కొడుకు పుట్టలేదని చిత్రహింసలు.. | Man tortured his wife | Sakshi
Sakshi News home page

కొడుకు పుట్టలేదని చిత్రహింసలు..

Published Thu, Jan 21 2016 6:18 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

Man tortured his wife

హైదరాబాద్ : కొడుకు పుట్టడం లేదని ఓ కిరాతకుడు భార్యను ఐదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. భర్త వేధింపులను పంటి బిగువున భరిస్తూ సంసారాన్ని ఈదుతున్న మహిళ..  ఆ రాక్షసుడు మరింత విరుచుకుపడి విపరీతంగా కొడుతుండటంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న అబ్దుల్ రహీంకు ఆరేళ్ల క్రితం ఫర్హా బేగంతో వివాహమైంది. అప్పటి నుంచే మగబిడ్డ పుట్టలేదని హింసిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చిత్రహింసలు ఎక్కవవడంతో మనోవేదనకు గురైన మహిళ గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement