హైదరాబాద్‌ నగరాన్ని మరోసారి ముంచెత్తిన వానలు | Hyderabad Rains Live Traffic Jam Due To Waterlogging On Roads | Sakshi
Sakshi News home page

Hyderabad Rains: హైదరాబాద్‌ నగరాన్ని మరోసారి ముంచెత్తిన వానలు

Published Mon, May 1 2023 7:22 PM | Last Updated on Mon, May 1 2023 7:39 PM

Hyderabad Rains Live Traffic Jam Due To Waterlogging On Roads - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరాన్ని వానలు వీడటం లేదు. ఎప్పడు వర్షం పడుతుందో.. ఎప్పుడో ఎండ కొడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో నగర వాసులు బెంబేలెత్తుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో, వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

హైదరాబాద్‌ నగరాన్ని వానలు మరోసారి ముంచెత్తాయి. నగరంలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మనస్థలిపురం, ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, కొత్తపేట్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌, మాదన్నపేట్‌, సంతోష్‌ నగర్‌, కంచన్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్‌, రామాంతపూర్‌, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, ఘట్కేసర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, ఆల్విన్‌ కాలనీ, బీహెచ్‌ఈఎల్‌, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ ఎంసీ అధికారులను అప్రమత్తం చేస్తూ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. నగర వాసులు త్వరగా ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు హై అలర్ట్‌లో ఉండాలని పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement