
చాంద్‌పాషా, తెగిపోయిన చెవి
కాగజ్‌నగర్‌టౌన్(సిర్పూర్) ఆదిలాబాద్ : శుభకార్యానికి పిలవడానికి ఇంటికి వచ్చిన బావమరిదిని బావ చెవి ఊడిపోయేలా కొరికిన ఘటన గురువారం కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని కాపువాడకు చెందిన ఎండీ అజీమ్‌ను చిన్నపాటి శుభకార్యానికి పిలవడానికి బావమరిది చాంద్‌పాషా ఇంటికి వెళ్లాడు.
చిన్నచిన్న కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో బావ అజీమ్ ఒక్కసారిగా అతనిపై దాడిచేసి చాంద్‌పాషా చెవి కొరికేశాడు. బాధితుడు అరుపులు కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు, కుటుంబీకులు, కాలనీవాసులు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చెవి పూర్తిగా తెగిపోయింది. ఆపరేషన్ చేసే పరిస్థితి లేదని డాక్టర్లు కుటుంబీకులకు తెలిపారు. బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ వెంకటేశ్వర్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment