
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరవాసులు కార్యాలయాల నుంచి సాయంత్రం ఇంటికి చేరే సమయంలో వర్షం కురవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సైదాబాద్, వనస్థలిపురం, కొత్తపేట, ఎల్బీనగర్, బంజారాహిల్స్, గోల్నాకా, మలక్‌పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.