![Apsara Assassination Case: Mother Responds Over Social Media - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/12/apsara_murder-case.jpg.webp?itok=WhmvCaqP)
సాక్షి, హైదరాబాద్: ‘అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు చనిపోయింది. ఆ బాధలో నుంచి ఇప్పటికీ మా కుటుంబం బయటికి రాలేదు. హంతకుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నా కూతురు ఆత్మశాంతికి భంగం కలిగిస్తున్నారు’ అంటూ మృతురాలు అప్సర తల్లి అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు చనిపోయిన బాధలో తాము ఉంటే.. తమ పరువును బజారుకీడ్చే పనులు చేయడమేంటని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ నెల 3న సాయికృష్ణ చేతిలో హత్యకు గురైన అప్సరకు గతంలోనే వేరే వ్యక్తితో వివాహమైనట్లు ఫొటోలు, వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలిసి అప్సర తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు.
సంబంధం లేని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయించి తమ కుమార్తె క్యారెక్టర్‌ను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాయికృష్ణను కఠినంగా శిక్షించాల్సింది పోయి తన కుమార్తెనే తప్పు పడతారా అని అన్నారు. ఇదిలాఉండగా అప్సర మొదటి భర్త వివాహమైన కొంత కాలానికే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment