heavy rain in hyderabad
-
హైదరాబాద్ నగరాన్ని మరోసారి ముంచెత్తిన వానలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని వానలు వీడటం లేదు. ఎప్పడు వర్షం పడుతుందో.. ఎప్పుడో ఎండ కొడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో నగర వాసులు బెంబేలెత్తుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో, వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని వానలు మరోసారి ముంచెత్తాయి. నగరంలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మనస్థలిపురం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, కొత్తపేట్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, కంచన్‌బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, ఘట్కేసర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, ఆల్విన్ కాలనీ, బీహెచ్ఈఎల్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. Nacharam IDA right now 😲 ⛈️#Hyderabadrains pic.twitter.com/5lSONcMg8p — Devanjan C. (@crazypoorindian) May 1, 2023 Another day, another downpour ⚠️#Hyderabadrains #freakweather pic.twitter.com/iOX285N4Uo — Anirudh J 🇮🇳 (@Anirudhj12) May 1, 2023 మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులను అప్రమత్తం చేస్తూ అర్భన్ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు. నగర వాసులు త్వరగా ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు హై అలర్ట్‌లో ఉండాలని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Moin Bagh the constituency of chandrayangutt assembly #Hyderabad #Telangana #hyderabadRains pic.twitter.com/IhJEeL9vF3 — Syedafroz000 (@AfrozFit) May 1, 2023 Heavy rains alert in the evening now onwards in #Hyderabad Try and reach home early and stay indoors unless it's an emergency @Director_EVDM - Pl let your teams be on high alert @GadwalvijayaTRS @KTRBRS pic.twitter.com/stxVjSLRDw — Arvind Kumar (@arvindkumar_ias) May 1, 2023 And what it left in the process 😂 pic.twitter.com/c3oX0LNG18 — Srinivasan_Krishnamurthy (@SRINIVASAN_97) May 1, 2023 -
వామ్మో.. ఇదేం పిడుగుల వాన!
సాక్షి, హైదరాబాద్: సిటీని జడివాన కష్టాలు వీడడం లేదు. బుధవారం కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఏకధాటి వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట, మాసాబ్‌ట్యాంక్, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైటెక్ సిటీ, షేక్‌పేట్, ఆర్.సి పురం, కూకట్పల్లి, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రాత్రి 11 గంటల వరకు బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. బుధవారం రాత్రి ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా కుండపోత కురిసింది. మునుపెన్నడూ లేనంత పిడుగుల మోతతో నగరం హోరెత్తి పోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, మాసాబ్‌ట్యాంక్, రాజేంద్రనగర్, బండ్లగూడ, మణికొండ, గండిపేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రసూల్‌పురాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు చేరింది. బోరబండ సహా అనేకచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రో కింద భారీగా నీరు చేరింది. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బుధవారం రాత్రి 11 గంటల సమయానికి.. బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్లు, ఫిరోజ్‌గూడలో 9, కుత్బుల్లాపూర్‌లో 8.7, భగత్‌సింగ్‌నగర్‌లో 8.5, ఆర్సీపురంలో 8.3, తిరుమలగిరిలో 7.9, నేరెడ్‌మెట్‌లో 7.7, కూకట్‌పల్లిలో 7.4, సికింద్రాబాద్‌లో 6.6, బొల్లారంలో 5.7, బేగంపేటలో 5.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పాలమూరు అతలాకుతలం మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం మహబూబ్‌నగర్‌ను భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టుప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది. కొన్ని కాలనీల్లో మోకాళ్లలోతు వరకు నీరు రావడంతో జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మహేశ్వరకాలనీ, శివశక్తినగర్, కుర్విహిణిశెట్టి కాలనీ, మధురానగర్, ప్రేమ్‌నగర్, బాయమ్మతోట, అరబ్‌గల్లీ, భవిత కళాశాల ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. న్యూటౌన్, తెలంగాణచౌరస్తా, రాయచూర్ రోడ్లపై నీరు పారడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. భూత్పూర్ రోడ్డులో విద్యుత్ తీగలు తెగిపడడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు గంటసేపు వర్షం కురవగా.. 7.9సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాంనగర్, విద్యానగర్, కూకట్పల్లి, మూసాపేట్, నిజాంపేట్, బాలానగర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం పడుతోంది. రోడ్డుపై వరదనీరు చేరడంతో పలుచోట్లు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. Just now started in Madhapur too. Crazy thunderstorms pic.twitter.com/vsW1P9wGiq — Krishna K (@youkrishna) October 12, 2022 Lightening strikes in Hyderabad.. Take care Darlings #HyderabadRains pic.twitter.com/9Cxx7oOGTo — Raghu Varma (@RaghuVarma_916) October 12, 2022 Raining heavily at balanagar.@Hyderabadrains pic.twitter.com/4xsVWkyBYs — shaik riyaz (@Riyaaazzz) October 12, 2022 -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతగా పడుతున్న వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా పంజాగుట్ట నుంచి సికింద్రబాద్, ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా మదాపూర్‌లో 7.9 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన క్రమంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ రంగంలోకి దిగాయి. -
హైదరాబాద్‌లో భారీ వర్షం, నగర ప్రజలకు పోలీసుల సూచన
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నగరంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థమవడం లేదు. అప్పటి వరకు భగభగమంటున్న సూర్యుడు మాయమైపోయి.. ఒక్కసారిగా మేఘాలు కమ్మేస్తున్నాయి. వర్షం దంచికొడుతుంది అని అనుకునేలోపు అనూహ్యంగా మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో ఊహించని మార్పులతో నగర ప్రజలకు తికమకపడుతున్నారు. భారీ వర్షం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మూడు గంటలపాటు వర్షం కొనసాగే అవకాశం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనరగ్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్ చిలుకానగర్, రామంతపూర్, మణికొండ, పుష్పాలగూడ, కాటేదాన్, రాజేంద్రనగర్, నార్సింగి, అత్తాపూర్, గండిపేటలో వాన పడుతోంది. ఆఫీసులకు, విద్యాసంస్థలకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడుతుండటంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. Heavy rain lashes city. #HyderabadRains #rain #weather @balaji25_t @HYDmeterologist @TS_AP_Weather @Hyderabadrains @swachhhyd @HiHyderabad @Hyderabad_Bot @Weather_AP pic.twitter.com/7t8VODq1xH — Mohammed Farzan Ahmed (@FarzanHyderabad) August 2, 2022 ట్ట్రాఫిక్ పోలీసులు సూచన హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు వర్ష సూచన చేశారు. నగరంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉందని జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, వర్షం తగ్గిన తర్వాతనే బయటికి రావాలని తెలిపారు. వర్షం పడుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పేర్కొన్నారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని, కావున ముందే కొన్ని ముఖ్యమైన రోడ్లలో ఇతర మార్గాలలో వెళ్లాలని చెప్పారు. Wake up call for the day - thunder & lightening accompanied with a down pour! #HyderabadRains #GoodMorning pic.twitter.com/UtX0UMmitG — Atulmaharaj (@Atulmaharaj) August 2, 2022 -
తెలంగాణలో భారీ వర్షం.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. హాఫీజ్పేట్లో అత్యధికంగా 9.85 సెంమీ వర్షపాతం నమోదైంది. బాలానగర్ 9.83 సెం.మీ, గాజుల రామారం 9.7 సెం.మీ, బాలాజీనగర్ 8.7 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 8.5 సెం.మీ వర్షపాతం జీడిమెట్ల 9.7 సెం.మీ రాజేంద్రనగర్ 8.2 సెం.మీ,కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో 8 సెం.మీ వర్షపాతం, మాదాపూర్ 7.65 సెం.మీ, మౌలాలీ 7.25 సెం.మీ, నెరేడ్మెట్ 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక మచ్చబొల్లారం, జగద్గిరిగుట్ట, మియాపూర్, ఆర్సీపురం, రంగారెడ్డినగర్‌లో 6 సెం.మీ వర్షాపాతం, ఫతేనగర్, హెచ్‌సీయూ, మోతీనగర్‌లో 5 సెం.మీ వర్షాపాతం నమోదైంది. To whomever it may concern, due to heavy rain water has been logged near Moosapet metro station. It's causing damage and inconvenience. We hope it'll get addressed at the earliest.#Telanganarains #HyderabadRains @imdhydofficial @balaji25_t @KTRTRS pic.twitter.com/UbBGGn50e8 — Tanjeeb Saqueeb (@TSaqueeb) July 22, 2022 ఇక హైదరాబాద్‌లో రాగల 48 గంటలపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో మోకాళ్లలోతు నీళ్లు వచ్చాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. What can a few hours rain do to you? #HyderabadRains vanakalamchaduvulu 🤨 pic.twitter.com/6OsU8nByU6 — Doesn'tmatter (@doesntmatter2uu) July 22, 2022 Sai Anurag colony near Bachupally #HyderabadRains pic.twitter.com/yu8mms4l5f — VasanSS (@SsVasanssdgl) July 22, 2022 -
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీశాయి రాళ్ల వర్షం కురిసింది. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతమంతా మేఘాలు కమ్ముకున్నాయి.గచ్చిబౌలి, హెచ్‌సీయూ, తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, బంజారాహిల్స్, పుప్పాలగూడ, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, అత్తాపూర్, గండిపేటతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గాలి దూమరానికి నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు కొట్టుకు వచ్చాయి. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వసం అవ్వగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ఏరియాలో చాలా రోజుల తర్వాత కుండపోత వర్షం పడింది. చదవండి: Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం -
బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్ జగదీష్
సాక్షి, హస్తినాపురం: వనస్థలిపురం సమీపంలోని చింతల్‌కుంటలో శుక్రవారం రాత్రి నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. మహేశ్వరం మండలం మంకాల్ గ్రామానికి చెందిన పి.జగదీష్ (45) భారీ వర్షంలో బైకుపై వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వైపు బయలుదేరాడు. చింతల్‌కుంట వద్దకు రాగానే బైకుతో సహా నాలాలో పడి కొట్టుకుపోయాడు. పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. డ్రైనేజీ నుంచి వాహనాన్ని బయటకు తీశారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జగదీష్ ఆచూకీ లభించింది. నాలాలో పడిపోగానే తాడు దొరకడంతో దాని సాయంతో జగదీష్ బయటపడ్డాడు. అనంతరం ఆయన కర్మన్‌ఘాట్ లోని తన సోదరుడి నివాసానికి వెళ్లాడు. ఈ విషయాన్ని జగదీష్ సోదరుడు వెల్లడించారు. చదవండి: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. టైర్ నడుముపై నుంచి వెళ్లడంతో -
డబుల్ ‘ధమాకా’ : సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్‌కు ఏకంగా రూ.1,050
సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లు, ఆటోలు ఠారెత్తించాయి.. చార్జీల మోత మోగించాయి.. ఒకవైపు సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. మరోవైపు భారత్ బంద్ నేపథ్యంలో నెలకొన్న ప్రభావంతో నగరంలో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. ఆటోలు, సెవెన్‌సీటర్ ఆటోలు రెట్టింపు చార్జీలను వసూలు చేయగా, క్యాబ్‌లలో సర్ చార్జీలు, పీక్ అవర్స్ నెపంతో అమాంతంగా పెంచారు. సాధారణ రోజుల్లో ఉండే చార్జీలకంటే రెట్టింపు చెల్లించాల్సి వచి్చందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, తదితర రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికులు, ఆసుపత్రులు వంటి అత్యవసర పనులపై బయటకు వెళ్లిన వాళ్లు నిలువుదోపిడీకి గురయ్యారు. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం ఇదేం సర్‌చార్జీ.. సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10 వరకు క్యాబ్ చార్జీ రూ.300 నుంచి రూ.350 వరకు ఉంటుంది. కానీ సోమవారం ఇది ఏకంగా రూ.1,050 వరకు చేరింది. సెడాన్లలో రూ.1,250 వరకు చార్జీలు వసూలు చేశారు. సర్‌చార్జీలతో ప్రయాణికులపై క్యాబ్ సంస్థలు అదనపు బాదుడుకు పాల్పడ్డాయి. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొనే సమయానికి క్యాబ్‌లు అందుబాటులో లేవనే అంశాన్ని సాకుగా చూపుతూ సమీప ప్రాంతాల్లో ఉన్న క్యాబ్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు సర్ చార్జీల రూపంలో అదనపు చార్జీలు విధిస్తున్నారు. చదవండి: ఎల్బీ నగర్: యువతిపై కానిస్టేబుల్ లైంగికదాడి ► సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే కనిపించే రద్దీని వర్షం దృష్ట్యా అన్ని వేళల్లో రద్దీ ఉన్నట్లు చూపుతూ పీక్ అవర్స్(రద్దీ గంటలు)లో అదనపు చార్జీలను విధించారు. దీంతో ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వరకు రూ.200 వరకు ఉండే చార్జీలు సోమవారం సాయంత్రం ఏకంగా రూ.500 దాటినట్లు వెంకటేశ్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్.. అయినా! ► నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న చార్జీలు సాయత్రం అమాంతంగా పెరిగాయి. మరోవైపు క్యాబ్ సంస్థలు విధించే సర్‌చార్జీలు, పీక్‌అవర్స్ చార్జీల్లో తమకు ఏ మాత్రం లభించడం లేదని, కేవలం ఆయా సంస్థల ఖాతాల్లోనే జమ అవుతుందని డ్రైవర్లు వాపోతున్నారు. పెరిగిన క్యాబ్‌ల వినియోగం.. ► కోవిడ్ దృష్ట్యా తీవ్రంగా నష్టపోయిన క్యాబ్‌లు ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నాయి. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు వాహనాలను వదులుకొని ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకోవాల్సి వచ్చింది. కానీ లాక్డౌన్ అనంతరం కోవిడ్ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో రెండు నెలలుగా క్యాబ్‌ల వినియోగం పెరిగింది. ► ప్రతిరోజూ 40 వేలకు పైగా క్యాబ్‌లు తిరుగుతున్నట్లు అంచనా. ఐటీ, పర్యాటక రంగాలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో పాటు అంతర్జాతీయ రాకపోకలు తిరిగి మొదలైతే మరో 20 వేలకు పైగా క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉండగా కోవిడ్ నష్టాన్ని పూడ్చుకునేందుకే క్యాబ్ సంస్థలు దోపిడీకిపాల్పడుతున్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఆటో ఇష్టారాజ్యం.. చాలాకాలంగా మీటర్లను వినియోగించకుండానే నడుపుతున్న ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. సోమవారం బంద్ వార్తలతో పాటు వర్షం కూడా తోడవడంతో బాహాటంగానే తమ దోపిడీ పర్వాన్ని సాగించారు. జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు ఏకంగా రూ.280 తీసుకున్నట్లు ఒక ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశాడు. వర్షం కారణంగా త్వరగా ఇళ్లకు చేరుకోవాలని ఆటోలను ఆశ్రయించిన వారికి ఆటోవాలాలు పట్టపగలే చుక్కలు చూపించారు. -
భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం ఫొటోలు
-
హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం
-
హైదరాబాద్: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, పంజాగుట్టలో కుండపోతగా వర్షం కురిసింది. అమీర్‌పేట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్‌లోనూ వర్షం దంచుతోంది. నగరంలో వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగర వాసులు సాధ్యమైనంతమేర కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగరంలో వరద నీరు నిలిచిపోవడం, వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను వెంటనే తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తతతో ఉన్నాయని ఆయన తెలిపారు. -
హైదరాబాద్‌లో మళ్లీ కుండపోత వర్షం
-
నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కుండపోత వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు మెయిన్ జంక్షన్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలు కదలాలంటే గంటలకొద్దీ సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తమ ప్రయాణాన్ని మరో రెండు గంటలు వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ సూచించారు. లేకుంటే ట్రాఫిక్ జామ్ పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని ఆయన తెలిపారు. అమీర్‌పేట శ్రీనగర్ కాలనీలో ఓ నాలా పొంగి పొర్లుతుండగా అందులో నుంచి ఓ వ్యక్తి మృతదేహం బయటపడినట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. భాగ్యనగరంపై రెండు రోజుల పాటు కరుణ చూపిన వరుణుడు మరోసారి విజృంభించాడు. నగరంలోని పలుచోట్ల గురువారం సాయంత్రం ఆరున్నర సమయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట, సరూర్‌నగర్, సంతోష్ నగర్లో భారీ వర్షం పడగా..బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మోహదీపట్నం, పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. అలాగే అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, కూకట్పల్లి, మియాపూర్,నిజాంపేట, సికింద్రబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్, హియాయత్ నగర్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠీ, పాతబస్తీలో భారీ వర్షం పడుతోంది. అలాగే చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, గౌలిపురా, భవానీ నగర్, లాల్ దర్వాజా, షా అలీ బండ, హనుమాన్ నగర్, పార్వతి నగర్, ఫలక్ నుమా, అరుంధతి కాలనీ, పటేల్ నగర్, షంపేట్ గంజ్, శివాజీ నగర్, శివగంగ నగర్ రోడ్లపై వర్షం నీరు ప్రవహిస్తోంది. మరోవైపు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఇప్పటికే పలు కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షం పడటంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక గాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. అలాగే కుండపోత వర్షంతో గ్రేటర్‌లోని 16 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిందని అధికారులు గుర్తించారు. కాగా రేపుకూడా హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు టీ-20 మ్యాచ్‌కు వర్షం దెబ్బ తగిలింది. భారీ వర్షంతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్ద అయింది. దీంతో ఉప్పల్ స్టేడియాన్ని మైనపు కవర్లతో కప్పి ఉంచారు. -
‘హైదరాబాద్‌ను నరక నగరంగా మార్చారు’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ...‘హైదరాబాద్ విశ్వనగరం సంగతి దేవుడెరుగు...కేసీఆర్ హైదరాబాద్‌ను నరక నగరంగా మార్చారు. గవర్నర్ బంగ్లా ముందు నీళ్లు నిలుస్తున్నాయని కేసీఆర్ గతంలో విమర్శించారు. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు నీళ్లు నిల్చినా ఎందుకు మాట్లాడటం లేదు. వర్షాలు, వరదనీటితో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఆయన నటుడు ప్రకాశ్ రాజ్‌పై మండిపడ్డారు. శాంతి భద్రతల గురించి అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారన్నారు. గౌరీ లంకేశ్ హంతకులను కర్ణాటక ప్రభుత్వం శిక్షిస్తే ఎవరొద్దనరని అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడి పరువు తీసుకోవద్దని లక్ష్మణ్ ఈ సందర్భంగా సూచించారు. కాగా గత ఆదివారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయింది. నిన్న వర్షం కురిసినప్పటికీ ఆ ప్రభావం ఇవాళ కూడా కనిపించింది. మాదాపూర్, గచ్చిబౌలి వయా జూబ్లిహిల్స్‌కు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ జాంలో నరకం అనుభవించారు. సాధారణంగా ఉదయం వేళల్లో 40 నిమిషాలలో చేరుకోవలసి ఉండగా మంగళవారం సుమారు 5 గంటలు సమయం పట్టింది. కంపెనీలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు సకాలంలో చేరుకోలేక పోయారు. ఐటీ ప్రాంతంలోని రోడ్ల పై వర్షం నీరు నిల్చిపోవడం, భారీగా గుంతలు ఏర్పడ్డాయి. భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయి కారు ఇంజిన్లోకి నీరు చేరి మొరాయించడంతో కార్లు ఎక్కడికక్కడే నిల్చిపోయాయి. దీంతో ట్రాఫిక్ జాం మరింత పెరిగింది. రహేజా ఐటీ పార్క్ నుంచి బయో డైవర్సిటీ వరకు రోడ్డు పనులు జరుగుతుండటం, ఈ ప్రాంతంలొనే ట్రాఫిక్ దారి మళ్లించటం వంటి పనులతో ట్రాఫిక్ జాంకు కారణమవుతుంది. భారీ వర్షాలు కురుస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు ముందు చూపుతో వ్యవహరించక పోవడం సమస్యకు మరింత ఊతం ఇస్తోంది. సాయంత్రం అవుతుండడంతో ఐటీ ఉద్యోగుల్లో తిరుగు ప్రయాణం తలచుకొని ఆందోళన చెందుతున్నారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరవాసులు కార్యాలయాల నుంచి సాయంత్రం ఇంటికి చేరే సమయంలో వర్షం కురవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, సైదాబాద్, వనస్థలిపురం, కొత్తపేట, ఎల్బీనగర్, బంజారాహిల్స్, గోల్నాకా, మలక్‌పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
11 గంటల వరకూ రోడ్లపైకి రావొద్దు..
►ఈ రూట్లలో కాస్త చూసి వెళ్లండి హైదరాబాద్: నగరంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. కుండపోతగా కురిసిన వర్షం ఇప్పుడిప్పుడే తెరిపినిస్తుండటంతో.. కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు రోడ్డెక్కుతున్నారు. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో.. ఎక్కడ మ్యాన్‌హోల్ ఉంది, ఎక్కడ గుంటలు ఉన్నాయో కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 18 ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ఛే నంబర్ చౌరస్తా నుంచి అంబర్‌పేట వరకు, నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ ముందు, మొజంజహి మార్కెట్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు, బల్కంపేట పెట్రోల్ బంక్, చాదర్‌ఘాట్ నుంచి పుత్లిబౌలీ చౌరస్తా వరకు, అమీర్‌పేట ఇమేజ్ ఆస్పత్రి ఎదుట, కేసీపీ జంక్షన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మార్గాల్లో వెళ్లాల్సిన వారు ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం నుంచే జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నప్పటికి మరో రెండు గంటలపాటు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉండటంతో.. వాహనదారులు రద్దీ లేని ప్రాంతాలను ఎంచుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా అత్యవసరం అయితేనే తప్ప, మిగతావారు ఉదయం 11 గంటల వరకూ రోడ్లపైకి రావద్దని సలహా ఇస్తున్నారు. అమీర్‌పేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో నగరానికి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వందలాదిగా నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బేగంపేట, నిమ్స్, తార్నాక, గోల్నాక, పాత గాంధీ ఆస్పత్రి, మలక్‌పేట్ రైల్వే అండర్ బ్రిడ్జి, షేక్‌పేట నాలా, టోలిచౌకీ, నింబోలి అడ్డ, తిలక్‌నగర్, హిమాయత్‌నగర్, నల్లగొండ క్రాస్ రోడ్డు, చంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. నగర శివారులోని పలు లోతట్టు ప్రాంతాలు జటమయమవడంతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మరోవైపు లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
హైదరాబాద్ :శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని కుదిపేసింది. నగర జీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ ఏరులై పారుతున్నాయి. వర్షం కారణంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్, ఖైరతాబాద్, కోఠి, నాంపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. పలు కాలనీల్లో కరెంటు వైర్లు తెగిపడిన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇళ్లకు చేరుకోవాలనుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వర్షం కాస్తా తెరపినివ్వడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో నగరంలో అన్ని చోట్లా విపరీతమైన ట్రాఫిక్ జాంలు ఏర్పడ్డాయి. ఎల్ బీ నగర్ నుంచి మియాపూర్ వరకు రహదారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోయింది. కోటీ నుంచి చాదర్ ఘాట్ చేరుకోవడానికి వాహనదారులకు రెండు గంటలు పట్టింది. ఖైరతాబాద్ నుంచి అమీర్ పేట చేరుకోవడానికి అంతే సమయం పట్టింది. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో ఒక్క కిలోమీటర్ ముందుకు వెళ్లడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టడంతో వాహనదారులు గగ్గోలు పెట్టారు. నగర రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ముందుకు కదలలేని పరిస్థితి తలెత్తింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఆదర్శ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో భారీ వృక్షం కూలడంతో దానికింద మూడు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోనీ మిరాలం ట్యాంకులోకి వరద నీరు చేరుతుండటం, సమీపంలోని జూ పార్క్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్రం ఏడు గంటలకు బాలానగర్ లో 68.25 మిల్లీమీటర్లు, కూకట్ పల్లి ప్రాంతంలో 48.5 మిమీ, అమీర్ పేటలో 41.25మిమీ, హిమాయత్ నగర్ లో 25.25 మిమీ వర్షపాతం నమోదైంది. ఈరోజు సాయంత్రం ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ ఇంకా ప్రకటించాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఎండ రావడం, మరోవైపు గణేశ్ నిమజ్జనం సజావుగా పూర్తయి అంతా ఊపిరి తీసుకోగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండున్నర గంటల పాటు భారీ వర్షం కురియడంతో పరిస్థితి అతలాకుతలంగా మారింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఎక్కడా పోలీసులు కనిపించడంలేదని వాహనదారులు గగ్గోలు పెట్టారు. గడిచిన రెండు రోజుల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ గుంతలేర్పడగా, తాజా వర్షానికి రోడ్లపై నీటి వరదలోనే వాహనాలు రోడ్లెక్కాయి. వర్షం తగ్గిన గంట తర్వాత కూడా ట్రాఫిక్ జాం పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. భారీ వరద రావడంతో మూసీ పొంగి పొర్లుతోంది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీటిని తోడేయడానికి మున్సిపల్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ తెరవవద్దని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. నమోదైన వర్షపాతం వివరాలు: బాలనగర్ 6.8 సెంటీమీటర్లు శేరిలింగంపల్లి 4.8 ఆసిఫ్ నగర్ 4.1 అమీర్ పేట 4.1 ఖైరతాబాద్ 4 సికింద్రాబాద్ 2.9 మారేడ్ పల్లి 2.5 హిమాయత్ నగర్ 2.2 కుత్బుల్లాపూర్ 1.9 గోల్కోండ 1.8 తిరుమలగిరి 1.2 అంబర్ పేట 1 సెంటీమీటరు వర్షపాతం -
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
-
హైదరాబాద్ లో భారీ వర్షం
-
భారీవర్షానికి తడిసిముద్దైన రాజధాని