
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో అరుదుగా క్రికెటర్లకు లభించే అవకాశం భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు దక్కింది. ‘నాడా’కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)లో సభ్యునిగా సెహ్వాగ్ ఎంపికయ్యాడు. క్రికెట్‌ను కూడా ‘నాడా’ పరిధిలోకి తీసుకురావాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో కమిటీలో సెహ్వాగ్ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది. సెహ్వాగ్‌తో పాటు డిల్లీ మాజీ క్రికెటర్ వినయ్ లాంబా తదితరులు ఆరుగురు సభ్యుల ఈ కమిటీలో ఉన్నారు. అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్– ఏడీడీపీ)ని కూడా ‘నాడా’ నియమించింది.
ఈ కమిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు చోటు కల్పించింది. అయితే ఆశ్చర్యకంగా 2001లో డోపింగ్ కారణంగా ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన వెయిట్ లిఫ్టర్ కుంజరాణికి ఈ కమిటీలో సభ్యురాలిగా నియమించడం విశేషం. కుంజరాణితో పాటు ఏడీడీపీ కమిటీలో అఖిల్ కుమార్ (బాక్సింగ్), రీత్ అబ్రహం (అథ్లెటిక్స్), జగ్బీర్ సింగ్ (హాకీ), రోహిత్ రాజ్‌పుట్ (టెన్నిస్) తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment