Saroornagar Honour Killing: Muslim Thinker's Reaction on Saroornagar Murder Case - Sakshi
Sakshi News home page

Saroornagar Honour Killing: ఆ హత్యను ఖండిస్తున్నాం

Published Sat, May 7 2022 12:49 PM | Last Updated on Sat, May 7 2022 1:17 PM

Muslim Thinkers Dias Condemn Honour Killing in Saroor Nagar - Sakshi

ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారన్న ఆక్రోశంతో దళితుడైన నాగరాజును ఆమె బంధువులు హత్య చేయడాన్ని ముస్లిం ఆలోచనాపరులం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా చూసినా ఈ చర్య అమానుషమైనది. మరీ ముఖ్యంగా ఇస్లామిక్‌ విలువలకు పూర్తిగా విరుద్ధమైనది. తీవ్రంగా వివక్షకు గురైన నల్లజాతి వారిని హృదయానికి హత్తుకున్న మొహమ్మద్‌ ప్రవక్త ఆదర్శానికి వ్యతిరేకమైనది. కులాన్ని పాటించడమంటే పవిత్ర ఖురాన్‌ను నిరాకరించడమే! ముస్లిం సమాజం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.

నాగరాజు కుటుంబానికి మేము తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ విషమ సమయంలో తీవ్ర బాధితురాలైన ఆశ్రీన్‌ సుల్తానా గుండె నిబ్బరంతో ఉండాలని కోరుతున్నాము. నాగరాజును హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడమే కాకుండా ఆశ్రీన్‌ సుల్తానాకూ, నాగరాజు కుటుం బాలకూ పూర్తి రక్షణ కల్పించాలనీ, ఆశ్రీన్‌ సుల్తానాను ఆదుకోవాలనీ కోరుతున్నాము.

ఈ సంఘటనను సాకుగా చూపి దళితులకూ ముస్లింలకూ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు కొందరు మహనుభావులు. వీరి విష రాజకీయాలకు గురి కావద్దని దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ( కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు)

– ముస్లిం థింకర్స్‌ డయాస్‌
(సయ్యద్‌ సలీంపాషా, డా. ఖాజా, డా. రియాజ్, స్కైబాబ, ఖుర్షీద్, హుసేన్, డా. మాలిక్, ఇనాయతుల్లా, వహీద్‌ మహమ్మద్, డా. రఫీ, షఫీ, నస్రీన్‌ ఖాన్, డా. మహబూబ్‌ బాషా, షేక్‌ పీర్ల మహమూద్, అక్బర్‌ ఆర్టిస్ట్, నబి కరీమ్‌ ఖాన్, డా. అఫ్సర్, డా. యాకూబ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement