర్ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరూర్‌నగ ర్, ఎల్బీనగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నా యి. విజయవాడ హైవే, సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఇటు చంపాపేట వైపు, అటు నాగోల్ వైపు మళ్లించనున్నారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్ నుంచి నాగోల్ వైపు మళ్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment